Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హ్యుందాయ్ ఎక్స్టర్ వేరియెంట్-వారీ ఇంజన్-గేర్ బాక్స్ ఎంపికల వివరాలు

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా మే 14, 2023 03:35 pm సవరించబడింది

హ్యుందాయ్ అందిస్తున్న కేవలం పెట్రోల్ వెర్షన్ కొత్త ఎంట్రీ-లెవెల్ SUV ఆఫరింగ్, ఎక్స్టర్ మరియు దీని బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి

  • రూ.11,000 ముందస్తు ధరతో హ్యుందాయ్ ఎక్స్టర్ SUV బుకింగ్ؚలను ప్రారంభించింది.
  • ఎక్స్టర్‌ను ఐదు విస్తృతమైన వేరియెంట్ؚలలో అందిస్తున్నారు: EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్.
  • MT మరియు AMT ఎంపికలు రెండిటితో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందనుంది.
  • ఐచ్ఛిక CNG కిట్ؚను కూడా కలిగి ఉంది.
  • AMT మిడ్-స్పెక్ మరియు హయ్యర్ వేరియెంట్ؚలలో మాత్రమే అందిస్తున్నారు.
  • ఐచ్ఛిక CNG కిట్ కేవలం మిడ్-స్పెక్ S మరియు SX వేరియెంట్ؚలలో మాత్రమే అందిస్తున్నారు.
  • సన్ؚరూఫ్, ఆటో AC మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్‌లతో వస్తుందని ఆశించవచ్చు.
  • ధరలు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

ఇటీవల అధికారికంగా అందిన చిత్రాల ద్వారా హ్యుందాయ్ ఎక్స్టర్ అసలైన మొదటి లుక్ؚను వీక్షించాము, ఈ కారు తయారీదారు దీని బుకింగ్ؚలను రూ.11,000కు ప్రారంభించారు. అదే సమయంలో, హ్యుందాయ్ ఈ మైక్రో SUV యొక్క అనేక వివరాలను వెల్లడించింది, వీటిలో దీని వేరియెంట్ؚలు, ఇంజన్-గేర్ బాక్స్ కాంబో మరియు దీని రంగు ఎంపికల వంటి వివరాలు ఉన్నాయి.

వేరియెంట్-వారీ ఇంజన్-గేర్ؚబాక్స్ ఎంపికలు

పవర్ؚట్రెయిన్

EX

EX (O)

S

S (O)

SX

SX (O)

SX (O) కనెక్ట్

1.2-లీటర్ MT

ఉంది

ఉంది

ఉంది

ఉంది

ఉంది

ఉంది

ఉంది

1.2-లీటర్ AMT

లేదు

లేదు

ఉంది

లేదు

ఉంది

ఉంది

ఉంది

1.2-లీటర్ CNG MT

లేదు

లేదు

ఉంది

లేదు

ఉంది

లేదు

లేదు

వేరియెంట్ లైన్అప్ అంతటా పెట్రోల్-MT కాంబో అందించబడుతుంది, AMT ఎంపికను కేవలం మిడ్-స్పెక్ S మరియు హయ్యర్-స్పెక్ SX, SX (O) మరియు SX (O) కనెక్ట్ వేరియెంట్ؚల కోసం మాత్రమే రిజర్వ్ చేయాలని హ్యుందాయ్ నిర్ణయించింది. చెప్పాలంటే, CNG కిట్ కేవలం మిడ్-స్పెక్ S మరియు SX వేరియెంట్ؚలలో, మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚకు మాత్రమే పరిమితమైంది.

ఇది కూడా చూడండి: చార్జింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ క్రెటా EV టెస్ట్ మోడల్

అందిస్తున్న పవర్ؚట్రెయిన్

ఎక్స్టర్, 5-స్పీడ్‌ల MT మరియు AMT ఎంపికలు రెండిటితో గ్రాండ్ i10 నియోస్ 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ (83PS/114Nm)తో వస్తుందని హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మైక్రో SUV అదే ఇంజన్ؚను CNG కిట్‌తో పొందుతుంది, ఇది 69PS/95Nm పవర్‌ను అందిస్తుంది, మధ్య పరిమాణ హ్యాచ్ؚబ్యాక్ؚలో చూసినట్లు 5-స్పీడ్‌ల MTతో జోడించబడుతుంది.

డిజైన్ మరియు ఎక్విప్మెంట్ వివరాలు

హ్యుందాయ్ కొత్త ఎంట్రీ-లెవెల్ SUV ఆఫరింగ్, ఎక్స్టర్, దృఢమైన రూపంతో వస్తుంది మరియు చంకీ వీల్ ఆర్చ్ؚల కారణంగా బాక్సీ లుక్‌ను కలిగి ఉంది, బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రెయిల్స్ వలన ప్రత్యేకమైన బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇతర ఆసక్తికర ఎక్స్ؚటీరియర్ ఫీచర్‌లలో H-ఆకారపు LED DRLలు మరియు టెయిల్ؚలైట్ؚలలో ఎలిమెంట్ؚలు, భారీ స్కిడ్ ప్లేట్‌లు, ప్రొజెక్టర్ హెడ్ؚలైట్ؚలకు క్రోమ్ సరౌండ్ కూడా ఉన్నాయి.

ఎక్స్టర్ ఫీచర్‌ల జాబితాని హ్యుందాయ్ ప్రస్తుతానికి వెల్లడించకపోయిన, ఇది సింగిల్-పేన్ సన్ؚరూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, గ్రాండ్ i10 నియోస్ కంటే పెద్ద టచ్ؚస్క్రీన్ యూనిట్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ؚతో వస్తుందని అంచనా. భద్రత విషయనికి వస్తే, ఇది నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందవచ్చు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు రివర్సింగ్ కెమెరా ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌లు

ఆవిష్కరణ తేదీ

ధరలు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు, ఎక్స్టర్ అమ్మకాలు జూన్ؚలో ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నాము. ఇది టాటా పంచ్, సిట్రోయెన్ C3 మరియు మారుతి ఫ్రాంక్స్, రెనాల్ట్ కైగర్ మరియు నిసాన్ మాగ్నైట్ؚలతో పోటీ పడనుంది.

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 17 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ ఎక్స్టర్

S
sanjeev desai
May 19, 2023, 1:24:10 PM

Which colour options are available for exter

S
shiv
May 18, 2023, 7:57:42 AM

Want to buy

J
jalal
May 14, 2023, 1:11:29 PM

Launch date and mileage

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర