పోటాపోటీ పరిశీలన: ఆడి క్యూ 3 వర్సెస్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ ఏ-క్లాస్ వర్సెస్ బిఎండబ్ల్యూ 1-సిరీస్ వర్సెస్ వోల్వో వ్40 క్రాస్ కంట్రీ

published on జూన్ 18, 2015 05:37 pm by అభిజీత్ కోసం ఆడి క్యూ3

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారుడైన ఆడి, చివరిగా నవీకరించబడిన ఆడి క్యూ3 ను భారత తీరాలకు ఇటీవల ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఈ క్యూ3 ఇప్పుడు, మెర్సిడెస్ జిఎల్ ఏ తో గట్టి పోటీ ను ఇస్తుంది. అయితే, బిఎండబ్ల్యూ ఎక్స్1 మరియు వోల్వో వి40 క్రాస్ కంట్రీ వాహనాలతో కూడా గట్టి పోటీను ఇవ్వడానికి ఇటీవల వచ్చింది. ఇంతకీ, ఈ క్యూ3 తో పోటీ పడే వాటితో తారతమ్యత పరీశీలిద్దాం రండి.  

 

బాహ్య భాగాలు:

క్యూ3 లో చుప్పుకోదగినది ఏమిటంటే, బాహ్యంగానే ఎక్కువగా మార్పు చేయబడ్డాయి. ముఖ్యంగా చెప్పుకోదగినది, సింగిల్ ఫ్రేం శాటిన్ క్రోమ్ గ్రిల్, రిఫ్రెష్ సెట్ హెడ్ ల్యాంప్స్, తో పాటు న్యూ డే టైం రన్నింగ్ ఎల్ ఈ డి లు. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త సమితి అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో బంపర్ మరియు టైల్ లైట్స్ చిన్న చిన్న మార్పులతో ఇటీవల ప్రవేశపెట్టబడింది. బాహ్య భాగాలు అంత బాగా కనిపించకపోయినా, ముందు దాని కంటే, బాగా నవీకరణలతో వచ్చింది. ఈ నాలుగింటిలో చూస్తే, అంత బాగా కనిపించేది జిఎల్ ఏ ఒక్కటే, తరువాత ఎక్స్1 మరియు వ్40 క్రాస్ కంట్రీ .

ఇంటీరియర్స్:

లోపలి భాగాలు పోల్చినప్పుడు, జిఎల్ ఏ తో పోలిస్తే క్యూ3 కొంచెం తాక్కువ అని చెప్పవచ్చు. పాత దానిలో ఉన్న విధంగా సాటిన్ క్రోమ్ ట్రిమ్స్ లో, పెడల్ షిప్టర్స్ మరియు ఒక కొత్త ఎం ఎం ఐ సమాచార వ్యవస్థ వంటి వాటితో రావడం వలన కారు మరింత తాజా గ కనిపిస్తుంది. క్యూ3 తో పోలిస్తే, జిఎల్ ఏ యొక్క అంతర్గత భాగాలు చాలా రెట్లు మెరుగైనది అని చెప్పవచ్చు. బిఎండబ్ల్యూ అంతర్గత భాగాలు బాగానే ఉండగా, ఒక నవీకరణ కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఇది ఇప్పుడు క్యూ3 తో సమమై ఉంటుంది. వి40 క్రాస్ కంట్రీ పూర్తిగా వేరే కథ మరియు ఇది చాలా కాంటెంపరరీ ఉన్నప్పటికీ, టాడ్ సాధారణ అంతర్గత అందిస్తుంది.

ఇంజిన్:

క్యూ3 అదే 2.0 లీటర్ టిడి ఐ మోటార్ తో వచ్చింది, మరియు ఇది 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ సిస్టం తో దీని యొక్క టార్క్ ను ఆల్ వీల్స్ కి పంపిస్తుంది. ఇది క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ జత చేయబడి ఉంతుంది. దీని యొక్క ఎస్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టం తో జత చేయబడి ఉంటుంది. ఆ విభాగంలో ఇది మాత్రమే ఏడబ్ల్యూ డి కలిగి ఉన్న వాహనం. వి40 మరియు జిఎల్ ఏ వాహనాల విషయానికి వస్తే, ఫోర్ వీల్ డ్రైవ్ ను కలిగి ఉంటాయి. అయితే, బిమ్మర్ విషయానికి వస్తే, రేర్ వీల్ డ్రైవ్ ను కలిగి ఉంటుంది.

ధర:

క్యూ3 యొక్క ధర రూ.28.99 లక్షలు, మెర్సిడెస్ జిఎల్ ఏ యొక్క ధిగువ శ్రేణి వేరియంట్ ధర రూ.32.8 లక్షలు. బిఎండబ్ల్యూ ఎక్స్1 యొక్క ప్రారంభ ధర రూ.30.8 లక్షలు వ్40 క్రాస్ కంట్రీ ధర రూ.27 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ధరలను చూసినట్లైతే, వొల్వో కారు యొక్క ధర చాలా తక్కువ అని చెప్పవచ్చు. కానీ దీని యొక్క అమ్మకాలు మరియు సేవ నెట్వర్క్ వెనుకంజలో ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఎక్స్1 ఫేస్లిఫ్ట్ కోసం వేచి ఉండాలి. దీని వలన ప్రస్తుతం తక్కువ అమ్మకాలను కలిగి ఉంది అని చెప్పవచ్చు. ధర పరం గా, అన్నింటితో పోలిల్స్తే, ఈ క్యూ3 బేస్ వేరియంట్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే, అగ్ర శ్రేణి వేరియంట్ల గురించి చెప్పాలంటే, జిఎల్ ఏ ఇప్పటికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఆడి క్యూ3

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience