పోల్చి చూద్దాం : మారుతి సుజుకి ఎస్-క్రాస్ వర్సెస్ రెనాల్ట్ డస్టర్

జూలై 15, 2015 02:06 pm sourabh ద్వారా ప్రచురించబడింది

జైపూర్:  కాంపాక్ట్  ఎస్యూవి వాహనాలైన  రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్  విడుదలయి విజయాన్ని రుచి చూసిన తర్వాత ఏస్  ప్రయాణీకుల కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి  కూడా దాని లాభదాయకమైన విభాగంలో  వాటికి పోటీగా కాంపాక్ట్  ఎస్యూవి మరియు క్రాస్ ఓవర్స్  సెగ్మెంట్లను  ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మారుతి సుజుకి తో పాటుగా కొరియన్ తయారీ సంస్థ హ్యూందాయ్  కూడా తమ క్రెటాను జూలై 21, 2015న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా పైన పేర్కొన్న విభాగంలోకే వస్తుంది. ఈ రెండు కొత్త కాంపాక్ట్ ఎస్యూవిలను ఆవిష్కరణలతో ఈ  సెగ్మెంట్ లలో పోటీ ఖచ్చితంగా సంఘర్షణ స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు కానీ వినియోగదారులు మాత్రం ఏమీఅందోళన చెందాల్సిన అవసరంలేదు ఎందుకనగా ఏదయిన ప్రోడక్ట్ ఎక్కువగా ఇస్తున్నారు అంటే ఎక్కువగా ఎంపికలు ఉంటాయి అని అర్థం  మరియు ఎక్కువ డబ్బు ఉన్న ఉత్పత్తులు ఎల్లప్పూడూ ఎక్కువ విలువను కలిగిఉంటాయి. మేము ఇప్పటికే క్రెటాను ఎస్-క్రాస్ తో పోల్చి చూశాము, కాబట్టి రెనాల్ట్ డస్టర్ మరియు మారుతి సుజుకి  యొక్క ఎస్-క్రాస్ లను ఇప్పుడు మనం సంక్షిప్తంగా పోల్చి చూద్దాము.

మనకి ఇప్పటికీ తెలిసినదే, రెనాల్ట్ డస్టర్ ఎస్ యు వి విభాగంలో అత్యుత్తమంగా రాణించింది. అందుకు కారణం రెనాల్ట్ యొక్క ఉత్ప్పతులే, వీటివలనే ఇది   దేశంలో  కాంపాక్ట్ ఎస్ యు వి విభాగంలో విజయవంతంగా మైలురాయిని చేరుకోగలిగింది మరియు భారతీయ ఆటో విభాగంలో పోటీతత్వ సంస్థలలో ఒకటిగా నిలిచింది.  ఇటీవల, రెనాల్ట్ కూడా దేశంలో డస్టర్ యొక్క ఎ వి డి వెర్షన్ ని పరిచయం చేసింది.

బాహ్య భాగాలు

పరిమాణాల వారీగా ఎస్-క్రాస్ ఓవర్ కన్నా, డస్టర్ మరియు టెర్రినో వాహనాల కొలతలు పై అంజలో ఉన్నాయి. డస్టర్ చూడటానికి స్టైలింగ్ మరియు పెద్దగా దూకుడు వైఖరిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఎక్కువ రహదారి ఉనికిని అందిస్తుంది. ఎస్-క్రాస్ ను పోల్చినట్లైతే, ఇది 4300 mm పొడవు, 1765 mm వెడల్పు మరియు 1590 mm ఎత్తు ను కలిగి ఉంది. అదే డస్టర్ విషయానికి వస్తే, పొడవు 4315 mm, వెడల్పు 1822 mm మరియు ఎత్తు 1695 mm గా ఉంది. అదే గ్రౌండ్ క్లియరెన్స్ ను చూసినట్లైతే, డస్టర్ 205 mm ను అదే ఏడబ్ల్యూడి లో ఇతే, 210 mm ను కలిగి ఉంటుంది. ఎస్-క్రాస్ విషయానికి వస్తే, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ను మాత్రమే కలిగి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో భారత రోడ్ల పరిస్థితికి జపనీస్ యొక్క వాహనాలు అనువుగా ఉంటాయి. అంతేకాకుండా డస్టర్, మంచి లెగ్ రూమ్ మరియు నీ రూం ని కలిగి ఉంటుంది. వీటితో పాటు దీని యొక్క వీల్బేస్ 2763 mm. మరోవైపు మారుతి సుజుకి ఎస్-క్రాస్ యొక్క వీల్బేస్ 2600 mm. కానీ అది ఇప్పటికీ డస్టర్ యొక్క సౌకర్యం తో సరిపోల్చలేము.

హుడ్ క్రింద

ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, ఎస్-క్రాస్ ను డీజిల్ పవర్ట్రెయిన్ తో మాత్రమే అందిస్తున్నారు. ఈ మారుతి సుజుకి ఎస్-క్రాస్, 1.3 లీటర్ మరియు పెప్పియర్ 1.6 లీటర్ వంటి రెండు డీజిల్ ఇంజన్ లతో రాబోతుంది. 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 4000 rpm వద్ద 90 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుద్ని. అదే విధంగా, 1750 rpm వద్ద 200 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు, 1.6 లీటర్ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 3750 rpm వద్ద 120 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా, 1750 rpm వద్ద 320 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మరింత మంచి పనితీరును ఇవ్వడానికి 1.6 లీటర్ ఇంజన్, 6- స్పీడ్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

అయితే, డస్టర్ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్లతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం పోలిక కోసం డీజిల్ ఇంజన్ ను మాతేమే తీసుకుందాం. 1.5 లీటర్ కె9కె పెట్రోల్ ఇంజన్, రెండు రకాల అవుట్పుట్ లను విడుదల చేస్తుంది. అవి వరుసగా, 85 PS మరియు రెండవది 110 PS. 85 PS పవర్ ను విడుదల చేసే ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ జత చేయబడి ఉంటుంది. అయితే, రెండవది 110 PS పవర్ ను విడుదల చేసే ఇంజన్, 6- స్పీడ్ మాన్యువల గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. సంస్థ, 110 PS పవర్ను విడుదల చేసే ఇంజన్, ఏడబ్ల్యూడి వెర్షన్ లో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పటికి ఎస్-క్రాస్ మాత్రం దీనిని అందించడం లేదు.

మొత్తానికి, డస్టర్ మంచిది అని తేలుస్తుంది.  ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కువ వీల్బేస్ తో మరియు ఏడబ్ల్యూడి వెర్షన్ ను ఆ పైన మంచి లెగ్రూం ని అందిస్తుంది. చీవరకు దీని యొక్క ధర పరిధి చాలా ఎక్కువ. అదే మారుతి సుజుకి ఎస్-క్రాస్ ను చూసినట్లైతే, 7 నుండి 7.5 లక్షల ధర పరిధి తో రాబోతుంది. ఈ ఎస్-క్రాస్, ఖచ్చితంగా డస్టర్ అమ్మకాలను దెబ్బ తీయవచ్చు. అంతేకాకుండా, హ్యుందాయ్ క్రెటా కూడా దీనితో పాటు రాబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience