ఒక ఫియట్ డీలర్‌షిప్ దగ్గర అబార్త్ పుంటో ఈవో క్యామెరాకు చిక్కింది
అక్టోబర్ 12, 2015 03:53 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఎంతగానో ఎదురుచూస్తున్న ఫియట్ వారి హ్యాచ్ బ్యాక్ అయిన అబార్త్ పుంటో ఈవో మళ్ళీ అది కూడా ఈసారి ఒక డీలర్షిప్ ఎదురుగా పార్క్ చేసి కంటపడింది. ఇది వైట్ మరియూ నలుపు రంగులలో లభ్యం అవుతూ వాటిపై ఎరుపు డీకాల్స్ ని కలిగి ఉండి అక్టోబరు 19 న విడుదల అవ్వనుంది.
ఇందులో 1.4-లీటర్ T-జెట్ మోటరు అమర్చబడి ఉంటుంది. ఇది 145bhp శక్తి ఇంకా 212Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ మోటరు సామర్ధ్యం ఫోక్స్వాగెన్ పోలో GT TSI ఇంకా ఫోర్డ్ ఫీగో 1.5-లీటర్ TiVCT పెట్రోల్ లతో పోటీగా నిలుస్తుంది. ఈ పునరుద్దరించిన పుంటో గంటకి 0 నుండి 100 కీ.మీ లు కేవలం 8.8 సెకనుల్లో చేరుకుంటుంది మరియూ గంటకి 180 కీ.మీ ల గరిష్ట వేగం చేరగలదు.
బాహ్యాలకి స్పోర్టీ స్టైలింగ్ వచ్చి పాత పుంటో కి బిన్నంగా కనపడుతుంది. పైగా, ముందు ఇంకా వెనుక బంపర్లపై ఎరుపు పూతలు, రేస్ స్టిప్ లు ఇంజిను నుండి పై కప్పు వరకు ఇంకా టెయిల్ గేట్ పై కూడా ఉంటాయి. దీనికి 16-అంగుళాల డైమండ్ కట్ స్కార్పియన్ అల్లొయ్స్ ఇంకా అబార్త్ బ్యాడ్జింగ్ ఉంటాయి.
ఆల్-బ్లాక్ సెటప్, సీట్లపై విభిన్న కుట్టు ఇంకా స్టీరింగ్ వీల్ పై అబార్త్ ఇన్సిగ్నియా తప్పించి లోపల అంతా అలానే ఉంది
ఇతర ముఖ్యాంశాలు, డ్యువల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్-ఈబీడీ మరియూ డిస్క్ బ్రేకులు అన్ని చక్రాలకి. ధర పరంగా, 10 లక్షల లోపు ఉండవచ్చును.