Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నవీకరించబడిన కియా సెల్టోస్ؚ ఈ కొత్త స్టైలింగ్ ఎలిమెంట్ؚలతో రానుంది

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 10, 2023 11:03 am ప్రచురించబడింది

నవీకరించబడిన ఈ SUVలో, మహీంద్రా స్కార్పియో N మరియు MG హెక్టార్లో ఉన్నట్లుగా డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లను పొందింది

  • భారీగా కప్పబడి ఉన్నట్లుగా కనిపించే మరొక టెస్ట్ మోడల్ SUV ఇటీవల కనిపించింది.

  • రెండు వైపులా ఉన్న ప్రత్యేక ఎగ్జాస్ట్ టిప్ؚల కారణంగా ఇది టర్బో వేరియెంట్ కావచ్చు అని భావిస్తున్నాము.

  • సమాచారం, ఆహ్లాదం కోసం కొత్త డిస్ప్లేను కలిగిన కొత్త డ్యాష్ؚబోర్డ్ డిజైన్ؚతో క్యాబిన్ వస్తుంది.

  • కొత్త ఫీచర్‌లలో పనోరామిక్ సన్ؚరూఫ్ మరియు ADAS ఉన్నాయి.

  • ప్రస్తుత మోడల్ؚలో ఉన్న విధంగానే 115PS పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లను పొందనుంది; కొత్త వెర్నా 1.5-లీటర్ టర్బో కూడా అందించబడుతుంది.

  • ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభం అవుతాయని అంచనా.

ఇప్పటికే నవీకరించబడిన కియా సెల్టోస్ రహస్య చిత్రాలు మరియు వీడియోలు తగినన్ని ఉన్నపటికి, భారీగా కప్పబడి ఉన్న ఈ SUV మరొక రహస్య వీడియో ఇప్పుడు ముందుకు వచ్చింది.

తాజా పరిశీలనలు

మహీంద్రా స్కార్పియో N, MG హెక్టార్‌లలో ఉన్నట్లుగా నవీకరించబడిన సెల్టోస్ డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లతో వస్తుందని తాజా వీడియో ధృవీకరిస్తుంది. వెల్లడైన మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ టెస్ట్ వాహనంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ (ప్రతి సైడ్ ఒకొక్కటి) అమర్చబడి ఉన్నాయి, ఇది బహుశా SUV టర్బో వేరియెంట్ కావచ్చని ఇవి సూచిస్తున్నాయి.

ఇంటీరియర్‌లో మార్పులు

ఈ వీడియోలో నవీకరించబడిన క్యాబిన్ కనిపించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నవీకరించబడిన మోడల్ؚకు ఇది సారూప్యంగా ఉండవచ్చు. కియా ఇందులో రీడిజైన్ చేసిన డ్యాష్ؚబోర్డ్ؚను అందించవచ్చు. నాజూకైన సెంట్రల్ AC వెంట్ؚలు మరియు డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేలు ఉండవచ్చు. నవీకరించబడిన సెల్టోస్ؚలో పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్‌లు వంటి కొత్త ఫీచర్‌లను ఆశించవచ్చు.

SUV భద్రత నెట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) ఉండగా, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) బహుశా ఉండవచ్చు. డ్రైవర్-అసిస్టెన్స్ స్యూట్ؚలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు ఆరవ-జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలో ఉండే లేన్ కీపింగ్ అసిస్ట్ ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: ధర రూ.17 లక్షల వద్ద ప్రారంభమయ్యే మరొక లగ్జరీ వేరియెంట్‌ను పొందిన కియా కేరెన్స్

బొనేట్ క్రింద ఏవైనా మార్పులు ఉన్నాయా?

కియా సెల్టోస్ ప్రస్తుత మోడల్ؚలో ఉన్న విధంగానే 115PS పవర్, 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లను అందిస్తుందని ఆశిస్తున్నాము. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్‌ MT మరియు CVT ఎంపికలతో వస్తుండగా, డీజిల్ ఇంజన్ మాన్యువల్‌కు బదులుగా 6-స్పీడ్‌ iMTతో రావచ్చు, 6-స్పీడ్‌ AT ఎంపికను కొనసాగిస్తుంది. 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚకు బదులుగా, నవీకరించబడిన సెల్టోస్ కొత్త వెర్నాలో ఉన్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను (160PS/253Nm), 6-స్పీడ్‌ iMT లేదా 7-స్పీడ్‌ DCTతో జోడించవచ్చు.

ఇది ఎప్పుడు వస్తుందని ఆశించవచ్చు?

కొత్త సెల్టోస్‌ను కియా 2023 మధ్య కాలంలో విడుదల చేస్తుందని అంచనా. దీని ప్రారంభ ధర సుమారుగా రూ.10 లక్షలు ఉండవచ్చు (ఎక్స్-షోరూమ్). ఇది MG ఆస్టర్, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్ మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో పోటీ పడుతుంది.

చిత్రం మూలం

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 29 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన కియా సెల్తోస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర