• English
  • Login / Register

ఎక్స్క్లూజివ్: డీజిల్ తో మరియు 6-స్పీడ్ మాన్యువల్ తో రాబోతున్న హోండా జాజ్

హోండా జాజ్ 2014-2020 కోసం raunak ద్వారా జూన్ 11, 2015 11:27 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: రాబోయే హోండా జాజ్  6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు హోండా సిటీ లో ఉండే 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజెన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విభాగం గురించి మాట్లాడటానికి వస్తే, ఇప్పటి వరకు ఉన్న వాటిలో హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మాత్రమే 6-స్పీడ్ మ్యాన్యువల్ సిస్టం మరియు డీజిల్ తో అందించబడేది. ఈ జాజ్ చూడటానికి ఎలైట్ ఐ20 లా కనిపిస్తుంది. అంతేకాకుండా, దీనితో పోటీ పడటానికి రాబోతుంది. దీని మిగిలిన పోటీదారుల విషయానికి వస్తే, ఫియట్ పుంటో ఈవో, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు వోక్స్వాగన్ పోలో వంటి వాటితో పోటీ పడటానికి రాబోతుంది. అంతేకాకుండా ఇవి అన్ని కూడా  5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తున్నాయి.  

రాబోయే హోండా జాజ్ యొక్క ఇంజెన్, హోండా సిటీ, అమేజ్ నుండి తీసుకొనబడినది. ఈ ఇంజెన్ 1.5 లీటర్ ఐ-డిటెక్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజెన్ అత్యధికంగా 100PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, మరియు అత్యధికంగా 200Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. హోండా సిటీ లో ఉన్న అదే  6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో రాబోతుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ (హోండా సిటీ పోలి) 26 కంప్ల్ కు పైనే మైలేజ్ ను ఇస్తుంది. అంతేకాక, రహధారులపై రెలాక్స్డ్ డ్రైవ్ కోసం అదనపు గేర్ కూడా జాజ్ లో అందించబడుతుంది.

రాబోయే హోండా జాజ్ యొక్క స్పెక్స్ ను, లక్షణాలను మరియు చిత్రాలను మొదటిసారిగా మేమే అందించాము. హోండా నుండి అందించబడిన 15.7 సెం.మీ. టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటుగా 12.7  సెం.మీ. నాన్ టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం తో రాబోతుంది. (క్రింది చిత్రాలను గమనించండి మొదటిది-టచ్ యూనిట్, రెండవది- నాన్ టచ్ యూనిట్)   

జాజ్ యొక్క డాష్బోర్డ్ అంతా బ్లాక్ ఇంటీరియర్స్ తో పాటు వెండి చేరికలతో హోండా సిటీ ను పోలి అలంకరించబడి ఉంటుంది. దీనిలో ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కొంచెం బిన్నంగా ఉంటుంది. అంతేకాక, జాజ్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్లలో గోధుమరంగు అపోలిస్ట్రీ తో రాబోతున్నాయి, కాని జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ల విషయానికి వస్తే, అన్ని నలుపు రంగు ఇంటీరియర్స్ తో రాబోతున్నాయని ఇటీవల బహిర్గతం అయ్యింది.

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience