Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రూ. 12.85 లక్షల ధరతో విడుదలైన Citroen C3 Aircross Automatic

సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్ కోసం shreyash ద్వారా జనవరి 29, 2024 07:47 pm ప్రచురించబడింది

ఇది ఇప్పుడు సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన ఆటోమేటిక్ ఎంపిక, ఇతర ఆటోమేటిక్ కాంపాక్ట్ SUVలతో పోలిస్తే దీని ధర రూ. 50,000కు పైగా తగ్గించబడింది.

  • C3 ఎయిర్‌క్రాస్ ఇప్పుడు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో అందుబాటులో ఉంది.

  • C3 ఎయిర్‌క్రాస్ యొక్క మధ్య శ్రేణి ప్లస్ వేరియంట్ నుండి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను పొందవచ్చు.

  • ఇది 110 PS మరియు 190 Nm టార్క్ లను విడుదల చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది.

  • SUV ఫీచర్ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

  • ఇందులో 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే మరియు మాన్యువల్ AC ఉన్నాయి.

  • అలాగే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా ద్వారా భద్రత నిర్దారించబడుతుంది.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ. 12.85 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ధర నుండి ప్రారంభమవుతాయి. ఇది సెప్టెంబర్ 2023లో భారతదేశంలో ప్రవేశపెట్టబడినప్పుడు, సిట్రోయెన్ యొక్క కాంపాక్ట్ SUV 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడింది. ఇప్పుడు, ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (టార్క్ కన్వర్టర్) ఎంపికను కూడా పొందుతుంది.

C3 ఎయిర్‌క్రాస్ మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి వరుసగా - లైవ్, ఫీల్ మరియు మాక్స్. అలాగే ఈ విభాగంలో 7-సీటర్ కాన్ఫిగరేషన్ ఎంపికను అందించే ఏకైక కాంపాక్ట్ SUV అలాగే తొలగించగల మూడవ-వరుస సీట్లును కూడా కలిగి ఉంది. వీటిలో, మధ్య శ్రేణి ప్లస్ మరియు అగ్ర శ్రేణి మ్యాక్స్ వేరియంట్‌లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో వస్తాయి. మేము మరిన్ని వివరాల్లోకి వెళ్ళే ముందు, C3 ఎయిర్క్రాస్ ఆటోమేటిక్ ధరలను చూద్దాం:

వేరియంట్

మాన్యువల్

ఆటోమేటిక్

వ్యత్యాసము

ప్లస్ 5-సీటర్

రూ.11.55 లక్షలు

రూ.12.85 లక్షలు

+ రూ. 1.3 లక్షలు

మాక్స్ 5-సీటర్

రూ.12.20 లక్షలు

రూ.13.50 లక్షలు

+ రూ. 1.3 లక్షలు

మాక్స్ 7-సీటర్

రూ.12.55 లక్షలు

రూ.13.85 లక్షలు

+ రూ. 1.3 లక్షలు

వారి మాన్యువల్ కౌంటర్‌పార్ట్‌లతో పోలిస్తే, కొనుగోలుదారులు ఆటోమేటిక్ వేరియంట్‌ల కోసం అదనంగా రూ. 1.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. SUV యొక్క 7-సీటర్ ప్లస్ వేరియంట్ కోసం సిట్రోయెన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను అందించడం లేదని గమనించడం ముఖ్యం.

ఇంకా తనిఖీ చేయండి: సిట్రోయెన్ eC3 కొత్త అగ్ర శ్రేణి షైన్ వేరియంట్‌తో మరిన్ని ఫీచర్లను పొందండి.

అదే టర్బో-పెట్రోల్ ఇంజన్

సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (110 PS / 190 Nm) ద్వారా శక్తిని పొందుతుంది, ఇది ఇప్పుడు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ రెండింటి ఎంపికలను పొందుతుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కోసం టార్క్ అవుట్‌పుట్ 205 Nm వరకు పెరుగుతుంది, ఇది C3 ఎయిర్‌క్రాస్ యొక్క మాన్యువల్ వెర్షన్ కంటే 15 Nm ఎక్కువ.

ఇంకా తనిఖీ చేయండి: 2024 హ్యుందాయ్ క్రెటా vs స్కోడా కుషాక్ vs వోక్స్వాగన్ టైగూన్ vs హోండా ఎలివేట్ vs MG ఆస్టర్ vs సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్: స్పెసిఫికేషన్ పోలిక

ఫీచర్ జాబితాకు మార్పులు లేవు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయంతో SUV ఫీచర్ లిస్ట్‌లో సిట్రోయెన్ ఎలాంటి మార్పులు చేయలేదు. C3 ఎయిర్‌క్రాస్- వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు మాన్యువల్ AC వంటి ఫీచర్లను కలిగి ఉంది.

భద్రత విషయంలో, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి అంశాలను కలిగి ఉంది.

ధర పరిధి ప్రత్యర్థులు

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ధరలు ఇప్పుడు రూ. 9.99 లక్షల నుండి రూ. 13.85 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా). ఇది హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్ వంటి వాటితో గట్టి పోటీని ఇస్తుంది.

మరింత చదవండి : C3 ఎయిర్‌క్రాస్ ఆన్ రోడ్ ధర

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 247 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన సిట్రోయెన్ సి3 Aircross

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర