• English
  • Login / Register

ఎలక్ట్రిక్ కార్లకు పన్ను రద్దు చేసిన మహారాష్ట్ర!

మహీంద్రా ఈ2ఓ కోసం raunak ద్వారా జనవరి 05, 2016 12:12 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పుడు నుండి ఎలక్ట్రిక్ కార్లకు మహారాష్ట్రలో పన్ను విధించబడదు. పియూష్ గోయల్ కేంద్ర విద్యుత్ మంత్రి, ఒక పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు మరియు ఒక అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నట్టు తెలిపారు. ఇకనుంచి మహారాష్ట్ర వేల్యూ ఆడెడ్ టాక్స్ (వాట్), రహదారి పన్ను మరియు రిజిస్ట్రేషన్ చార్జీలను రాష్ట్రంలో విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాల మీద విధించబడదు. ప్రస్తుతం, మహీంద్రా రేవా e20 మాత్రమే దేశంలో అమ్ముడుపోయే ఎలక్ట్రిక్ వాహనం మరియు ఇది మహారాష్ట్రా లో ఈ పధకం ద్వారా లభాం పొందుతుంది. 

"ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు వేట్, రహదారి పన్ను మరియు నమోదు ఆరోపణలకు లోబడి ఉంటాయి. నేను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడాను మరియు అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లకు పన్నులను నిషింధించాలని చెప్పగా ఆయన ఒప్పుకోవడం జరిగింది." అని పియూష్ గోయల్ తెలిపారు.   

మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా " కారు (రేవా) ప్రస్తుతం రూ .5 లక్షల ఖర్చవుతుంది కాని ధర ప్రతీ నగరానికి మారుతూ ఉంటుంది. మహారాష్ట్రాలో పన్ను తీసేయడం ఇ-కార్లు ఊపందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా, సంస్థ ప్రతీ నెల 75 కార్లను విక్రయిస్తుంది మరియు ప్రతీ నెల 2500 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తుంది." అని జోడించారు. 

మహీంద్రా వెరిటో సెడాన్ యొక్క జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ని ప్రారంభిస్తున్నట్టుగా కూడా నివేధించింది. ఈ వాహనం 2016 ఫిబ్రవరి భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రారంభం అవ్వచ్చు.  

మరింత చదవండి - ఎలక్ట్రిక్ వెరిటో వాహనాన్ని ఫిబ్రవరి 2016 లో విడుదల చేస్తున్న మహీంద్రా

మిస్ కాకండి: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి చేతులు కలిపిన టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా

was this article helpful ?

Write your Comment on Mahindra ఈ2ఓ

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience