• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ కు మరియు దాని పోటీ వాహనాలకు మద్య పరిశీలన

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 01, 2015 04:37 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫ్రెంచ్ కారు దిగ్గజం, రెనాల్ట్ ను ప్రపంచవ్యాప్తంగా దాని చిన్న హాచ్ బ్యాక్ క్విడ్ ను కొన్ని రోజుల కిందట  భారతదేశం లో  ఆవిష్కరించారు. ఈ కారుదేశం అంతటా విస్తృతంగా ప్రశంసలు అందుకుంది  మరియు  విదేశాలలో కూడా దాని బుచ్ క్రాస్ ఓవర్ ఆకర్షణీయమైన రూపం మరియు ధర వలన మంచి పేరు సంపాదించుకుంది. క్విడ్ చిన్న కార్ల జాబితాలో ఉండడం వలన భారతదేశంలో ఒక గొప్ప సెగ్మెంట్ కారుగా నిలిచింది, అందుకే ఇది మారుతి సుజుకి ఆల్టో కె10, వ్యాగన్ ఆర్ మరియు హ్యుందాయ్ ఇయోన్  వంటి ప్రత్యర్ధి కార్లతో అత్యంత తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. మేము దీని ప్రధాన అంశాలను మీకు తెలిసేలా గట్టి పోటీ ని అందిస్తాము.

ధర

రెనాల్ట్ క్విడ్ ఈ ఏడాది పండగ సీజన్ లో రాబోతుంది మరియు అవి మూడు నుండి 4 లక్షల ధరతో రాబోతున్నాయి అని ప్రకటించారు. మిగిలిన వాటితో పోలిస్తే ఇది మంచి పోటీ ధరను కలిగి ఉంది. వాటిలో ఆల్టో కె10 యొక్క ధర 3.2 లక్షల నుండి 4 లక్షలతో అందుభాటులో ఉంది. మరియు వాగన్ ఆర్ 3.5 లక్షల నుండి 4.5 లక్షల ధర తో అందుబాటులో ఉంది. ఇయాన్ 3.1 నుండి 4.3 లక్షల ధర తో అందుబాటులో ఉంది. వీటన్నింటితో పోలిస్తే క్విడ్ తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా చాలా ఆకర్షణీయంగా తయారు చేయబడింది.

రూపం

చిన్న తరహా  హాచ్ విభాగంలో చూడడానికి ఆకర్షణీయంగా కనబడవు, ఉదాహరణ కి ఆల్టో కె10 మరియు వాగన్ ఆర్ వాటి ముందు జెనెరేషన్ ల కన్నా మంచివి అయినప్పటికినీ చూడడానికి ఆకర్షణీయంగా కనబడవు. ఇయొన్ చూడడానికి చాలా ఆకర్షణీయమైన కారు, కానీ క్విడ్ తో పోల్చి చూస్తే క్విడ్ ఒక మంచి మరియు మరింత అందమైన వాహనం .మన భారతీయులు అందరు కూడా ఎస్ యు వి   వైపు ఆకర్షణ కలిగి ఉన్నారు మరియు దీనివల్ల రాబోయే రెనాల్ట్ యొక్క వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలోని ప్రధాన రూపకల్ప ప్రత్యేకతలు ఏమిటనగా,వీల్ ఆర్చ్లు, కారు యొక్క రక్షణ కవచాలు, అందమైన బోనెట్  వైబ్రేట్ చేసే అధునాతన పరికరాలు,ఒక ఆకర్షణీయమైన హెడ్ల్యాంప్స్ చూడడం కోసం అమరుస్తారు మరియు ఒక అద్భుతమైన ఫాగ్ ల్యాంప్స్ ను కారు వెనుక బాగం లో అమరుస్తారు.దీనిలో అరుదుగా కనిపించే పరికరాలను మీరు చూడవచ్చు.

అంతర్భాగాలు

ఈ మోడల్ యొక్క అంతర్భాగలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. రెనాల్ట్ ఇండియా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ కి ఈ విధంగా తెలియచేశారు. ఈ వాహనాల అంతర్భాగాలు అంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికి వీటి ధర 3 లక్షల నుండి 4 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. డ్రైవర్ కోసం ఒక సమాచారం క్లస్టర్ కూడా అమర్చబడి ఉంటుంది. ఇది డాష్ బోర్డ్ పై ఒక భాగంగా ఉంది. దీని యొక్క సెంట్రల్ కన్సోల్ లో ఒక ఆడియో వ్యవస్థ కూడా బిగించబడి ఉంటుంది. ఇది అందమైన లుక్ ను ఇస్తుంది. దీనితో పోటీ పడే వాటి గురించి మాట్లాడటానికి వస్తే, వ్యాగన్ఆర్ యొక్క అంతర్భాగాలు ఆకర్షణీయంగా ఉంటాయి, ఇప్పుడు ఉన్న వాటిలో ఆల్టో యొక్క అంతర్భాగాలు మరింత అందంగా ఉన్నాయి అని చెప్పవచ్చు, హ్యుందాయ్ ఇయాన్ గురించి చెప్పాలంటే దీని యొక్క అంతర్భాగాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఇప్పుడు రాబోయే క్విడ్ యొక్క అంతర్భాగాలు కూడా ఆకర్షణీయం తో రావచ్చు.  

 

ఇంజెన్

ముందు ప్రకటించిన విధంగా ఈ క్విడ్ 800cc పెట్రోల్ ఇంజెన్ తో రాబోతుంది. అంతేకాకుండా, ఈ ఇంజెన్లు 5-స్పీడ్ మాన్యువల్ సిస్టమ్తో బిగించబడి ఉంటాయి. తయారీదారుడు రెనాల్ట్ క్విడ్ యొక్క ఇంజెన్లు, ఉత్తమ మైలేజ్ ను అందిస్తాయని హామీ ఇస్తున్నాడు. రెనాల్ట్ సంస్థ, ఇప్పటి వరకు ఈ కారు యొక్క పవర్ గురించి ఏ రకమైన వివరములు తెలియజేయలేదు. ఈ వాహనం యొక్క మోటార్లు 1000cc కి సంబందించినవి కావు. అయినప్పటికి ఇవి రెనాల్ట్ ఇంజెన్ అమర్చినట్లైతే, ఇవి, ఆల్టో కె10, వాగర్ ఆర్ మరియు ఇయాన్ లు 1000cc ఇంజెన్ ల తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నారు. క్విడ్ గురించి ముందు చెప్పిన పాయింట్లు ఆధారంగా రెనాల్ట్ విభాగంలో ఇతర వాటితో పోటీ గా నిలచి, అవి మంచి అమ్మకాలను కలిగి ఉంటాయని ఆశిస్తున్నారు. 

was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience