ఎలక్ట్రిక్ వెరిటో వాహనాన్ని ఫి బ్రవరి 2016 లో విడుదల చేస్తున్న మహీంద్రా
మహీంద్రా వెరిటో కోసం nabeel ద్వారా డిసెంబర్ 24, 2015 03:02 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూఢిల్లీ:
మహీంద్రా, ఢిల్లీ లో జరిగిన డీజిల్ నిషేధం నుండి ఒక ఎదురుదెబ్బ కారణంగా, ఇప్పుడు ఆటో ప్రపంచంలోని విద్యుత్ విభాగంలో ఒక వాహనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ2ఓ తో విజయం సాదించిన తరువాత, ఫార్ములా ఈ కార్యక్రమంలో మంచి ప్రదర్శన ఇవ్వడం కోసం మరియు ఆనంద్ మహీంద్రా ఫార్ములా ఈ స్థిరత్వం కమిటీ యొక్క సభ్యుడు అయ్యారు ఆ తరువాత, ఈ ఎలక్ట్రిక్ వాహనాల పై ఉన్న నమ్మకంతో మహీంద్రా, దేశంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి నిర్ణయించుకుంది. ఆటో ఎక్స్పో 2012 లో ప్రవేశపెట్టబడిన ఎలక్ట్రిక్ వెరిటో త్వరలోనే రోడ్ల పై కనిపించే అవకాశం ఉంది.
నివేదికలను నమ్మినట్లైతే, మహీంద్రా ఫిబ్రవరి 2016 వ సంవత్సరం లో ఎలక్ట్రిక్ వెరిటో ను ప్రారంభించడానికి సిద్దంగా ఉంది. మహింద్రా ఈ2ఓ లో ఉండే అదే పవర్ ట్రైన్ తో రాబోతుంది. ఆ ఇంజన్, అత్యధికంగా గంటకు 85 కిలో మీటర్ల వేగంతో వెళ్ళే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు 7- గంటల పూర్తి ఛార్జింగ్ తో 80 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. డ్రైవర్ కు సౌలభ్యాన్ని చేకూర్చడానికి ఈ వాహనం, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు స్టాండ్ స్టిల్ పిక్ అప్ అసిస్ట్ లను కలిగి ఉంది. దీనిని, 2014 ఆటో ఎక్స్పోలో చిత్రీకరించారు మరియు ఇది, మహీంద్రా నుంచి రెండో మొత్తం ఎలెక్ట్రిక్ ఉత్పత్తిగా ఉంది. ఎలక్ట్రిక్ వెరిటో కూడా, కారు రాయితీలు కు వీలు కల్పించే పథకం అయిన ఫేం (ఎలక్ట్రిక్ వాహనాల వేగంగా స్వీకరణ మరియు తయారీ) కు ప్రయోజనంగా ఉంది.
జూన్ 5, 2015 న ఈ కారు, ఇండియా గేట్ నుండి న్యూ ఢిల్లీ లో ఉండే ఐ జి ఐ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న టెర్మినల్ 3 వరకు 'ఫేం ఇండియా ఎకో డ్రైవ్' అనే ఆకుపచ్చ ర్యాలీ లో ఒక భాగంగా నడపటం జరిగింది. అంతేకాకుండా ఇది, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ ఐ ఏ ఎం), ఎస్ ఎం ఈ వి మరియు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (డి ఐ ఏ ఎల్) సహకారంతో భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల భారతదేశం యొక్క ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు చెందిన సంకల్పమే. ఈ వెరిటో వాహనం, ఈ2ఓ మరియు ఎలెక్టిక్ మేగ్జిమో వాహనాలలో త్వరలో చేరనుంది.
మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వాహనాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన అరవింద్ మాథ్యూ మాట్లాడుతూ, "మేము దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి నమూనాల కోసం అన్వేషిస్తున్నాము" అంతేకాకుండా అదనంగా "మేము 40,000 కార్లు స్కేల్ కోసం ఆలోచించినట్లైతే ధర తగ్గే అవకాశం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి:
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి చేతులు కలిపిన టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా