• English
  • Login / Register

మహీంద్రా థార్‌ యొక్క ఈ వేరియెంట్ ను పొందాలంటే సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే

మహీంద్రా థార్ కోసం tarun ద్వారా మార్చి 06, 2023 10:45 am ప్రచురించబడింది

  • 48 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఒకటి మినహాయించి, థార్ అన్నీ వేరియెంట్‌ల వెయిటింగ్ పీరియడ్ సుమారుగా ఒక నెల మాత్రమే.

Mahindra Thar RWD

  • థార్ డీజిల్ RWD వేరియెంట్ కోసం సుమారుగా 1.5 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది.

  • అయితే 4WD, పెట్రోల్ RWD వేరియెంట్ؚలను సుమారు ఒక నెలలోనే పొందవచ్చు. 

  • డీజిల్ RWD ప్రజాదరణకి ముఖ్యమైన కారణాలలో దీని రూ.10 లక్షల ధర ఒకటి. 

  • థార్ RWD వేరియెంట్ؚలు 118PS, 1.5-లీటర్ డీజిల్ మరియు 150PS 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది. 

థార్ రేర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియెంట్ؚలను మహీంద్రా 2022 చివరి త్రైమాసికంలో విడుదల చేసింది, రెండవ-జనరేషన్ ఫోర్-వీల్ డ్రైవ్ థార్ కూడా 2020లో ఇలాగే వచ్చింది. చవకైన RWD మోడల్ కోసం వేచి ఉండాల్సిన సమయం మరింతగా పెరుగుతుంది. చాలా వేరియెంట్ؚల వేచి ఉండాల్సిన సమయం సుమారు ఒక నెల ఉండగా, ఈ ఆఫ్-రోడర్ ఒక ప్రత్యేక వేరియెంట్ కోసం వేచి ఉండాలసిన సమయం మాత్రం సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది. 

వివరణాత్మక వెయిటింగ్ పీరియడ్ 

మోడల్ 

వెయిటింగ్ పీరియడ్

హార్డ్ టాప్ డీజిల్ 4WD

3-4 వారాలు

హార్డ్ టాప్ పెట్రోల్ 4WD

3-4 వారాలు

కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్ 4WD

3-4 వారాలు 

హార్డ్ టాప్ డీజిల్ RWD (రేర్-వీల్-డ్రైవ్)

72-74 వారాలు

హార్డ్ టాప్ పెట్రోల్ RWD

3-5 వారాలు

4WD థార్ సుమారు ఒక నెలలో పొందవచ్చు, పెట్రోల్-ఆధారిత రేర్-వీల్ డ్రైవ్ వేరియెంట్ؚల విషయంలో కూడా అంతే. అయితే, వేరియెంట్ మరియు కొనుగోలు చేసిన ప్రదేశంపై ఆధారపడి డీజిల్ RWD విషయంలో మాత్రం 1.5 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంది. మీరు ఇప్పుడు బుక్ చేస్తే, దాన్ని మీరు బహుశా 2024 పండుగ సీజన్ నాటికి పొందగలరు. 

ఇది కూడా చదవండి: టాటా నానోతో ఈ యాక్సిడెంట్‌లో బోల్తా పడిన మహీంద్రా థార్

Mahindra Thar rear

డీజిల్ RWD ఎందుకు?

మహీంద్రా SUVలలో అత్యంత ప్రజాదరణ పొందినది డీజిల్ ఇంజన్, దీన్ని RWD సెట్అప్ؚలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో అందిస్తున్నారు. థార్ డీజిల్ RWD AX (O) వేరియంట్ ధర రూ. 9.99 లక్షలుగా ఉంది, ఈ లైన్అప్ؚలో ఇది అత్యంత చవకైన ఎంపిక. మెరుగైన పరికరాలతో వచ్చే LX వేరియెంట్ ధర దీని కంటే ఒక లక్ష రూపాయలు ఎక్కువ. కేవలం ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే వస్తున్నందున పెట్రోల్ RWD ధర రూ.3.5 లక్షలు ఎక్కువ. ముఖ్యంగా, థార్ అత్యంత చవకైన వేరియెంట్, ఎంట్రీ-లెవెల్ 4WD వేరియెంట్ؚల ధర కంటే రూ. 4 లక్షలు తక్కువ. 

అనేక సార్లు ధరలను పెంచిన తర్వాత, 4WD వెర్షన్ బేర్-బోన్స్ బేస్ వేరియెంట్ؚలను నిలిపివేసిన వెంటనే, థార్ చవకైన వెర్షన్ؚగా రేర్-వీల్ డ్రైవ్ వేరియెంట్ؚను పరిచయం చేసింది. చాలా మందికి థార్ ప్రియమైన వాహనం అయినప్పటికీ, 4WD వినియోగం మరియు పూర్తి సామర్ధ్యాలు కొంత మంది కొనుగోలుదారులకు మాత్రమే పరిమితంగా ఉంది. RWDతో, కొనుగోలుదారులు కొంతవరకు థార్ؚను సొంతం చేసుకోవడమే కాకుండా, ఎక్కువ డబ్బును ఆదా చేయగలరు. 

దీన్ని కూడా చదవండి: ChatGPT ప్రకారం 4 ఉత్తమ భారతీయ కార్‌లు ఇవే

డీజిల్ RWD వేరియెంట్ؚను మరింత చవకగా చేసేవి ఏవి?

4WDను తొలగించడం థార్ ధరను చాలా వరకు తగ్గిస్తుంది. 4WD వెర్షన్ 130PS 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ؚను చిన్నదైన 118PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో మార్చడం కూడా ఈ కొత్త వేరియెంట్‌లను మరింత చవకైనవిగా చేసింది. 

మహీంద్రా థార్ ధర రూ.9.99 లక్షల నుండి రూ.16.49 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్). ఇది ఫోర్స్ గూర్ఖా మరియు త్వరలోనే విడుదల కాబోతున్న మారుతి సుజుకి జీమ్నీతో పోటీ పడనుంది. 

ఇక్కడ మరింత చదవండి: థార్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra థార్

Read Full News

explore మరిన్ని on మహీంద్రా థార్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience