• English
  • Login / Register

ప్రత్యేకం: కొత్త 19-ఇంచ్ వీల్స్ؚతో కనిపించిన ఫేస్ లిఫ్టెడ్ టాటా సఫారి

టాటా సఫారి కోసం rohit ద్వారా జూన్ 20, 2023 04:09 pm ప్రచురించబడింది

  • 48 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2024 ప్రారంభంలో విక్రయాలు మొదలవుతాయని అంచనా 

2024 Tata Safari spied

  • నవీకరించిన SUV రెండు టెస్ట్ మోడల్‌లను కొత్త రహస్య చిత్రాలలో చూడవచ్చు.

  • ఒకదానిలో ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగా 18-అంగుళాల వీల్స్ؚను కలిగి ఉంది, రెండవది కొత్త 19-అంగుళాల వీల్స్ؚను కలిగి ఉంది.

  • ఆధునిక కార్‌లలో ఉన్నట్లుగా నాజూకైన LED లైటింగ్ మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లను పొందనుంది.

  • ప్రస్తుత మోడల్ؚ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు ADASతో వస్తుంది, నవీకరించిన SUVలో కూడా ఇవి కొనసాగవచ్చు.

  • కొత్త టర్బో-పెట్రోల్ (1.5-లీటర్ TGDI) మరియు ప్రస్తుత డీజిల్ ఇంజన్ؚలు ఉంటాయి. 

  • ధరలు రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.

ఇప్పటికే మనం అనేక నవీకరించిన టాటా సఫారి రహస్య చిత్రాలను చూశాము. మరొకసారి, అప్‌డేట్ చేసిన SUV రెండు టెస్ట్ మోడల్‌లు, భారీగా కప్పబడి ఉన్నట్లు కనిపించాయి, వీటిలో కొన్ని కొత్త వివరాలను గమనించగలిగాము.

కొత్త రహస్య చిత్రాల వివరాలు

2024 Tata Safari spied
2024 Tata Safari spied

కొత్త రహస్య చిత్రాలలో, ప్రస్తుత మోడల్‌లో ఉన్న 18-అంగుళాల వీల్స్ ఒక మోడల్‌లో కనిపించగా, మరొక నవీకరించిన సఫారీ మోడల్ వీల్స్‌లో కొత్త, అత్యాధునిక 5-స్పోక్ؚల డిజైన్‌ను చూడవచ్చు. ప్రస్తుత సఫారీ మోడల్ؚను 18-అంగుళాల వీల్స్‌తో అందిస్తుండగా, నవీకరించిన మోడల్ؚలో 19-అంగుళాల వీల్స్ (ఈ బ్రాండ్ֶ వాహనాలలో మొదటిసారి) ఉంటాయని కొత్త రహస్య చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: కప్పబడకుండా పరీక్షిస్తూ కనిపించిన టాటా పంచ్ CNG, త్వరలోనే విడుదల అవుతుందని అంచనా 

ఇంతకు ముందు కనిపించిన మార్పులు

మునపటి రహస్య చిత్రాలలో కనిపించినట్లుగా, నవీకరించిన SUV నిలువుగా అమర్చిన LED హెడ్‌లైట్‌లు మరియు కనెక్టెడ్ LED DRLలతో వస్తుంది. దీని ప్రొఫైల్‌లో, కొత్త అలాయ్ వీల్ డిజైన్ మాత్రమే కాకుండా వెనుక వైపు మరిన్ని అప్‌డేట్‌లను పొందుతుందని అంచనా. నాజూకైన, కనెక్టెడ్ LED లైట్‌లు మరియు రీఫ్రెష్ చేసిన బంపర్ ఉన్నాయి. కొత్త కార్‌లలో ఉన్నట్లు డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు కూడా ఉంటాయి.

క్యాబిన్ మరియు ఫీచర్ అప్ؚడేట్ؚలు

Tata Safari cabin

ఇటీవల సఫారీ ఇంటీరియర్‌లో కొన్ని అప్ؚడేట్ؚలను పొందింది, నవీకరించిన వర్షన్ؚలో వీటిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాము. వీటిలో ఇటీవల జోడించిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. మహీంద్రా XUV700 వంటి వాటితో పోటీ పడటానికి టాటా తరచుగా సఫారీని అనేక కొత్త ఫీచర్‌లతో అప్‌డేట్ చేస్తుంది. ఈ మిడ్ؚలైఫ్ అప్‌డేట్ؚతో మరి కొన్ని ముఖ్యమైన ఫీచర్‌లు జోడించబడతాయని ఆశించవచ్చు.

ఇతర ఫీచర్‌లలో 360-డిగ్రీల కెమెరా, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండవచ్చు. అప్‌డేట్ చేయబడిన సఫారీ భద్రత ఫీచర్‌లలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ఉంటాయి.

బోనెట్ క్రింద ఏమి ఉంటుంది?

Tata Safari engine

నవీకరించిన టాటా సఫారి, 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌తో జత చేసిన అదే 2-లీటర్‌ల డీజిల్ ఇంజన్‌తో (170PS/350Nm) వస్తుందని అంచనా. టాటా దీన్ని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో (170PS/280Nm) అందిస్తుంది, ఇది 2023 ఆటో ఎక్స్ֶపోలో ఆవిష్కరించబడింది.

ఇది కూడా చదవండి: కార్ ప్లే మరియు మ్యాప్స్ అప్లికేషన్‌ల కోసం కొత్త ఫీచర్‌లను పొందనున్న ఆపిల్ iOS 17 

విడుదల టైమ్ؚలైన్

నవీకరించిన సఫారీని టాటా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తుందని విశ్వసిస్తున్నాము, దీని ధర రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. ఇది హ్యుందాయ్ ఆల్కాజార్, మహీంద్రా XUV700 మరియు MG హెక్టార్ ప్లస్ؚలతో తన పోటీని కొనసాగిస్తుంది.

was this article helpful ?

Write your Comment on Tata సఫారి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience