మళ్ళీ కనిపించిన 5-డోర్‌ల మహీంద్రా థార్, మారుతి జిమ్నీ వంటి ఫీచర్ؚను పొందింది
మహీంద్రా థార్ రోక్స్ కోసం rohit ద్వారా మే 25, 2023 07:16 pm ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఆఫ్ؚరోడర్ؚ ఇప్పటికి కప్పి ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది, బూట్ؚకు అమర్చిన స్పేర్ వీల్ వెనుక రేర్ వైపర్ؚను కలిగి ఉండటాన్ని చూడవచ్చు.
-
2022 నుండి 5-డోర్‌ల మహీంద్రా థార్ టెస్టింగ్ జరుగుతుంది.
-
LED టెయిల్‌లైట్‌లు, రన్నింగ్ బోర్డులు మరియు అలాయ్ వీల్స్ؚతో కొత్త రహస్య వీడియోలో కనిపించిన ఈ వాహనం ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.
-
8-అంగుళాల టచ్ؚస్క్రీన్, ఆటో AC మరియు ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు వంటి ఫీచర్‌లు ఇందులో ఉండవచ్చని ఆశించవచ్చు.
-
3-డోర్‌ల థార్ విధంగానే దీన్ని కూడా మహీంద్ర అవే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందిస్తుంది.
-
2024 ప్రారంభంలో రూ.15 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విక్రయించబడుతుందని అంచనా.
5-డోర్‌ల మహీంద్రా థార్ రహస్యంగా టెస్ట్ చేయబడుతూ కనిపించి సుమారు సంవత్సరం అయ్యింది. దీని ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తుండగా, ప్రస్తుతం ఈ SUV మరొక రహస్య వీడియో మన ముందుకు వచ్చింది, ఇందులో ఈ 5-డోర్‌ల ఆఫ్ؚరోడర్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వర్షన్ؚలో కనిపించింది.
స్పష్టమైన వివరాలు
ఇటీవల రహస్యంగా టెస్ట్ చేసిన వాహనం ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించిన LED టెయిల్ లైట్‌లు, బాడీ ప్యానెల్స్, అలాయ్ వీల్స్ మరియు రన్నింగ్ బోర్డులు సూచిస్తున్నాయి. పై నుండి హింజ్‌లతో అమర్చిన వెనుక గ్లాస్ విండో కారణంగా ఇది టాప్ వర్షన్ అని అంచవేస్తున్నాము, ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే 5-డోర్‌ల మారుతి జిమ్నీలో ఉన్నట్లుగా టెయిల్‌గేట్ؚకు అమర్చిన స్పేర్ వీల్ వెనుక అమర్చిన రేర్ వైపర్‌ను కూడా చూడవచ్చు.
ఇంతకుముందు చూసిన వివరాలు
మునపటి రహస్య చిత్రాలలో C-పిల్లర్ؚకు అమర్చిన రేర్ డోర్ హ్యాండిల్స్ (మారుతి స్విఫ్ట్ؚలోలాగా) ఉంటాయని వెల్లడించాయి. 5-డోర్‌ల థార్ؚలో కూడా 3-డోర్‌ల మోడల్ؚలో ఉన్నట్లుగా గుండ్రని హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ؚలైట్‌లు ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక
క్యాబిన్ మరియు ఫీచర్‌లు
5-డోర్‌ల థార్ ఇంటీరియర్ విషయంలో స్పష్టమైన చిత్రాలు లేకపోయినా, ఇంతకముందు కనిపించినట్లు టెస్ట్ మాడెల్‌లో ఉన్నట్లుగా పూర్తి-నలుపు రంగు క్యాబిన్‌ను మహీంద్రా ఇందులో అందిస్తుందని ఆశిస్తున్నాము. పొడవైన వీల్ؚబేస్ కలిగిన థార్ؚను ఈ కారు తయారీదారు నాలుగు, ఐదు మరియు ఏడు సీట్‌ల బహుళ సీటింగ్ కాన్ఫిగరేషన్ؚలతో అందించవచ్చు.
ఇందులో ఉన్న సాంకేతికతలలో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఆటో AC, ఆరు వరకు ఎయిర్ֶబ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉంటాయి. 3-డోర్‌ల థార్ 4WD వేరియెంట్ؚలలో ఉన్న ఆఫ్-రోడింగ్ ఇంటర్ؚఫేస్ؚను మహీంద్రా ఈ వెర్షన్‌లో కొనసాగించవచ్చు.
పవర్ؚట్రెయిన్ ఎంపికల పరిధి
ప్రస్తుత 3-డోర్‌ల థార్ విధంగానే 5-డోర్‌ల థార్ కూడా అవే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలతో వస్తుంది, అయితే అవుట్ؚపుట్ గణాంకాలు పెద్దవిగా ఉంటాయి. 3-డోర్‌ల మోడల్, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150PS పవర్‌ను అందిస్తుంది, 2.2-లీటర్ డీజిల్ 130PSగా రేట్ చేయబడింది. ఇటీవల ప్రస్తుత మోడల్ؚలో చూసినట్లు పొడిగించిన థార్ؚను మహీంద్రా 2WD వేరియెంట్ؚల ఎంపికతో అందిస్తుందని అంచనా. కారు తయారీదారు ఈ SUVని 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ؚలతో అందిస్తారు.
ఇది ఎప్పుడు విడుదల కావచ్చు?
ఈ పొడవైన వీల్ؚబేస్ కలిగిన ఆఫ్ؚరోడర్ؚను మహీంద్రా రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 2024 ప్రారంభంలో పరిచయం చేయవచ్చు. వీల్ؚబేస్ పరంగా, రాబోయే మారుతి జిమ్నీకి ఈ భారీ వాహనం ప్రత్యామ్నాయం కావచ్చు మరియు ఫోర్స్ గూర్ఖా 5-డోర్‌ల మోడల్ؚకు సమానంగా నిలవచ్చు.
ఇక్కడ మరింత చదవండి : థార్ డీజిల్