ఫియాట్ ఇండియా వారు డిసెంబర్ 17 నుండి 19 మధ్యలో చెకప్ క్యాంప్ ను అందించబోతున్నారు
డిసెంబర్ 16, 2015 05:33 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ:ఫియాట్ ఇండియా వారు ఉచిత వింటర్ చెకప్ క్యాంప్ ను డిసెంబర్ 17 నుండి 19 మధ్య దేశవ్యాప్తంగా తమ డీలర్ల వద్ద అందించనున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ క్యాంప్ ప్రస్తుతం తమిళనాడులో అందించబడదు. ఎందుకంటే, ఈ సంస్థ ప్రస్తుతం తమిళనాడులోని తుఫాన్ బాధిత వినియోగదారుల సేవకు ముందు ప్రాముక్యతను ఇస్తున్నారు.
ఇక వీరు అందించే సేవలలో బ్యాటరీ, బ్రేక్స్ మరియు టైర్స్, బాహ్యభాగాలు మరియు లైటింగ్, హీటింగ్ మరియు వెంటిలేషన్, ఇంజిన్ తీరుతెన్నులు, యాంటీ ఫ్రీజ్ డీఫ్రాస్టర్ వైపర్ బ్లేడ్స్, బెల్ట్స్ మరియు హోసెస్ విభాగాలలో అందించబడతాయి. అదనంగా ఫియాట్ వారు 10% డిస్కౌంట్ ను లేబర్ మరియు స్పేర్ పార్ట్స్ పైన అందిస్తున్నారు.
ఈ సేవల గురించి కెవెన్ ఫ్లెన్, ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఫియాట్ క్రెజ్లర్ ఇండియా ఆపరెషన్స్ ఇలా అన్నారు " ఈ సాధారణ చెకప్ క్యాంపులు భారతీయ FCA ద్వారా వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా సేవలను అందించే లక్ష్యంగా ఉంటాయి మరియు వారి యాజమాన్య అనుభూతిని పెంచే విధంగా ఫియాట్ సర్వీస్ స్టేషన్లు ఉండబోతున్నాయి. ఇంకా FCA ఇండియా యొక్క సేవా కార్యాకలాపాలలోని ఉద్యోగులు ఉత్తమమైన శిక్షణను పొంది ఉన్నతమైనటువంటి వినియోగదార ఆధారిత సేవలను అందించగలుగుతారు. భారతదేశం ప్రస్తుతం FCA కు ఒక వ్యూహాతమక ప్రదేశంగా చెప్పవచ్చు." అని ఆయన వివరించారు.
ఇది ఫియాట్ వారి తొలి కస్టమర్ క్యాంప్ కాదు. ఈ సంవత్సరం ప్రధమార్ధంలో ఫియాట్ వారు ఇటువంటి అనేక క్యాంపులను అందించడం జరిగింది.