• English
  • Login / Register

రూ.17 లక్షల ప్రారంభ ధరతో, మరొక లగ్జరీ వేరియెంట్ֶను అందిస్తున్న కియా కేరెన్స్

కియా కేరెన్స్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 07, 2023 04:25 pm ప్రచురించబడింది

  • 46 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త లగ్జరీ (O) వేరియెంట్ లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియెంట్ؚల మధ్య స్థానంలో నిలుస్తుంది

Kia Carens

  • ఇది కేవలం ఏడు సీట్‌ల లేఅవుట్ؚతో వస్తుంది. 

  • పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ రెండిటితో వస్తుంది, కానీ కేవలం ఆటో ట్రాన్స్ؚమిషన్ؚలు మాత్రమే ఉంటాయి. 

  • లగ్జరీ వేరియెంట్‌తో పోలిస్తే, ఇది సింగిల్-పేన్ సన్ؚరూఫ్ మరియు డ్రైవ్ మోడ్ ఆంబియంట్ లైటింగ్ؚను పొందింది. 

  • ధర రూ.17 లక్షల నుండి రూ.17.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 

లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియెంట్ؚల మధ్య స్థానంలో నిలిచే, సరికొత్త వేరియెంట్ؚ అయిన కేరెన్స్ MPVను కియా పరిచయం చేసింది. ప్రస్తుతం లగ్జరీ (O) వేరియెంట్‌ను ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందిస్తున్నారు, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ రెండిటితో వస్తుంది, కానీ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక ఉండదు. 

ధర

Kia Carens Front

వేరియెంట్ 

లగ్జరీ (O)

లగ్జరీ ప్లస్

తేడా

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT - 7 సీటర్

రూ. 17 లక్షలు

రూ.18.45 లక్షలు

- రూ. 1.45 లక్షలు

1.5-లీటర్ డీజిల్ AT - 7 సీటర్

రూ. 17.70 లక్షలు

రూ. 18.80 లక్షలు

- రూ. 1.10 లక్షలు

* అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు  

టాప్-స్పెక్ లగ్జరీ ప్లస్ వేరియెంట్‌తో పోలిస్తే లగ్జరీ (O) వేరియెంట్ గణనీయంగా మరింత చవకైనది. దీని టర్బో-పెట్రోల్ వేరియెంట్ ధర రూ.1.45 లక్షలు, డీజిల్ వేరియెంట్ ధర రూ.1.10 లక్షలు తక్కువగా ఉంది. 

పవర్ؚట్రెయిన్

Kia Carens Engine

ఈ కొత్త వేరియెంట్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందింది: 7-స్పీడ్‌ల DCTతో (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ మిషన్) జోడించబడిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160PS మరియు 253Nm) మరియు 6-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడిన 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (116PS మరియు 250Nm). ఈ శ్రేణిలో  ఇంజన్‌లు 6-స్పీడ్‌ల iMTని పొందాయి, కానీ ఈ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక కొత్త వేరియెంట్ؚలో అందుబాటులో లేదు. 

ఇది కూడా చదవండి: 2023 EV6 కోసం ఏప్రిల్ 15తేదీన బుకింగ్ؚలను ప్రారంభించనున్న కియా 

కేరెన్స్ యొక్క దిగువ శ్రేణి వేరియెంట్‌లు కూడా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను(115PS మరియు 144Nm) పొందాయి, ఇది కేవలం 6-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే జోడించబడింది. ఈ మూడు MPV ఇంజన్‌లు BS6 ఫేజ్ II నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. 

ఫీచర్‌లు & భద్రత

Kia Carens Cabin

లగ్జరీ (O) వేరియెంట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, మూడ్ లైటింగ్‌తో అనుసంధానించిన బహుళ డ్రైవ్ మోడ్‌లను పొందింది మరియు లగ్జరీ వేరియెంట్‌లో అందుబాటులో లేని LED క్యాబిన్ ల్యాంప్‌లను కూడా పొందింది. ఈ వేరియెంట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్ؚస్జ్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నాలుగు-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, 64-రంగుల ఆంబియెంట్ లైటింగ్ మరియు DRLలతో LED హెడ్ ల్యాంప్ؚలు వంటి ఫీచర్‌లతో వస్తుంది. అయితే, వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, వైర్ లెస్ ఛార్జర్ మరియు బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు లగ్జరీ (O) వేరియెంట్‌లో అందించడం లేదు, ఇవి కేవలం టాప్-స్పెక్ లగ్జరీ ప్లస్ వేరియెంట్ؚలో మాత్రమే ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: ఎటువంటి ఆర్భాటం లేకుండా విడుదల కానున్న నవీకరించబడిన కియా సోనెట్: 2024లో భారతదేశంలో విడుదల కానుంది

భద్రత విషయానికి వస్తే, కేరెన్స్ అన్ని వేరియెంట్ؚలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్ؚలు మరియు ప్రయాణీకులందరికి మూడు-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలతో సహా ఒకే విధమైన ఫీచర్‌లను అందిస్తున్నారు. 

పోటీదారులు

Kia Carens Rear

దీని పరిమాణం మరియు రూ.10.45 లక్షల నుండి రూ.18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే ధర పరిధితో ఇది మారుతి ఎర్టిగా, XL6, టయోటా ఇన్నోవా హైక్రాస్ మరియు ఇన్నోవా క్రిస్టా లోని కొన్ని వేరియెంట్‌లతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: కేరెన్స్ డీజిల్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Kia కేరెన్స్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience