Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నేడు అబార్త్ 595 ను 29.85 లక్షల వద్ద ప్రారంబించిన ఫియట్

ఆగష్టు 04, 2015 12:53 pm manish ద్వారా సవరించబడింది

జైపూర్: ఫియట్ 595 అబార్త్ కాంపిటిజన్ ను నేడు ప్రారంబించారు. పనితీరు ఆదారిత అబార్త్ 500 ను 2014 లో ఢిల్లీ మోటార్ షోలో వద్ద ఫియాట్ ఇండియా ప్రదర్శించింది. సరిగ్గా సంవత్సరం తరువాత ఫియాట్ ఇండియా ఆగస్ట్టు 4, 2015 న ఫియాట్ అబార్త్ 595 కాంపిటిజన్ ను ప్రవేశపెట్టింది.

అబార్త్ 595 కాంపిటిజన్, 1.4 లీటర్ మల్టీ ఎయిర్ టర్బో- పెట్రోల్ ఇంజన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 5500 ఆర్ పి ఎం వద్ద 158 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 2750 ఆర్ పి ఎం వద్ద 201 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ టార్క్ అవుట్పుట్ నార్మల్ మోడ్ లో 201 ఎన్ ఎం గల టార్క్ ను విడుదల చేస్తుంది. మరోవైపు, స్పోర్ట్స్ మోడ్ లో 230 ఎన్ ఎం గల పీక్ టార్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఏ ఎం టి (ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీనిలో మాన్యువల్ ఓవరిడ్ సిస్టం ను కూడా అమర్చారు.

ఇటీవల, ఫియట్ యొక్క పుంటో అబార్త్ యొక్క గూఢచారి షాట్ల ను కూడా వీక్షించాము. కానీ ఇటీవల అధిక పనితీరు కలిగిన అబార్త్ 595 కాంపిటిజన్ 17- అంగుళాల అల్లాయ్ వీల్స్ తో విడుదల అయ్యింది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ఎత్తు, దాని ఏరోడైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు 105మ్మ్ తగ్గింది. ఈ వాహనం స్పోర్టీ లుక్ ను ఇవ్వడానికి, అబాత్ డికాల్స్ తో, జంట ఎగ్జాస్ట్ పైప్స్, స్పోర్ట్స్ సీట్స్, సన్ రూఫ్, ఫియాట్ బోటం స్టీరింగ్ వీల్ వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా భద్రత విషయానికి వస్తే, ఈ వాహనం, ఏడు ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్లిప్ డిఫ్ఫెరెన్షియల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫొర్స్ డిస్ట్రిబ్యూషన్, టార్క్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ (టి టి సి) వంటి బద్రతా లక్షణాలను కలిగి ఉంది.

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర