eC3తో భారతదేశంలో EV పవర్ؚను విడుదల చేసిన సిట్రోయెన్
సిట్రోయెన్ ఈసి3 కోసం rohit ద్వారా ఫిబ్రవరి 28, 2023 12:01 pm ప్రచురించబడింది
- 33 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో 320 కిమీ వరకు మైలేజ్ అందిస్తూ ARAIచే దృవీకరించబడింది.
-
ఇది రెండు వేరియెంట్‌లలో అందుబాటులో ఉంటుంది: లైవ్ మరియు ఫీల్.
-
ధర రూ.11.50 లక్షల నుండి 12.43 లక్షల వరకు ఉంటాయి (ప్రారంభ ఎక్స్- షోరూమ్)
-
వీటిలో 57PS మరియు 143Nm పవర్, టర్క్‌ను అందించే ఒకే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
-
10-అంగుళాల టచ్ స్క్రీన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, కీలెస్ ఎంట్రీలతో వస్తుంది.
-
ICE వర్షన్‌తో పోలిస్తే ఇది రూ.5.5 లక్షల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.
భారతదేశం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో వేగవంతమైన వృద్ధి కనిపిస్తుంది, అన్నీ కారు తయారీ కంపెనీలు వివిధ ధరలకు ఎలక్ట్రిక్ కార్‌లను అందిస్తున్నాయి. ఇప్పుడు సిట్రోయెన్ కూడా, C3 మోడల్ పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ؚ అయిన eC3 ఎంట్రీ-లెవెల్ వాహనంతో ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇది రెండు విస్తృత వేరియెంట్ؚలలో అందించబడుతుంది: లైవ్ మరియు ఫీల్.
ఇది కూడా చదవండి: eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో టాక్సీ మార్కెట్ؚలోకి ప్రవేశించనున్న సిట్రోయెన్
దీని వేరియెంట్-వారీ ధరలను చూద్దాం:
వేరియెంట్ |
ధర (ప్రారంభ ఎక్స్-షోరూమ్) |
లైవ్ |
రూ. 11.50 లక్షలు |
ఫీల్ |
రూ. 12.13 లక్షలు |
ఫీల్ వైబ్ ప్యాక్ |
రూ. 12.28 లక్షలు |
ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ |
రూ. 12.43 లక్షలు |
టాటా టియాగో EV ఎంట్రీ-లెవెల్ లాంగ్-రేంజ్ వేరియెంట్ؚతో పోలిస్తే, సిట్రోయెన్ eC3 ప్రారంభ ధర రూ.1.31 లక్షలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, కంబుషన్-ఇంజన్ C3 వేరియెంట్ؚ ఎంట్రీ-లెవెల్ eC3 కంటే రూ.5.5 లక్షల వరకు ధర అధికంగా ఉంటుంది. eC3 డెలివరీలు వెంటనే ప్రారంభం కావచ్చని అంచనా, ఈ వాహనాన్ని ఫ్యాక్టరీ నుండి నేరుగా కొనుగోలు చేసి తమ ఇంటి వద్దకు డెలివరీ పొందగలిగే అవకాశాన్ని కూడా సిట్రోయెన్ కస్టమర్‌లకు అందిస్తుంది.
పరిధి, శక్తి మరియు ఛార్జింగ్
ఇది 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో 320 కిమీ వరకు మైలేజ్ అందిస్తూ ARAIచే దృవీకరించాంబడింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ ముందు వీల్స్ؚను నడిపే ఏకైక ఎలక్ట్రిక్ మోటార్ (57PS/143Nm)తో వస్తుంది. ఇది గరిష్టంగా 107kmph వేగాన్ని అందుకోగలదు. ఈ వాహనాలు రెండు ఛార్జింగ్ ఎంపికలతో వస్తాయి: 10 గంటల 30 నిమిషాలలో సున్నా నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయగల 15A సాకెట్ ఛార్జర్, 10 నుండి 80 శాతం వరకు 57 నిమిషాలలో ఛార్జింగ్ చేయగలిగిన DC ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది.
ముఖ్యమైనవి
సిట్రోయెన్ EV- మాన్యువల్ AC, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, కీలెస్ ఎంట్రీ, ఎత్తు-సవరించగలిగే డ్రైవర్ సీట్ మరియు పవర్ విండోలు వంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. వీటిలో వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 10-అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ కస్టమర్‌లు సిట్రోయెన్ కనెక్టెడ్ టెక్ ఫీచర్‌లకు ఏడు సంవత్సరాల సబ్ؚస్క్రిప్షన్ؚను పొందవచ్చు. దాని ICE వర్షన్ కూడా ఇవే ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
వారెంటీ కవరేజ్
eC3 బ్యాటరీ ఏడు సంవత్సరాలు లేదా 1.4 లక్షల కిలోమీటర్‌ల వారెంటీతో వస్తుంది, ఇది టాటా అందించే ఎనిమిది సంవత్సరాలు, 1.6 లక్షల కిలోమీటర్‌లతో వచ్చే సాధారణ EV బ్యాటరీ కవరేజ్ కంటే తక్కువ. మరోవైపు, ఎలక్ట్రిక్ మోటార్ ఐదు సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్‌ల కవరేజ్ కలిగి ఉంటుంది, వాహనానికి మూడు సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిమీ వారెంటీ ఉంటుంది. సిట్రోయెన్ eC3పై ఏడు సంవత్సరాలు లేదా రెండు లక్షల కిమీ వరకు పొడిగించిన వారెంటీని అందిస్తుంది.
దీని ప్రత్యర్ధులను చూద్దాం
ఇది టాటా టియాగో EV, టిగోర్ EVలతో పోటీ పడుతుంది. టాటా నెక్సాన్ EV ప్రైమ్/మాక్స్, మహీంద్రా XUV 400 వంటి వాటికి చవకైన ఎంపిక కాగలదు. ఈ ఫ్రెంచ్ కారు తయారీదారు, eC3ని ఫ్లీట్ కొనుగోలుదారులకు కూడా అందిస్తున్నారు, ఇక్కడ ఇది టాటా టిగోర్ EV ఎక్స్ؚప్రెస్-Tతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: eC3 ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful