Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

5 చిత్రాలలో New Hyundai Creta E Base Variant కీలక వివరాలు వెల్లడి

హ్యుందాయ్ క్రెటా కోసం rohit ద్వారా జనవరి 19, 2024 06:34 pm ప్రచురించబడింది

బేస్-స్పెక్ వేరియంట్ కావడంతో, హ్యుందాయ్ క్రెటా Eలో మ్యూజిక్ సిస్టమ్ లేదా LED హెడ్లైట్లు లభించవు

  • హ్యుందాయ్ కొత్త క్రెటాను ఏడు బ్రాడ్ వేరియంట్లలో అందిస్తున్నారు.

  • SUV బేస్ స్పెక్ E వేరియంట్ లో ఫుల్ LED లైటింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

  • 2024 క్రెటా E వేరియంట్ క్యాబిన్ లోపల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు మాన్యువల్ AC లభిస్తుంది.

  • ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడిన పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది.

  • క్రెటా E వేరియంట్ ధర రూ.11 లక్షల నుండి రూ.12.45 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).

రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ భారతదేశంలో విడుదల అయింది. దీని ధర రూ.11 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ప్రారంభమవుతుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా SUV ఏడు వేరియంట్లలో లభిస్తుంది: E, EX, S, S (O), SX, SX టెక్ మరియు SX (O). మీరు దాని ఎంట్రీ లెవల్ E వేరియంట్ తీసుకోవాలనుకుంటే, మీరు ఈ క్రింది వివరణాత్మక చిత్రాలలో చూడవచ్చు:

ఎక్స్టీరియర్

క్రెటా E వేరియంట్ ముందు భాగంలో డార్క్ క్రోమ్ ఇన్సర్ట్స్ తో రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు డల్ గ్రే ఫినిషింగ్ తో వెడల్పాటి బంపర్ తో లభిస్తుంది. ముందు భాగంలో హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు, LED DRL సెటప్లో అమర్చారు. ఇది క్రెటా యొక్క బేస్ వేరియంట్ కాబట్టి, హ్యుందాయ్ ఇందులో ఫంక్షనల్ LED DRLలను అందించలేదు.

సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే, ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ లో ఉన్న టర్న్ ఇండికేటర్, క్రోమ్ కు బదులుగా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు కవర్లతో కూడిన 16-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో LED టెయిల్లైట్లు లేకపోయినా, LED లైట్ బార్ అందించారు.

ఇంటీరియర్

కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క బేస్ వేరియంట్ ను దాని ఇంటీరియర్ చూసి సులభంగా గుర్తించవచ్చు. క్యాబిన్ లోపల, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉంది, అయితే ఇందులో టచ్స్క్రీన్ మరియు మ్యూజిక్ సిస్టమ్ అందించలేదు. కాని ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అందించారు.

భద్రత పరంగా, క్రెటా E వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా యొక్క అన్ని వేరియంట్ వివారాలు

హ్యుందాయ్ క్రెటా E పవర్ట్రెయిన్ ఎంపికలు

ఎంట్రీ లెవల్ E వేరియంట్ రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది: 115 PS/ 144 Nm 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ (N/A) పెట్రోల్ ఇంజిన్ లేదా 116 PS/ 250 Nm 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్ వేరియంట్లు CVT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ లతో అందించబడతాయి. హ్యుందాయ్ SUV నుండి ఎక్కువ పనితీరును కోరుకునేవారికి, ఇది 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్) తో జతచేయబడిన 160 PS/ 253 Nm 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది, కానీ ఇది టాప్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 2024 హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో తదుపరి N లైన్ మోడల్ కావచ్చు

ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు

ఫేస్ లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా E వేరియంట్ ధర రూ .11 లక్షల నుండి రూ .12.45 లక్షల మధ్య ఉండగా, SUV టాప్ వేరియంట్ ధర రూ.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కాంపాక్ట్ SUV కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ వంటి మోడళ్ళతో పోటీ పడనుంది.

అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ప్యాన్-ఇండియా

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా ఆన్ రోడ్ ధర

Share via

Write your Comment on Hyundai క్రెటా

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర