• English
  • Login / Register

ఖాయం: నిస్సాన్ జీటీ-ఆర్ ఈ సంవత్సరం భారతదేశానికి రానుంది

నిస్సాన్ జిటిఆర్ కోసం cardekho ద్వారా సెప్టెంబర్ 04, 2015 04:23 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గాడ్జిల్లా గా ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఈ వాహనం ఇప్పుడు నిస్సాన్ ఇండియా యొక్క కాతి వలయం కానుంది!


నిస్సాన్ జీట్-ఈఆర్ భారతదేశానికి రానుంది అని పుకార్లు వినపడుతున్నాయి. కానీ ఇప్పుడు జపాన్ లోని యోకోహామా లోని కార్దేఖో వారి ఇంటర్వ్యూలో నిస్సాన్ మోటర్ కో., లిమిటెడ్ కి, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియూ ఇండియా యొక్క మానేజ్మెంట్ కమిటీ కి వైస్ ప్రెసిడెంట్ మరియూ చైర్మెన్ అయిన మిస్టర్ క్రిస్టియన్ మర్ద్రస్ గారు ఈ విషయాన్ని ధృవీకరించారు. ధరలు రెండు కోట్ల పరిధిలో ఉండవచ్చును అని అంచనా.


ఇది దేశంలోకి సీబీయూ (కంప్లీట్ బిల్ట్ యూనిట్స్) గా దిగుమతి అవుతుంది. ఇంతకు మునుపు, నిస్సాన్ వారికి 370Z వారి కాంతి కిరణంగా ఉండేది, కాకపోతే ఇప్పుడు అటు 370Z మరియూ ఎక్స్-ట్రైల్ రెండూ గత ఏడాది నిలిపివేయడం అయ్యినందుకు టేనా కూడా నెమ్మదిగా నిలిచిపోయింది.

ఈ మోటార్ 6-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని, ఇండిపెండెంట్ ట్రాన్స్ఎక్సిల్ 4 వీల్ డ్రైవ్ కి పంపిస్తుంది. ఇది ఎల్ ఎస్ డి (పరిమిత స్లిప్ డిఫరెన్షియల్)ని కూడా కలిగి  ఉంటుంది.  దీని జిటి-ఆర్ ముందర భాగానికి డబుల్ విష్బోన్ మరియు వెనుక భాగానికి అడాప్టివ్ డాంప్ ట్రోనిక్ (అడాప్టివ్ డాంపర్లు) లక్షణాన్ని కలిగియున్న బిల్స్టెయిన్ షాక్ అబ్సార్బర్స్ తో అమర్చబడి ఉంటుంది. దీని ముందర 255/40 జెడ్ఆర్ఎఫ్  20 మరియు వెనుక 285/35 జెడ్ఆర్ఎఫ్ 20 తో సవారీ చేస్తుంది.ఈ గాడ్జిల్లా కి శక్తిని ఇచ్చేది ఒక 3.8-లీటర్ ట్విన్ టర్బో వీ6. ఈ 3799 సీసీ గల మోటరు 550పీఎస్ ని 6400ఆర్పీఎం వద్ద మరియూ 632ఎనెం టార్క్ ని 3200 నుండి 5800ఆర్పీఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది. మరియూ, జపాన్ లో 'టకుమనీ పేరు మీద ఇద్దరే కళాకారులు ఉన్నారు. వారే ఈ ఏడబ్ల్యూడీ కూపే ని సమకూరుస్తారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Nissan జిటిఆర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience