Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

వెయ్రోన్ తదుపరి కారుకి బుగట్టి చిరోన్ అనే అధికారిక నామకరణం జరిగింది!

డిసెంబర్ 02, 2015 05:08 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 16 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

బుగట్టి వారు ఇప్పటికే చిరోన్ కోసం 100 కంటే ఎక్కువ ఆర్డర్లను అందుకున్నారని సంస్థ తెలిపింది మరియు ఈ వాహనం 2016 జెనీవా మోటార్ షోలో ప్రపంచ ప్రదర్శన చేయనున్నది.

బుగట్టి అధికారికంగా వెయ్రోన్ యొక్క తదుపరి వాహనాన్ని  ప్రకటించింది మరియు ఈ వాహనానికి చిరోన్ అని నామకరణం చేయడం జరిగింది. ఫ్రెంచ్ వాహన తయారీసంస్థ 86 వ జెనీవా మోటార్ షోలో కొత్త హైపర్ కారు యొక్క ప్రపంచ ప్రదర్శన చేస్తుంది.  బుగట్టి వారు ఎంచుకున్న వినియోగదారులకు ఈ వాహనన్ని ప్రదర్శించిందని తెలిపింది మరియు వినియోగదారుల నుండి చిరోన్ ఒక అద్భుతమైన కారుగా అభిప్రాయాన్ని తీసుకొన్నట్లు తెలిపింది.  
 
"చిరోన్ కోసం అభివృద్ధి గురించి చెప్పినట్లైతే ఒక వ్యాక్యం లోనే చెప్పవచ్చు మరియు అలా చెప్పినట్లయితే బహుశా ఆటోమొబైల్ చరిత్రలోనే చాలా చిన్నది అవుతుంది. మేము ఉత్తమంగా ఉన్నదానిని మరింత అద్భుతమైనదిగా చేయాలని చూస్తున్నాము." అని  బుగట్టి ఆటోమొబైల్స్ S.A.S అధ్యక్షుడు వోల్ఫ్గ్యాంగ్ దుర్హీమర్ తెలిపారు.

"చిరోన్ ప్రతి విషయంలో కొత్త ప్రమాణాలు తీసుకొస్తుంది. మేము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన, అత్యంత విలాసవంతమైన మరియు అత్యంత ప్రత్యేకమైన ఉత్పత్తి సూపర్ స్పోర్ట్స్ కారులను ఉత్పత్తి చేయడాన్ని కొనసాగిస్తాము." అని బుగట్టి సంస్థ మరియు  దాని వినియోగదారులు తెలిపారు.  

Molsheim ఆధారిత వాహనతయారి సంస్థ,  ప్రస్తుతం చిరోన్ పరీక్షలో చివరి దశలో ఉందని తెలిపింది. ఈ టెస్ట్ మ్యూల్స్ వివిధ రహదారి మరియు వాతావరణ పరిస్థితులలో జరుగుతున్నాయి. చిరోన్ పేరు కి  అర్ధం తెలిస్తే ఆశ్చర్య పడాల్సిందే, దీనికి పేరు 1920 మరియు 1930 లో బ్రాండ్ కోసం దాదాపు అన్ని ప్రధాన గ్రాండ్స్ ప్రిక్స్ ని గెలుచుకున్న లూయిస్ చిరోన్ అనే లెజెండరీ రేసింగ్ డ్రైవర్ కి గుర్తుగా ఈ పేరుని కారుకు పెట్టడం జరిగింది.  

లూయిస్ చిరోన్, మేము మా బ్రాండ్ చరిత్రలో కొత్త వాహనానికి అత్యుత్తమమైన రేసింగ్ డ్రైవర్ పేరుని పెట్టడం జరిగింది. ఈనాటి యొక్క ఉత్తమ సూపర్ స్పోర్ట్స్ కారు కోసం అత్యంత విజయవంతమైన బుగట్టి డ్రైవర్ పేరుని ఆదర్శంగా తీసుకున్నాము. అని దుర్హిమర్  కొనసాగింపుగా తెలిపారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience