రహస్యంగా చిక్కిన ఫోటోలలో భారీ డిజైన్ మార్పులతో కనిపించిన ఫేస్ లిఫ్టెడ్ టాటా నెక్సాన్
టాటా నెక్సన్ కోసం rohit ద్వారా మార్చి 09, 2023 12:46 pm ప్రచురించబడింది
- 52 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రస్తుత కార్‌ల ట్రెండ్‌ను అనుసరిస్తూ నవీకరించబడిన ఈ SUV కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్‌లతో వస్తుంది.
-
భారీగా నవీకరించబడిన నెక్సాన్ؚను టాటా 2024లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది.
-
2023 ఆటో ఎక్స్ؚపోలో చూపిన కర్వ్, సియర్రా EVల డిజైన్ؚను ఇది కలిగి ఉంటుంది.
-
పెద్ద 10.25-అంగుళాల డిస్ప్లేతో సహా, ఇంటీరియర్‌లో కూడా మార్పులు ఉంటాయి.
-
టాటా హ్యారీయర్/సఫారి వాహనాలలోని కొన్ని ADAS ఫీచర్‌లను కూడా ఇందులో అందించవచ్చు.
-
కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో రావచ్చు; డీజిల్ ఎంపిక కూడా కొనసాగుతుంది.
-
రూ.8 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతుందని అంచనా.
ఈ సంవత్సరం ప్రారంభంలో, నవీకరించబడిన టాటా నెక్సాన్ మొదటి రహస్య చిత్రాలను ప్రత్యేకంగా అందించారు. 2024 సంవత్సరంలో విడుదల కానున్న ఈ కొత్త మోడల్ ఇటీవల మరొకసారి టెస్ట్ చేస్తుండగా కనిపించింది.
కనిపించిన కొత్త వివరాలు
కొత్త ట్రెండ్ؚకు అనుగుణంగా కనెక్టెడ్ టెయిల్ లైట్‌లను నవీకరించబడిన నెక్సాన్ؚ కలిగి ఉన్నట్లు కొత్త టెస్ట్ డిజైన్‌లో చూడవచ్చు. అంతేకాకుండా, ఈ సబ్-4m SUVలో ప్రస్తుత మోడల్‌లలో ఉన్న “Y” డిజైన్‌కు బదులుగా “X-ఆకారపు” లైటింగ్ ఎలిమెంట్‌లు ఉన్నట్లు కనిపిస్తుంది.
తాజా రహస్య చిత్రాలలో నవీకరించబడిన అల్లాయ్ వీల్ డిజైన్‌తో టాటా SUV ఆకట్టుకునేలా కనిపిస్తుంది. దీని ప్రోఫిల్‌కు మరే ఇతర భారీ మార్పులు ఉండకపోవచ్చు. ఈ నవీకరించబడిన నెక్సాన్ ముందు వైపు LED DRL స్ట్రిప్ؚతో టాటా కర్వ్-సియార్రా EV వంటి స్టైలింగ్ ఉంటుంది, దీని హెడ్‌లైట్‌లను బంపర్ؚలో దిగువన అమర్చారు.
ఇది కూడా చదవండి: 50 లక్షల ప్యాసెంజర్ వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటిన టాటా
క్యాబిన్ؚలో కూడా మార్పులు ఉండవచ్చు
నవీకరించబడిన నెక్సాన్ ఇంటీరియర్‌లను ఆధునీకరించబడినట్లు మునపటి రహస్య చిత్రాలు నిర్ధారిస్తున్నాయి. టాటా ఈ వాహనంలో తన పెద్ద 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సవరించిన అప్హోల్స్టరీ అందిస్తుంది. వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో ACలను కొనసాగించవచ్చు.
భద్రత విషయానికి వస్తే, హ్యారీయర్, సఫారి వంటి వాహనాలలో ఉండే ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, కొన్ని అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్‌లు కొత్త నెక్సాన్‌లో ఉండవచ్చు.
బోనెట్ؚ భాగాలను కూడా మెరుగుపరిచారు
నవీకరించబడిన నెక్సాన్ؚను టాటా 12PS పవర్ మరియు 225 Nm టార్క్‌తో రేట్ చేసిన కొత్త E-20కి అనుగుణంగా ఉండే 1.2-లీటర్ TGDi (టర్బో-పెట్రోల్) ఇంజన్–డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో (DCT) అందిస్తుందని అంచనా వేస్తున్నాము. 1.5-లీటర్ డీజిల్ యూనిట్‌ను (110PS/260Nm) కొనసాగిస్తూనే CNG కిట్ ఎంపికను కూడా పొందవచ్చు. ఎలక్ట్రిక్ వేరియెంట్‌లు (ప్రైమ్ మరియు మాక్స్) కూడా అవే లుక్ మరియు ఫీచర్ నవీకరణలను పొందుతాయని అంచనా. పెట్రోల్, డీజిల్ వర్షన్ؚల కంటే ముందే నవీకరించబడిన వాహనాన్ని EV వేరియంట్‌లో టాటా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: తన మొట్టమొదటి రిజిస్టర్ చేయబడిన వాహన స్క్రాప్పింగ్ సౌకర్యం Re.Wi.Reను ప్రారంభించిన టాటా
అంచనా ధర మరియు పోటీదారులు
నవీకరించబడిన నెక్సాన్ రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల కావచ్చు. హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, నిసాన్ మాగ్నైట్ వంటి సాధారణ సబ్-4m SUVలతో ఇది పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT
0 out of 0 found this helpful