5 చిత్రాలలో New Kia Sonet బేస్-స్పెక్ HTE వేరియంట్ వివరాలు వెల్లడి
కియా సోనేట్ కోసం rohit ద్వారా జనవరి 22, 2024 01:14 pm ప్రచురించబడింది
- 521 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇది బేస్-స్పెక్ వేరియంట్ కావడంతో, ఇందులో కియా మ్యూజిక్ లేదా ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్‌ను అందించడంలేదు.
-
2024 కియా సోనెట్ కారు యొక్క ఎక్స్టీరియర్ హైలైట్స్ లో హాలోజెన్ హెడ్లైట్స్ మరియు కవర్లతో ఉన్న 15-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి.
-
ఇందులో మాన్యువల్ AC, ఫ్రంట్ పవర్ విండోస్, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లు ఉన్నాయి.
-
ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు లభిస్తాయి.
-
సోనెట్ HTE వేరియంట్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.9.79 లక్షల మధ్యలో ఉంది.
ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ ఇటీవల భారతదేశంలో విడుదల అయింది. దీని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లో అనేక మార్పులు చేయడంతో పాటు అనేక కొత్త ఫీచర్లను జోడించారు. అయితే, దీని వేరియంట్ లైనప్ మునుపటి మాదిరిగానే ఉంది. సబ్-4m SUV ఏడు వేరియంట్లలో లభిస్తుంది: : HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్. మా వద్ద బేస్-స్పెక్ HTE వేరియంట్ యొక్క కొన్ని చిత్రాలు ఉన్నాయి, వాటిని మీరు క్రింద చూడవచ్చు:
ఎక్స్టీరియర్
ఎంట్రీ లెవల్ వేరియంట్ అయినప్పటికీ, సోనెట్ HTE వేరియంట్ రీడిజైన్ చేయబడిన గ్రిల్ తో అందించబడతుంది, కానీ దీనికి పియానో బ్లాక్ ఫినిషింగ్ లభించదు. సోనెట్ HTE వేరియంట్ ముందు భాగంలో DRLలు లేనప్పటికీ ఇందులో హాలోజెన్ హెడ్లైట్లు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ లో సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉంది, ఇది పవర్ఫుల్గా కనిపిస్తుంది.
దీని 15-అంగుళాల స్టీల్ వీల్స్ (కవర్ తో) మరియు ఫ్రంట్ ఫెండర్ మౌంటెడ్ టర్న్ ఇండికేటర్లను సైడ్ నుండి చూసినప్పుడు ఇవి బేస్ వేరియంట్ ను మరింత హైలైట్ చేస్తాయి. సోనెట్ HTEలో కనెక్టెడ్ హాలోజెన్ టెయిల్లైట్లు ఉన్నాయి, సెంటర్ లైటింగ్ ఉండదు.
ఇంటీరియర్ మరియు ఎక్విప్మెంట్
2024 కియా సోనెట్ HTE వేరియంట్ ఇంటీరియర్లో ఆల్-బ్లాక్ కలర్ థీమ్ మరియు ఫ్యాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీ లభిస్తుంది. క్యాబిన్ లోపల ప్రీమియంగా కనిపించడానికి సెంట్రల్ కన్సోల్ చుట్టూ మరియు స్టీరింగ్ వీల్ పై కూడా సిల్వర్ ఫినిషింగ్ చేయబడింది.
కియా సోనెట్ SUV బేస్ వేరియంట్ లో ఇన్ఫోటైన్‌మెంట్ లేదా మ్యూజిక్ సిస్టమ్ లభించవు. కాని ఇందులో రేర్ వెంట్స్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ACతో సెంట్రల్ లాకింగ్ వంటి బేసిక్ ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: చిత్రాల ద్వారా ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ HTK వేరియంట్ వివరాలు వెల్లడి
ఇంజన్ ఎంపికలు
సోనెట్ యొక్క బేస్-స్పెక్ HTE వేరియంట్ రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది: 5-స్పీడ్ MTతో జతచేయబడిన 83 PS/ 115 Nm 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ (N/A) పెట్రోల్ ఇంజన్ లేదా 5-స్పీడ్ MTతో జతచేయబడిన 116 PS/ 250 Nm 1.5-లీటర్ డీజిల్ ఇంజన్.
టాప్ డీజల్ వేరియంట్లలో 6-స్పీడ్ iMT (క్లచ్ పెడల్స్ లేకుండా మాన్యువల్) మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మరింత పనితీరును కోరుకునే వారికి, సోనెట్ 120 PS/ 172 Nm 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో కూడా పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్) ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభిస్తుంది.
ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు
కియా సోనెట్ HTE వేరియంట్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.9.79 లక్షల మధ్యలో ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.15.69 లక్షలుగా ఉంది. కియా యొక్క సబ్-4m SUV మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ సబ్-4m క్రాసోవర్ SUVలకు గట్టి పోటీ ఇస్తుంది.
ఎక్స్-షోరూమ్ ప్యాన్-ఇండియా అన్ని ధరలు
మరింత చదవండి: సోనెట్ ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful