Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఎట్టకేలకు C3 ఎయిర్ؚక్రాస్ SUVని మార్కెట్‌లోకి తీసుకువస్తున్న సిట్రోయెన్

సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 28, 2023 01:57 pm ప్రచురించబడింది

ఈ మూడు-వరుసల కాంపాక్ట్ SUV తన స్టైలింగ్ؚను C3 మరియు C5 ఎయిర్ؚక్రాస్ నుండి పొందింది మరియు 2023 రెండవ భాగంలో విడుదల కానుంది.

  • C3 ఎయిర్ؚక్రాస్ ప్రధానంగా మూడు-వరుసల SUV కానీ మరింత బూట్ స్పేస్ కోసం మూడవ-వరుస సీట్‌లను తొలగించవచ్చు.

  • సిట్రోయెన్ C3 నుండి 110PS, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది.

  • 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఇందులో ఉంటాయి.

  • ధర రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.

చాలా రోజుల ఎదురు చూపు తరువాత మరియు అనేక రహస్య చిత్రాల విడుదల తరువాత, సిట్రోయెన్ ఎట్టకేలకు తమ తాజా ఆఫరింగ్ؚను ప్రపంచానికి వెల్లడించింది. C3 హ్యాచ్ؚబ్యాక్‌పై ఆధారపడి, C3 ఎయిర్ؚక్రాస్ పేరుగల 3-వరుసల కాంపాక్ట్ SUVని కారు తయారీదారు విడుదల చేశారు. ఈ మోడల్ గురించి తెలుసుకోవలసిన అంశాలు క్రింద అందించబడ్డాయి:

డిజైన్

C3 ఎయిర్ క్రాస్ؚను ముందు నుండి చూస్తే, దీని స్టైలింగ్ C3 మరియు C5 ఎయిర్‌క్రాస్ కలయికలా ఉండటాన్ని గమనించవచ్చు. భారీగా ఉండే ముందు భాగం C5 ఎయిర్‌క్రాస్ స్టైలింగ్ నుంచి ప్రేరణ పొందింది, మరొక వైపు దీని హెడ్‌ల్యాంప్ؚలు C3 హ్యాచ్ؚబ్యాక్ؚను పోలి ఉంటాయి.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్: మేలో విడుదల కానున్న నవీకరించబడిన సిట్రోయెన్ C3 టర్బో: అదనపు భద్రత ఫీచర్‌లతో రానుంది

పక్కవైపు చూస్తే, C3తో పోల్చితే, ఈ కాంపాక్ట్ SUV పొడవైన ప్రొఫైల్ మరియు ఎక్కువ ఎత్తును పొందుతుంది, దీని వలన మూడవ వరుసను తేలికగా సర్దుబాటు చేయవచ్చు, అయితే ఈ కాంపాక్ట్ SUV 5-సీటర్‌ల ఎంపికను కూడా పొందునుంది. ఇతర రెండు మోడల్‌ల డిజైన్ؚలో కనిపించని, కొత్త 17-అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి.

వెనుక వైపు, C3 ఎయిర్‌క్రాస్ సారూప్యంగా కనిపించే టెయిల్ ల్యాంపుల సెటప్ؚను పొందింది, కానీ మధ్యలో మందంగా ఉన్న నలుపు రంగు కనెక్టింగ్ ఎలిమెంట్ؚను కలిగి ఉంది. ఈ కాంపాక్ట్ SUV వెనుక వైపు, C3 వెనుక ప్రొఫైల్ మస్క్యులార్ వెర్షన్ؚలాగా కనిపిస్తుంది.

పవర్ؚట్రెయిన్

C3 ఎయిర్ؚక్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను C3 హ్యాచ్‌బ్యాక్ నుండి పొందింది. ఈ యూనిట్ 110PS పవర్ మరియు 190Nm టార్క్‌ను అందిస్తుంది మరియు ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది. ప్రస్తుతానికి, C3 ఎయిర్ؚక్రాస్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో లభించదు, కానీ తరువాత రావచ్చు.

ఇంటీరియర్ లుక్ C3 నుంచి ప్రేరణ పొందింది, కానీ విభిన్న నలుపు మరియు లేత గోధుమరంగు డ్యూయల్-టోన్ థీమ్ؚలో, కొద్దిగా పైకి అమర్చిన డ్యాష్ؚబోర్డ్ డిజైన్ కలిగి ఉంటుంది. C3 ఎయిర్ؚక్రాస్ ముఖ్యంగా 7-సీట్‌ల SUV, కానీ రెనాల్ట్ ట్రైబర్ؚలా దీని మూడవ-వరుస సీట్‌లను తొలగించవచ్చు.

దీని ఫీచర్‌లు, సిట్రోయెన్ C3 ఫీచర్‌ల విధంగానే ఉంటాయి, కొన్ని అదనంగా ఉన్నాయి. ఇది వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలతో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డే/నైట్ IRVM, మరియు రూఫ్ؚకు అమర్చిన రేర్ AC వెంట్ؚలతో మాన్యువల్ ACలను కలిగి ఉంటుంది.

భద్రత

ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, C3 ఎయిర్ؚక్రాస్ ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రేర్ వ్యూ కెమెరా మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లతో వస్తుంది.

ధర పోటీదారులు

ఈ కాంపాక్ట్ SUV ధర రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా మరియు ఆగస్ట్ 2023 నాటికి విడుదల అవుతుందని ఆశిస్తున్నాము. విడుదల అయిన తరువాత C3 ఎయిర్ؚక్రాస్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటితో పోటీ పడనుంది.

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 91 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన సిట్రోయెన్ సి3 Aircross

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర