Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కార్దెకో మాటల్లో: 2024 లో విడుదల కానున్న Maruti eVX

మారుతి ఈవిఎక్స్ కోసం sonny ద్వారా డిసెంబర్ 09, 2023 08:30 pm ప్రచురించబడింది

2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన eVX వాస్తవానికి 2025 నాటికి రావాల్సి ఉంది.

  • ఇది భారతదేశంలో మారుతి యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు.

  • మారుతి eVX కు సంబంధించిన పలు స్పై షాట్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి.

  • దీనికి 550 కిలోమీటర్ల పరిధి గల 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడుతుంది.

  • డ్యూయల్ మోటార్ సెటప్ తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ ను కూడా అందించనున్నారు.

  • ముందు మరియు వెనుక భాగంలో 3-పీస్ LED లైటింగ్ సెటప్ మరియు స్ట్రాంగ్ వీల్ ఆర్చ్లు ఉంటాయి.

  • క్యాబిన్ లో ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సెటప్ మరియు పవర్డ్ డ్రైవర్ సీటు ఉంటుంది.

  • దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్)

టాటా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అగ్ర స్థానంలో ఉంది. ఈ పోటీలో మారుతి చేరనుంది. మారుతి యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్ పో 2023 లో eVX కాన్సెప్ట్ గా ఆవిష్కరించారు. ఇది 2025 లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు 2024 లో ప్రారంభించడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

ఎందుకు త్వరగా విడుదల చేస్తున్నారు?

మారుతి eVX భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది పూర్తిగా కవర్ చేయబడినప్పటికీ, ఇది దాదాపు ఉత్పత్తి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లో విడుదల చేయడానికి మరొక కారణం ఏమిటంటే, సాధారణంగా మారుతి కొత్త కార్ల విడుదల టెస్ట్ చేసిన అదే సంవత్సరంలో ఉంటుంది. eVX ను గుజరాత్ లోని కంపెనీ కొత్త ప్లాంట్ లో తయారు చేస్తామని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని మారుతి వెల్లడించడం జరిగింది.

రెండవది, సుజుకి eVX SUV కాన్సెప్ట్ యొక్క మరింత అభివృద్ధి చెందిన వెర్షన్ ను జపాన్ లో ఆవిష్కరించారు, దీని ఎక్స్టీరియర్ మరింత రియలిస్టిక్ డిజైన్ లో ఉంది.

మూడవది, ఇటీవల టయోటా యొక్క కొత్త అర్బన్ SUV ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించారు, ఇది సుజుకి eVX ను పోలి ఉంటుంది. ముఖ్యంగా దాని సైడ్ ప్రొఫైల్ మరియు రేర్ ప్రొఫైల్ ను పోలి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్-స్పెక్ మోడల్ 2024 ప్రథమార్ధంలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానుంది. టయోటా మరియు సుజుకి యొక్క గ్లోబల్ భాగస్వామ్యం యొక్క మరొక భాగస్వామ్య మోడల్ ఇది.

eVX 2023 ప్రారంభంలో భారతదేశంలో గ్లోబల్ అరంగేట్రం చేసినందున, టయోటా వెర్షన్ కంటే ముందే మారుతి యొక్క ఎలక్ట్రిక్ SUVని మార్కెట్లో విడుదల చేయవచ్చని చెప్పవచ్చు.

ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు

ఇప్పటివరకు, మారుతి eVX యొక్క సాంకేతిక స్పెసిఫికేషన్ కు సంబంధించిన కొంత సమాచారం మాత్రమే బహిర్గతమైంది. కాన్సెప్ట్ ఫారాన్ని ఆవిష్కరించేటప్పుడు, ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుకు 550 కిలోమీటర్ల పరిధితో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడుతుందని ఈ సమాచారంలో వెల్లడైంది. దీని పనితీరు గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ దీనికి డ్యూయల్ మోటార్ సెటప్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ఇవ్వబడుతుందని చెప్పవచ్చు. ఇందులో ఒకే పవర్ట్రెయిన్ ఎంపిక ఉండటమే కాక, టయోటా-స్పెక్ వెర్షన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ సెటప్తో వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉంటాయి.

ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఎలా ఉంటుంది?

సుజుకి eVX ఎక్స్టీరియర్ లో సొగసైన LED హెడ్ లైట్లు, త్రిభుజాకారంలో DRLలు, చుంకీ బంపర్లు ఉంటాయి. ఇతర ఎక్ట్సీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ లో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ సెటప్ ఉంటాయి.

eVX లో సింపుల్ క్యాబిన్ ఉంటుంది. గేర్ ఎంపిక కోసం ఇంటిగ్రేటెడ్ డిస్ ప్లే సెటప్, యోక్ స్టైల్ స్టీరింగ్ వీల్, లాంగ్ వర్టికల్ AC వెంట్స్ మరియు సెంటర్ కన్సోల్ లో రోటరీ నాబ్స్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంజిన్ మరియు ఇంధన సామర్థ్య గణాంకాలు వివరించబడ్డాయి (జపాన్-స్పెక్)

ఆశించిన ఫీచర్లు

eVX లో డ్యూయల్ డిస్ప్లే సెటప్, స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పాటు 360 డిగ్రీల కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. భద్రత పరంగా, మారుతి ఎలక్ట్రిక్ ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు మరియు సురక్షితమైన హైవే డ్రైవింగ్ కోసం అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంటాయని భావిస్తున్నారు.

ధరలు మరియు ప్రత్యర్థులు

మారుతి eVX ఎలక్ట్రిక్ కారు ధర రూ. 22 లక్షల నుండి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నాము. ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు రాబోయే టాటా కర్వ్ EV వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. టాటా నెక్సాన్ EV మరియు మహీంద్రా XUV400 EVల కంటే ప్రీమియం ఎంపికగా దీన్ని అందించనున్నారు.

s
ద్వారా ప్రచురించబడినది

sonny

  • 216 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి ఈవిఎక్స్

Read Full News

explore మరిన్ని on మారుతి ఈవిఎక్స్

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.49 - 19.49 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.40 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర