సరికొత్తగా ఆరు ఎయిర్ బాగ్స్ వచ్చిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ గ్రాండ్ i10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం tarun ద్వారా జనవరి 23, 2023 12:48 pm ప్రచురించబడింది

  • 72 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ ఇప్పుడు దాని ప్రధాన ప్రత్యర్ధి మారుతి స్విఫ్ట్ కంటే అధిక ఫీచర్‌లను కలిగి ఉంది.

2023 Hyundai Grand i10 Nios

  • నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ ధర రూ.5.69 లక్షలు నుండి ప్రారంభమవుతుంది.

  • కొత్త 15-అంగుళాల అలాయ్ వీల్స్‌, అనుసంధానించిన LED టెయిల్ ల్యాంప్ؚలతో రీడిజైన్ చేయబడిన ముందు భాగంతో వస్తుంది.

  • ఆటోమాటిక్ హెడ్ ల్యాంప్ؚలు, క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన ఇన్స్ؚట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-సి చార్జర్ వంటివి అదనపు ఫీచర్‌లు.

  • ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ESC, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ؚతో ఇది ఇప్పుడు మరింత సురక్షితమైనది. 

  • 1.2 లీటర్ పెట్రోల్ మరియు సి‌ఎన్‌జి ఎంపికలు కలిగి ఉన్నాయి.

నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ ధరలను హ్యుందాయ్ వెల్లడించింది. ఇది రూ.5.69 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభమవుతుంది. రూ.11,000 ముందస్తు రుసుముతో బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి

 

ధరల పరిశీలన

వేరియెంట్ؚలు

పెట్రోల్-ఎమ్ؚటి

పెట్రోల్ ఎఎమ్ؚటి

సిఎన్ؚజి

ఎరా

రూ. 5.69 లక్షలు

-

-

మాగ్నా

రూ. 6.61 లక్షలు

రూ. 7.23 లక్షలు

రూ. 7.56 లక్షలు

స్పోర్ట్జ్ 

రూ. 7.20 లక్షలు

రూ. 7.74 లక్షలు

రూ. 8.11 లక్షలు

ఆస్టా

రూ. 7.93 లక్షలు

రూ. 8.47 లక్షలు

-

గ్రాండ్ i10 నియోస్ తన నాలుగు-వేరియెంట్‌ల లైన్అప్ؚతో కొనసాగుతుంది, నవీకరించడానికి ముందు ఉన్న మోడల్ ధర కంటే దీని ధర రూ.33,000 ఎక్కువగా ఉంది. ఎఎమ్ؚటి వేరియెంట్‌ల ధర, మాన్యువల్ వేరియెంట్‌ల కంటే రూ.62,000 ఎక్కువగా, సిఎన్ؚజి వేరియెంట్‌ల ధర రూ.95,000 ఎక్కువగా ఉంది.

 

కొత్త స్టైలింగ్

2023 Hyundai Grand i10 Nios

నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ ముందు, వెనుక భాగం చాలా భిన్నంగా కనిపిస్తుంది. కొత్త మెష్ రకం, క్రిందకి అమర్చిన గ్రిల్, స్పోర్టియర్ؚ లుక్ కలిగిన ముందు బంపర్ మరియు కొత్త LED DRLలతో ముందు భాగం పూర్తిగా రీడిజైన్ చేయబడింది. 

15-అంగుళాల అలాయ్ వీల్స్ؚను మినహాయించి సైడ్ ప్రొఫైల్‌లో ఎటువంటి మార్పులేదు. వెనుక భాగంలో, కొత్తగా అనుసంధానించిన LED టెయిల్ ల్యాంప్ؚలు, రీడిజైన్ చేసిన బూట్ లిడ్ ఉన్నాయి. ఇది కొత్త స్పార్క్ గ్రీన్ రంగులో, సింగిల్-టోన్ మరియు డ్యూయల్-టోన్ ఎంపికలతో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రంగులు పోలార్ వైట్, టైటన్ గ్రే, ఆక్వా టీల్, ఫైరీ రెడ్, మరియు టైఫూన్ సిల్వర్. 

ఇంటీరియర్‌లలో మార్పు లేదు

2023 Hyundai Grand i10 Nios

నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ క్యాబిన్ లేఅవుట్ మునపటి మాడెల్స్ వలె ఎటువంటి మార్పు లేకుండా ఉంది. అయితే, ఫ్రంట్ హెడ్ రెస్ట్ؚలపై ‘నియోస్’ అని రాయబడిన కొత్త లేత బూడిద రంగు అపోలెస్ట్రీతో వస్తుంది. 

మరిన్ని ఫీచర్ లు

నవీకరణలో భాగంగా గ్రాండ్ i10 నియోస్ؚలో మరిన్ని ఫీచర్‌లను జోడించారు. అప్ؚడేట్ చేయబడిన ఈ హ్యాచ్ؚబ్యాక్ؚలో ఇప్పుడు ఆటోమాటిక్ హెడ్ؚల్యాంప్ؚలు, క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన ఇన్స్ؚట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-సి చార్జర్ మరియు బ్లూ ఫుట్ؚవెల్ ఆంబియెంట్ లైటింగ్ؚతో వస్తుంది.

ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 8-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, ఆటోమాటిక్ ఎసి, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వైర్ؚలెస్ ఫోన్ చార్జర్ మరియు పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్-స్టాప్ؚؚ ఫీచర్లు కలిగి ఉంది.

 

​​​​​​​ఇది ఇప్పుడు మరింత సురక్షితం

భద్రత విషయానికి వస్తే, 2023 గ్రాండ్ i10 నియోస్ؚ ఇప్పుడు నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా వస్తాయి, టాప్ వేరియెంట్ؚలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు వస్తాయి. రేర్ పార్కింగ్ కెమెరాకు అదనంగా, దీనిలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ISOFIX యాంకరేజ్ؚలు, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

2023 Hyundai Grand i10 Nios

 

బోనెట్ క్రింద ఎలాంటి మార్పులు లేవు

ఐదు-స్పీడ్‌ల మాన్యువల్, AMT ట్రాన్స్ؚమిషన్ؚలతో 83పిఎస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఈ వేరియెంట్ؚలో కూడా కొనసాగింది. సి‌ఎన్‌జిని కూడా మీరు ఎంచుకోవచ్చు, ఇది ప్రత్యామ్నాయ ఇంధనంపై నడుస్తున్నప్పుడు 69PS ను అభివృద్ధి చేస్తుంది, ఇది ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ؚతో మాత్రమే వస్తుంది. అయితే, ఇంజన్ ఇప్పుడు E20 (20% ఎథనాల్ బ్లెండ్), BS6 ఎమిషన్ ఫేస్ 2కి అనుగుణంగా ఉంటుంది. 

2022లో, హ్యుందాయి నియోస్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అధిక సామర్ధ్య డీజిల్ వేరియంట్‌లను నిలిపివేసింది, ప్రస్తుతానికి 100పి‌ఎస్ 1 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కూడా నిలిపివేసినట్లు కనిపిస్తోంది.

​​​​​​​ప్రత్యర్ధులు

హ్యుందాయి గ్రాండ్ i10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఇగ్నిస్ؚలతో తన దీర్ఘ కాల పోటీని కొనసాగిస్తుంది. అయితే, అదే ధరలో మూడు వరుసల రెనాల్ట్ ట్రైబర్, క్రాస్ؚఓవర్ – స్టైల్ టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సి3లను కూడా పరిగణించవచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఎఎమ్ؚటి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ Grand ఐ10 Nios

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience