• English
  • Login / Register

ప్రత్యేకం: మొదటిసారి కనిపించిన ఫేస్లిఫ్టెడ్ మహీంద్రా XUV300

మహీంద్రా ఎక్స్యూవి300 కోసం ansh ద్వారా మే 26, 2023 06:53 pm ప్రచురించబడింది

  • 98 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

లుక్ పరంగా గణనీయమైన మార్పులు చేసినట్లు కనిపిస్తోంది మరియు క్యాబిన్ؚలో కూడా మార్పులు ఉంటాయని అంచనా

Facelifted Mahindra XUV300 Spied

  • పూర్తిగా రీడిజైన్ చేసిన ముందు మరియు వెనుక ప్రొఫైల్స్ؚను పొందుతుంది.

  • క్యాబిన్ؚను రీడిజైన్ చేయడాన్ని మహీంద్రా పరిగణించాలి.

  • ప్రస్తుత ఇంజన్ ఎంపికలను ఇది కొనసాగించవచ్చు. 

  • AMT బదులుగా టార్క్ కన్వర్టర్ؚను పొందవచ్చు. 

  • భారీ ఇన్ఫోటైన్ؚమెంట్ డిస్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు మరియు   LED లైటింగ్ వంటి కొత్త ఫీచర్‌లు ఉండవచ్చు.

  • ధర రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా. 

మహీంద్రా XUV300, 2019లో విడుదలైంది, ప్రస్తుతం ఇది నవీకరణను పొందనుంది. నవీకరించబడిన XUV300 రోడ్ టెస్టింగ్‌ను మహీంద్రా ప్రారంభించింది, తాత్కాలిక లైట్ؚలతో టెస్ట్ మోడల్ భారీగా కవర్ చేయబడి కనిపించింది. ఈ కారు నవీకరణను పొందాల్సిన సమయం వచ్చింది, ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈ విభాగంలో విక్రయించబడుతున్న పాత మోడల్‌లలో ఒకటి. 

ఎక్స్ؚటీరియర్ؚకు మార్పులు 

నవీకరించబడిన SUV ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇది నాజూకైన స్ప్లిట్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్ మరియు రీడిజైన్ చేసిన బోనెట్‌తో వస్తుందని రహస్య చిత్రాల నుండి తెలుసుకోవచ్చు. ఈ చిత్రంలో మీరు చూసే హెడ్ؚల్యాంపులు మరియు ఇండికేటర్‌లు తాత్కాలిక ఎక్విప్మెంట్, ఎందుకంటే ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. ఉత్పత్తికి-సిద్ధంగా ఉన్న మోడల్ బహుశా XUV700 నుండి స్టైలింగ్ ప్రేరణను పొందుతుంది, C ఆకారపు DRLలు మరియు LED హెడ్ؚలైట్‌లు ఉండవచ్చు.

Facelifted Mahindra XUV300 Rear

దీని లుక్ ప్రకారం, నవీకరించబడిన మోడల్‌లో వెనుక ప్రొఫైల్‌కు కూడా భారీ సవరణలను చూడవచ్చు. బూట్ లిడ్ రీడిజైన్ చేయబడింది మరియు ఇంతకు ముందు కంటే దృఢంగా కనిపిస్తుంది. లైసెన్స్ ప్లేట్ బూట్ లిడ్‌పై కాకుండా బంపర్ పైన అమర్చి ఉంది. చివరిగా, ఇక్కడి టెయిల్ ల్యాంపులు తాత్కాలకంగా అమర్చారు, కానీ ఈ SUV కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెట్అప్ؚను పొందవచ్చు, వాహనం వెడల్పు పొడవునా కవర్ చేసి ఉన్న బార్ కనిపించింది. 

ఇంటీరియర్ అప్ؚడేట్ؚలు

Mahindra XUV300 Cabin

దీని ఇంటీరియర్‌కు సంబంధించిన చిత్రాలు ఇప్పటికి అందుబాటులో లేకపోయినా, దీని ప్రస్తుత లేఅవుట్ ఇతర వాహనాలతో పోలిస్తే ఆకర్షణీయంగా లేనందున ఇది పూర్తిగా రీడిజైన్ చేసిన క్యాబిన్‌తో వస్తుందని అంచనా. అదనంగా, ఓవర్-ది-ఎయిర్ అప్ؚడేట్ؚలతో మహీంద్రా కొత్త ఆడ్రెనాక్స్ UIؚతో నడిచే భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, 360-డిగ్రీల కెమెరా మరియు వైర్ؚలెస్ ఫోన్ చార్జర్ వంటి కొత్త ఫీచర్‌లను ఆశించవచ్చు. 

ఇది కూడా చూడండి: మారుతి-జిమ్నీలో ఉన్న ఫీచర్ؚతో మళ్ళీ కనిపించిన 5-డోర్‌ల మహీంద్రా థార్

ప్రస్తుత XUV300లో ఉన్న ఇతర ఫీచర్‌లను కొనసాగించవచ్చు, వీటిలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్-రూఫ్, ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు, EBDతో ABS, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ؚలు మరియు రేర్ వ్యూ కెమెరా ఉన్నాయి. 

పవర్ؚట్రెయిన్

Mahindra XUV300 Engine

ప్రస్తుత మోడల్ؚలో ఉన్న 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (110PS/200Nm), 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (117PS/300Nm) మరియు 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్టెడ్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (130PS/ 250Nm వరకు) ఎంపికలను నవీకరించబడిన మోడల్‌లో కొనసాగించవచ్చు. అయితే, టెస్ట్ మోడల్ వెనుక విండ్ షీల్డ్‌పై ఉన్న స్టిక్కర్ؚ ఆధారంగా, ఇది E20 ఇంధనం (ఇథనాల్ 20 శాతం బ్లెండ్) ఇంజన్ ఎంపికలతో రావొచ్చు, ఈ ఇంజన్‌లు అన్నీ 6-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్‌ను ప్రామాణికంగా వస్తుంది మరియు డీజిల్, టర్బో-పెట్రో యూనిట్‌లు AMT ఎంపికను పొందనున్నాయి. అయితే నవీకరించబడిన XUV300, AMTకి బదులుగా టార్క్ కన్వర్టర్ؚతో రావచ్చు, ఎందుకంటే ఈ వాహన పోటీదారులు సరైన ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో తమ వాహనాలను అందిస్తున్నారు. 

విడుదల, ధర మరియు పోటీదారులు

Mahindra XUV300

మహీంద్రా నవీకరించబడిన XUV300ని వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయవచ్చు, దీని ప్రారంభ ధర రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. విడుదల అయిన తరువాత, ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు కియా సోనెట్ వంటి వాటితో పోటీ పడనుంది. 

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి : XUV300 AMT 

was this article helpful ?

Write your Comment on Mahindra ఎక్స్యూవి300

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • టాటా సియర్రా
    టాటా సియర్రా
    Rs.10.50 లక్షలుఅంచనా ధర
    సెపటెంబర్, 2025: అంచనా ప్రారంభం
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • బివైడి sealion 7
    బివైడి sealion 7
    Rs.45 - 49 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • నిస్సాన్ పెట్రోల్
    నిస్సాన్ పెట్రోల్
    Rs.2 సి ఆర్అంచనా ధర
    అక్ోబర్, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience