Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నవీకరించిన టాటా సఫారి క్యాబిన్‌ను భారీగా పునరుద్ధరించినట్లు తెలియచేస్తున్న మొదటి రహస్య చిత్రాలు

టాటా సఫారి కోసం ansh ద్వారా జూన్ 21, 2023 06:56 pm ప్రచురించబడింది

నవీకరించిన టాటా సఫారి కొత్త కర్వ్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన కొత్త సెంటర్ కన్సోల్ؚను పొందనుంది.

  • 2024 ప్రారంభంలో ఆవిష్కరించబడుతుందని అంచనా.

  • అవిన్యా మరియు కర్వ్ కాన్సెప్ట్ؚల నుండి కొత్త స్టీరింగ్ వీల్ؚను పొందనుంది.

  • నిలిపివేస్తున్న మోడల్ؚలో ఉన్న 2-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚలతో వస్తుంది.

  • దీని ధర రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

రీడిజైన్ చేసిన ఎక్స్ؚటీరియర్‌ను చూపించే నవీకరించిన టాటా సఫారి చిత్రాలు అనేక సార్లు కనిపించగా, కొత్త చిత్రాలలో 19-అంగుళాల అలాయ్ వీల్స్ ఉండటాన్ని గమనించవచ్చు, మొదటిసారిగా ఈ SUV ఇంటీరియర్ రహస్య చిత్రాలలో కనిపించగా, రానున్న వాహనం ఇంటీరియర్ వివరాలను మొదటిసారి తెలియజేసింది. నవీకరించిన సఫారి భారీగా రీడిజైన్ చేసిన క్యాబిన్ؚతో వస్తుంది అని ఈ చిత్రాలు సూచిస్తున్నాయి:

సరికొత్త క్యాబిన్

రహస్య చిత్రాల ప్రకారం, నవీకరించిన టాటా SUV పూర్తిగా రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ؚతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది ప్రస్తుత వేరియెంట్ؚలో కూడా ఉంది. కర్వ్ కాన్సెప్ట్ؚలో ఉండే హాప్టిక్ కంట్రోల్స్ؚతో క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త సెట్అప్ؚను పొందవచ్చు, సెంటర్ AC వెంట్ؚలు కూడా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తున్నాయి.

మధ్యలో డిస్ప్లేతో పాటు, టాటా అవిన్యా కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్ؚను రహస్య చిత్రాలలో చూడవచ్చు, వీల్ వెనుక ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా గమనించవచ్చు. ఈ స్టీరింగ్ వీల్ నవీకరించిన టాటా నెక్సాన్ టెస్ట్ వాహనంలో కూడా కనిపించింది. అయితే, అప్‌డేట్ చేసిన నెక్సాన్ؚలో ఉన్నట్లు కాకుండా, ఇది మరింత ఫంక్షనాలిటీలను అందించవచ్చు; మేము పేర్కొన్నట్లు, బ్యాక్‌లిట్ టాటా లోగో కాకుండా డ్రైవ్ సమాచారాన్ని కూడా ఇది ప్రదర్శిస్తుందని అంచనా.

టాటా నెక్సాన్ EV మాక్స్‌లో అందించిన డిస్ప్లేను కలిగి ఉండే డ్రైవ్ మోడ్ సెలక్టర్ؚను పొందవచ్చు, మరియు సరికొత్త గేర్ నాబ్‌ను కూడా అందిస్తున్నారు. డ్యాష్‌బోర్డ్ؚతో సహా డిజైన్ؚ పరంగా పూర్తిగా మార్పులతో వస్తుంది అని ఆశించవచ్చు, ఈ మార్పులతో నవీకరించిన సఫారి ప్రీమియం క్యాబిన్ అంబియెన్స్‌ను పొందుతుంది.

పవర్‌ట్రెయిన్ؚలో మార్పులు

నవీకరించిన సఫారి ప్రస్తుత మోడల్‌లో ఉన్న 2-లీటర్‌ల డీజిల్ ఇంజన్ؚను నిలుపుకుంటుందని అంచనా. ఈ యూనిట్ 170PS పవర్ మరియు 350 Nm టార్క్‌ను అందిస్తుంది మరియు దీన్ని 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో అందించనున్నారు.

ఇది కూడా చదవండి: 0-100 kmph వేగాన్ని అందుకోవడంలో ఈ 10 కార్‌ల కంటే వేగవంతమైన టాటా టియాగో EV

ఈ SUV టాటా సరికొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (170PS/280Nm) వస్తుంది, దీన్ని 2023 ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించారు. స్టీరింగ్ వీల్ పైన ప్యాడిల్ షిఫ్టర్‌ల కారణంగా ఈ ఇంజన్ DCTతో రావచ్చు.

ఫీచర్‌లు భద్రత

ఈ నవీకరణతో, సఫారిలో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ముందు మరియు మధ్య వరుస సీట్లు (6-సీటర్), పవర్డ్ డ్రైవర్ సీట్లు, ఆంబియెంట్ లైటింగ్ؚతో పనోరమిక్ సన్ؚరూఫ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లు ఉంటాయి.

ఇది కూడా చూడండి: ముసుగు లేకుండా కనిపించిన టాటా పంచ్ CNG, త్వరలోనే విడుదల అంచనా

భద్రత విషయంలో, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్‌లను ప్రామాణికంగా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఫార్వర్డ్-కొలిజన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు వెనుక క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి ప్రస్తుత వర్షన్ ADAS ఫీచర్‌ల సూట్‌తో రావచ్చు.

ఇది కూడా చదవండి: టాటా ఆల్త్రోజ్ CNG సమీక్ష 5 ముఖ్యాంశాలు

ఈ జాబితాకు ప్రధానమైన జోడింపు లేన్ కీప్ అసిస్ట్, ఇది ప్రస్తుతం సఫారి మరియు హ్యారీయర్‌లో లేదు. నవీకరించిన మోడల్‌లో టాటా ఈ ఫీచర్‌ను జోడించవచ్చు, మరియు దీని కోసం ఈ కార్ తయారీదారు పవర్ స్టీరింగ్ؚను ఎలక్ట్రానిక్ؚగా చేయవచ్చు.

విడుదల, ధర మరియు పోటీదారులు

నవీకరించిన టాటా సఫారిని కారు తయారీదారు వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయవచ్చు, దీని ప్రారంభ ధర రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. విడుదలైన తరువాత, ఇది MG హెక్టార్ ప్లస్, మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.

చిత్రం మూలం

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర