• English
  • Login / Register

సెగ్మెంట్ల మధ్య పోరు: హ్యుందాయ్ వెర్నా Vs హ్యుందాయ్ క్రెటా- కొనుగోలు చేయడానికి ఏది సరైనది?

హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం cardekho ద్వారా మే 20, 2019 12:32 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మీరు సెడాన్ కొనాలా లేదా SUV కొనుగోలు చేయాలా? ఏది మరింత విలువను అందిస్తుంది చూద్దాము  

Hyundai Verna vs Hyundai Creta

చాలా మంది సెడాన్ మరియు SUV మధ్య ఎంపికను వాటి బాడీ టైప్ లను చూసి  ఎంచుకుంటారు. కానీ కొంతమంది ఆ వాహనం యొక్క విలువని మరి పనితీరుని చూసి ఎంచుకుంటారు బాహ్య రూపంతో పని లేకుండా వాహనం అందించే పనితీరు బట్టి కొంతమంది ఎంచుకుంటారు. మీరు రెండో వర్గానికి చెందినవారు అయ్యుంటే గనుక హుండాయ్ షోరూమ్ లోపలకి వెళితే రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల శ్రేణిలో కారుని కొనుగోలు చేయగలిగితే, వెర్నా మరియు క్రెటా మధ్య పికప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఈ రెండు కార్లు యొక్క వేరియంట్స్ ధర చార్ట్ లో ఒకదానితో మరొకటి పోలికగా ఉన్నాయి.   

పెట్రోల్

  • హుండాయ్ వెర్నా EX (రూ.9.09 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా E (రూ. 9.29 లక్షలు)
  • హుండాయ్ వెర్నా SX (రూ.9.75 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా E+ (రూ. 9.99 లక్షలు)
  • హుండాయ్ వెర్నా SX (O) (రూ. 11.41 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా SX+ (రూ. 12.02 లక్షలు)
  • హుండాయ్ వెర్నా 1.6 SX (O) ఆటోమేటిక్ (రూ. 12.55 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా 1.6 SX + ఆటోమాటిక్ (రూ. 13.03 లక్షలు)

డీజిల్

  •  హ్యుందాయ్ వెర్నా EX (రూ. 10.31 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా E (రూ. 9.99 లక్షలు)
  • హ్యుందాయ్ వెర్నా SX (రూ. 11.44 లక్షలు)Vs హ్యుందాయ్ క్రెటా S (రూ 11.38 లక్షలు)
  • హ్యుందాయ్ వెర్నా SX (O) (రూ 12.75 లక్షలు) Vs హ్యుందాయ్ క్రెటా SX (రూ. 12.50 లక్షలు)

Hyundai Verna

కాబట్టి, మీరు ఏ కారుని ఎంచుకోవాలి? మేము మీకు సమాధానం చెప్పేముందు, ఈ రెండు కార్ల మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ 2017 లో కొత్త వెర్నాను ప్రారంభించింది. ఇది 3-బాక్స్ సెడాన్ మరియు హోండా సిటీ మరియు మారుతి సియాజ్ లతో పాటుగా దాని విభాగంలో మరింత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. వెర్నా యొక్క క్యాబిన్ అనేది మంచి మంచి లక్షణాలతో యజమానులకు అనుగుణంగా ఉంటుంది. అయితే, వెర్నాలో కొంత స్థలం ఇప్పటికీ ఉంది, అయినప్పటికీ అది గత తరానికి చెందినదానికన్నా ఉత్తమంగా ఉంది. దీని యొక్క బూట్ స్పేస్ 480 లీటర్ల వద్ద ఉంది.

హ్యుందాయ్ క్రెటా అనేది కాంపాక్ట్ SUV, వెర్నా కంటే ఎక్కువ పరిమాణం (పొడవు మరియు వెడల్పు) లో ఉంది. ఇది కొంతకాలం చుట్టూ ఉంది మరియు హ్యుందాయ్ ఈ సంవత్సరం దీనికి  ఒక కాస్మెటిక్ నవీకరణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సన్రూఫ్ వంటి కొన్ని కొత్త లక్షణాలను కూడా కలిగి ఉంది. లక్షణాలతో లోడ్ చేయబడిన, క్రెటా దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోయిన SUV మరియు సౌకర్యం మీద కేంద్రీకరించబడిన క్యాబిన్ ని కలిగి ఉంది. క్రెటాలోని వెనుకాతల ఉన్న స్థలం వెర్నాలో కంటే మెరుగైనది. అయితే, బూట్ స్పేస్ 400 లీటర్ల వద్ద మాత్రమే ఉంది, 80 లీటర్లు వెర్నా కంటే తక్కువగా ఉంటుంది.

వెర్నా 2 పెట్రోల్ ఇంజన్లు మరియు ఒక డీజిల్ ఇంజన్ తో  లభిస్తుంది. ఇది క్రెటా లో కలిగి ఉన్న అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ని పంచుకుంటుంది. ఇతర పెట్రోల్ ఇంజన్ 1.4 లీటర్ యూనిట్. 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్  6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉండగా, 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో అందుబాటులో ఉన్నాయి.

వెర్నా తో పంచుకున్న 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతోపాటు, ఇది ఒక 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో పెద్ద ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి. చిన్న డీజిల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే లభిస్తుంది

కొత్త వెర్నా నగరం వేగాలలో గుంతలు మరియు అసమాన రహదారులలో మంచి పనితీరుని అందిస్తుంది మరియు హైవే పై దీని డ్రైవింగ్ చాలా సరదాగా ఉంటుంది.  వెర్నాలో అంతకు ముందు ఉండే ఎగిరి పడే రైడ్ సమస్య ఇప్పుడు పోయింది మరియు కారు అధిక వేగంతో మరింత స్థిరంగా ఉంటుంది. కార్నర్స్ లో వెళ్ళేటప్పుడు కొంచెం బాడీ రోల్ అనేది ఉంటుంది, కానీ మరీ ఎక్కువ అయితే కాదు.

క్రెటా యొక్క సస్పెన్షన్ మృదువైన వైపు ఏర్పాటు చేయబడింది. అంటే, ఇది గుంతలు మరియు రోడ్లు అంతరాలు ఉన్నప్పుడు చాలా బాగా పనితీరుని ప్రదర్శిస్తుంది. కానీ రహదారిలో మాత్రం, క్రెటా కారు వెర్నా కంటే కొంచెం తక్కువ పనితీరుని అందిస్తుందని చెప్పాలి.  

పోటీదారులు: హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్వాగన్ వెంటో, స్కోడా రాపిడ్ మరియు రాబోయే టయోటా యారీస్

పోటీదారులు: రెనాల్ట్ డస్టర్, రెనాల్ట్ క్యాప్చర్, మరియు మారుతి సుజుకి S-క్రాస్

పెట్రోల్ పోలిక

హ్యుందాయ్ వెర్నా 1.4 EX Vs హ్యుండాయ్ క్రెటా 1.6 E

హ్యుందాయ్ వెర్నా 1.4 EX - రూ. 9.09 లక్షలు

హ్యుందాయ్ క్రీటా 1.6 E - రూ. 9.29 లక్షలు

లక్షణాలు:

Hyundai Verna

వెర్నా EX డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, క్రూయిస్ కంట్రోల్, రియర్ A.C వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెన్సార్లు మరియు డైనమిక్ గైడ్‌లైన్స్ తో రేర్ పార్కింగ్ కెమెరా, ఆర్కామిస్ సౌండ్ తో 5-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్, డ్రైవర్ సీటు హైట్ అడ్జస్టర్ మరియు పవర్ విండోస్ వంటి లక్షణాలను పొందుతుంది. మరోవైపు, క్రెటా E డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, ABS, డే / నైట్ IRVM, టిల్ట్-సర్దుబాటు స్టీరింగ్, అన్ని-నాలుగు పవర్ విండోస్ మరియు వెనుక వెంట్లతో కూడిన A.C వంటి బేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలో  ఒక మ్యూజిక్ సిస్టం లేకపోవడం ఒక ప్రధాన లోపం అని చెప్పవచ్చు. ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉన్నట్లయితే అది చాలా స్వాగతించదగినదిగా ఉండేది.

టేక్ అవే:

ఇది అందిస్తున్న లక్షణాలను మరియు ధరని గనుక చూసుకునంట్లయితే వెర్నా EX అనేది E కంటే కూడా బాగుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. క్రెటా E అనేది పరిమిత బడ్జెట్ లో ఒక SUV ని స్వంతం కావాలనుకునే వారికి చాలా బాగుంటుంది. కానీ దీని యొక్క ధరని గనుక పరిగణలోనికి తీసుకున్నట్లయితే  వెర్నా EX పైన దీనికి ఉన్న ప్రీమియం చూసుకున్నట్లయితే క్రెటా E అయితే డబ్బుకి తగిన విలువని అయితే అందించదు. 1.4L పెట్రోల్ ఇంజిన్ తో వెర్నా EX అందించే ప్రదర్శన ఖచ్చితంగా సరిపోతుంది అయితే కొనుగోలుదారులు మనస్సులో పెట్టుకోవలసిన విషయం ఇది.  

Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా 1.6 SX vs హ్యుందాయ్ క్రెటా 1.6 E +

హ్యుందాయ్ వెర్నా 1.6 SX - రూ. 9.75 లక్షలు

హ్యుందాయ్ క్రెటా 1.6 E+ - రూ. 9.99 లక్షలు

లక్షణాలు

మునుపటి వేరియంట్స్ కలిగి ఉన్న లక్షణాలే కాకుండా వెర్నా ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఆటో డిమ్మింగ్ IRVM, అల్లాయ్ చక్రాలు మరియు 5 అంగుళాల యూనిట్ కి బదులుగా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థను పొందుతుంది. యాడ్-ఆన్లు దానిపై ప్రీమియం ప్రదర్శనను ఇవ్వడం పై దృష్టి కేంద్రీకరించబడి ఉంటాయి.

మరోవైపు, హ్యుందాయ్ క్రెటా E +, E వేరియంట్ పై రూఫ్ రెయిల్స్, టచ్స్క్రీన్ ఆడియో సిస్టమ్ (కానీ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే లేదు) మరియు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM లు (కాని ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ కాదు) వంటి ముఖ్యమైన అధనపు లక్షణాలు తప్ప ఇంకేమీ పెద్దగా కలిగి లేదు. రూ.10 లక్షల ధర కలిగి ఉన్న వాహనంలో, పార్కింగ్ సెన్సార్ల లేకపోవడం మా అభిప్రాయం లో చాలా పెద్ద లోపం అని చెప్పవచ్చు. వెర్నా ఈ రెండిటిలో మంచి లక్షణాలతతో అమర్చబడిన వాహనంగా కొనసాగుతుంది.

టేక్అవే:

మా తీర్పు ఈ వేరియంట్ కోసం అయితే మారదు. ఎందుకంటే క్రెటా రెండవ వేరియంట్ అయినప్పటికీ ఇంకా బేసిక్ కారు లానే ఉంది. వెర్నా యొక్క క్యాబిన్ మీరు ఒక ఆధునిక వాహనం లోపల కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా 1.6 SX(O) Vs హ్యుందాయ్ క్రెటా1.6 SX +

హ్యుందాయ్ వెర్నా 1.6 SX (O) రూ. 11.41 లక్షలు

హ్యుందాయ్ క్రెటా 1.6 SX + రూ.  12.02 లక్షలు

హ్యుందాయ్ వెర్నా 1.6 SX (O) ఆటోమేటిక్ రూ. 12.55 లక్షలు

హ్యుందాయ్ క్రేటా 1.6 SX + ఆటోమేటిక్ రూ. 13.03 లక్షలు

Hyundai Creta

లక్షణాలు  

వారి టాప్ వేరియంట్స్ లో , వెర్నా మరియు క్రెటా రెండూ చాలా లక్షణాలతో లోడ్ అవుతాయి మరియు వాటిలో కొన్ని సాధారణంగా ఉన్నాయి. రెండు కార్లు సెన్సార్లు మరియు డైనమిక్ గైడ్ లైన్స్ తో రేర్ పార్కింగ్ కెమేరా,  LED DRLs తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, స్మార్ట్ కీ తో పుష్ బటన్ స్టార్ట్, క్లస్టర్ అయినోజర్ తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆర్కేంస్ ధ్వని తో టచ్స్క్రీన్ ఆడియో సిస్టమ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి.  ఇక్కడ కొత్త కారుగా ఉండటం వలన, వెర్నా సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్,లెథర్ తోలు అప్హోల్స్టరీ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అదనపు అదనపు లక్షణాలతో వస్తుంది.  

టేక్అవే:

ఒక సన్రూఫ్ మరియు అదనపు ఎయిర్ బాగ్స్ తో, వెర్నా యొక్క టాప్ వేరియంట్ మంచి లక్షణాలతో హృదయానికే కాదు మనసుకి కూడా దగ్గరగా ఉంటుంది. మనకి తెలుసు ఈ వెంటిలేటెడ్ సీట్లు మనలాంటి వేడి గా ఉన్న ప్రదేశాలలో ఒక మంచి వరం అని చెప్పవచ్చు. 15 లక్షల రూపాయల మేరకు వెర్నా యొక్క ఫీచర్ జాబితా బాగా ఆకట్టుకుంటుంది మరియు క్రెటా యొక్క టాప్ వేరియంట్ కూడా చెప్పాలి, ఇది 50,000 కంటే ఎక్కువ ఖరీదుగా ఉంటుంది, పోల్చితే మందమైనదిగా అనిపిస్తుంది.

కానీ క్రెటా ని గనుక మీరు పక్కన పెట్టి చూస్తే మరీ అంత బాగోకుండా ఏమీ ఉండదు, ఎందుకంటే దీనిలో కూడా మనకి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, మీరు క్రెటా వైపు గనుక మొగ్గు చూపినట్లయితే ఈ యొక్క రెండు కార్ల మధ్య తేడా ఏవైతే ముందు మనం పట్టికలో చెప్పామో అవి సరే అనుకుంటే గనుక మీరు ఈ SUV కి వెళ్ళవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ కారుకి ఫేస్లిఫ్ట్ రాబోయే రోజుల్లో రానున్నది, కాబట్టి దీని కంటే మంచి లక్షణాలతో రావచ్చు అది మనం చెప్పలేము.   

డీజిల్:

హ్యుందాయ్ వెర్నా 1.6 EX vs హ్యుందాయ్ క్రెటా 1.4 E

హ్యుందాయ్ వెర్నా 1.6 SX రూ. 10.31 లక్షలు

హ్యుందాయ్ క్రెటా 1.4 E రూ. 9.99 లక్షలు

లక్షణాలు:

వెర్నా EX డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ABS, క్రూయిస్ కంట్రోల్, రియర్ A.C వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెన్సార్లు మరియు డైనమిక్ గైడ్ లైన్స్ తో వెనుకవైపు ఉన్న పార్కింగ్ కెమెరా, ఆర్కామిస్ సౌండ్ తో 5-ఇంచ్ టచ్స్క్రీన్ ఆడియో వ్యవస్థ, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, డ్రైవర్ సీటు హైట్ అడ్జస్టర్ మరియు పవర్ విండోస్ వంటి లక్షణాలను కలిగి ఉంది. మరోవైపు, క్రెటా E డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, ABS, డే / నైట్ IRVM, టిల్ట్-సర్దుబాటు స్టీరింగ్, మొత్తం నాలుగు పవర్ విండోస్ మరియు వెనుక వెంట్లతో A.C వంటి ప్రాథమిక అంశాలన్నింటిని కలిగి ఉంది. ఒక సంగీత వ్యవస్థ లేకపోవడం ఒక పెద్ద లోపం మరియు అది హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటే మరింత స్వాగతించే మార్పు గా ఉండేది.

టేక్అవే:

రెండు కార్ల డీజిల్ వేరియంట్లలోని ఉన్నటువంటి లక్షణాలు పెట్రోల్ వేరియంట్ లలో ఉన్న వాటితో సమానంగా ఉన్నా కూడా ఇక్కడ వెర్నా అనేది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ సమయంలో అయితే, వెర్నా అధిక ధరని కలిగి ఉంటుంది, కానీ ఆ ప్రీమియం అనేది ఖచ్చితంగా న్యాయం చేస్తుంది.

Hyundai Creta

హ్యుందాయ్ వెర్నా 1.6 SX Vs హ్యుందాయ్ క్రెటా 1.4 S

హ్యుందాయ్ వెర్నా 1.6 SX రూ. 11.44 లక్షలు

హ్యుందాయ్ క్రెటా 1.4 S రూ. 11.38 లక్షలు

లక్షణాలు

మునుపటి వేరియంట్ పైన, క్రెటా S ఫాగ్ లాంప్స్, యాంటెన్నా, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు, అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు వెనుక హెడ్ రెస్ట్ మరియు బ్లూటూత్ తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలను పొందుతుంది. కానీ వెర్నా SX యొక్క లక్షణాల జాబితాకి దగ్గరగా కార్నరింగ్ ల్యాంప్స్ మరియు LED DRLS తో ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16-ఇంచ్ డైమెండ్ కట్ అలాయ్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు మరిన్ని వాటితో కూడిన 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.

టేక్అవే:

క్రెటా, దాని మిడ్ వేరియంట్ లో కూడా వెర్నా పై సిఫార్సు చేయడానికి మనకి చాలా పరికరాలు అందించడం లేదు. ఇది మనకి కేవలం బేసిక్ భద్రతా లక్షణాలను మరియు సౌకర్య లక్షణాలను అందిస్తుంది. వెర్నా అవసరాలను దాదాపుగా పరిపూర్ణ లక్షణాలను అందిస్తుంది మరియు ఒక మరింత  సమగ్ర ఫీచర్ జాబితాని మేము కోరుకుంటున్నాము.  

హ్యుందాయ్ వెర్నా SX(O) vs హ్యుందాయ్ క్రెటా SX

హ్యుందాయ్ వెర్నా SX (O) రూ. 12.75 లక్షలు

హ్యుందాయ్ క్రెటా SX రూ. 12.50 లక్షలు

లక్షణాలు

టాప్ వేరియంట్ అయిన SX (O) అన్ని అద్భుతమైన లక్షణాలతో వస్తుంది, ఉదాహరణకు సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్ కీ, తోలు అప్హోల్స్టరీ మొదలైనవి కలిగి ఉంది. మరోవైపు క్రెటా SX టాప్ వేరియంట్ కాదు. ఇది రేర్ పార్కింగ్ సెన్సార్స్, 16-అంగుళాల అలాయ్స్, కార్నరింగ్ ల్యాంప్స్ మరియు LED లతో ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అవుట్ రియర్ వ్యూ మిర్రర్స్, రియర్ వైపర్ అండ్ వాషర్, ఫ్రంట్ గ్రిల్ లో సిల్వర్-క్రోమ్ ఫినిష్, టైలర్గేట్ మరియు మెటాలిక్ స్కఫ్ ప్లేట్లపై క్రోమ్ గార్నిష్ వంటి లక్షణాలను కలిగి ఉంది.  

టేక్అవే

దాదాపు 25,000 రూపాయల ప్రీమియంతో, వెర్నా ఇక్కడ ఈ రెండు మోడల్ లో ఎంచుకోవాల్సిన ఎంపికగా ఉంటుంది. అయితే, మళ్ళీ, దీనిని వెర్నా తో పోల్చకుండా ప్రత్యేఖంగా గనుక చూసినట్లయితే క్రెటా కారు వెర్నా కంటే మరీ అంత తక్కువ లక్షణాలు కలిగిన కారు అయితే కాదు. అందువల్ల మేము ముందుగా పట్టికలో పేర్కొన్న ప్రాథమిక వ్యత్యాసాల ఆధారంగా, క్రెటా మీకు బాగా సరిపోయేలా ఉంటే, మీరు వెర్నా యొక్క SX (O) పై దాని SX వేరియంట్ ను పరిగణించవచ్చు.    

తీర్పు: ఏ కారు కొనాలి?

Hyundai Creta

క్రెటా ని ఎందుకు కొనాలి?

రైడ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్: క్రెటా సంప్రదాయ SUV కానప్పటికీ, అది ఇప్పటికీ వెర్నా కంటే ఎక్కువగా నడుస్తుంది మరియు సరైన నాణ్యత లేని రహదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది.

ప్రయోజనం:

దానికి ఉన్న ఫోల్డబుల్ రేర్ సీటుకి ధన్యవాధాలు తెలుపుకోవాలి, క్రెట్టా మీ యొక్క ఒక సూట్కేస్ నుండి వెనక భాగంలో ఒక సైకిల్ వరకు ఏదైనా తీసుకువెళుతుంది. అదనంగా, మీరు వెళుతున్నప్పుడు మీ అధనపు సామానుకు కూడా తీసుకెళ్ళవచ్చు.

క్యాబిన్ స్థలం: క్రెటా ఈ రెండింటిలోనూ మరింత విశాలమైనది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2017 Hyundai Verna

ఎందుకు వెర్నా కొనుగోలు చేయాలి?

లక్షణాలతో ప్యాక్ చేయబడింది: వెర్నా దాని లక్షణాల పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగా ప్యాక్ చేయబడుతుంది.

పెద్ద బూట్: 480 లీటర్ల వద్ద, వెర్నాలో 5 మంది వ్యక్తులతో పాటూ క్రెటా కంటే ఎక్కువ లగేజీ స్థలాన్ని అందించే స్పేస్ ని కలిగి ఉంది.  

ప్రస్తుత ఉన్న క్రెటా చాలా వృద్ధాప్యం గలది మరియు ఈ సంవత్సరం ఒక ఫేస్లిఫ్ట్ ను అందుకోబోతుంది. మరోవైపు, వెర్నా ఇటీవల పూర్తిగా నవీకరణ చెందిన తాజా మోడల్ గా ఉంది.

స్పెసిఫికేషన్స్: ఇంజన్లు

క్రెటా

 

1.6L పెట్రోల్

1.4L డీజిల్

1.6L డీజిల్

పవర్

123PS

90PS

128PS

టార్క్

151Nm

220Nm

260Nm

ట్రాన్స్మిషన్

6MT/6AT

6MT

6MT/6AT

వెర్నా

 

1.6L పెట్రోల్

1.4L పెట్రోల్

1.6L డీజిల్

పవర్

123PS

100PS

128PS

టార్క్

151Nm

132Nm

260Nm

ట్రాన్స్మిషన్

6MT/6AT

6MT

6MT/6A


 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai వెర్నా 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience