#2015FrankfurtMotorShow ఐఐఎ లో చాలా అద్భుతమైన కార్లు: బుగట్టి విజన్ గ్రాన్ టురిస్మో మరియు హ్యుండాయి ఎన్ 2025
బుగట్టి వెయ్రోన్ కోసం manish ద్వారా సెప్టెంబర్ 21, 2015 04:47 pm సవరించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఐఐఎ ఎల్లప్పుడూ ఆటోమోటివ్ ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్కరి కొరకు ఉంచబడినది. ఆటో షో ఎల్లప్పుడూ మన ముందుకు ప్రత్యేఖ ప్రదర్శనతో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద తేడా ఏమీ లేకుండా ఎప్పటి వలే ప్రత్యేఖ ప్రదర్శనను అందిస్తుంది. 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో మహత్తర మరియు ఉత్తమమైన రెండు ప్రత్యేఖ కార్ల లక్షణాలను ప్రదర్శిస్తుందని భావిస్తున్నాము.
బుగట్టి గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్:
బుగాటి ఫ్రెంచ్ వాహనతయారీ సంస్థ భవిష్యత్తులో ఉత్పత్తి చేసే కార్లు యొక్క భావనను తీసుకొచ్చింది. బుగాటి యొక్క అధిపతి అయినటువంటి వోల్ఫ్గ్యాంగ్ డర్హైమర్ మాట్లాడుతూ " బుగాటి వెయ్రోన్ అధ్యాయం యొక్క విజయాన్ని పూర్తిచేసిన తరువాత బుగట్టి విజన్ గ్రాన్ టురిస్మో కొత్త ప్రయాణంలో మొదటి దశలో ఉంది." అని తెలిపారు.
20 మరియు 30 నుండి బుగట్టి రేసింగ్ కార్లు, డిజైన్ స్ఫూర్తి కోసం పునాదిగా వ్యవహరించాయి. బుగట్టి 1937 మరియు 39 లో లేమాన్స్ రేసులు గెలిచింది మరియు విజన్ గ్రాన్ టురిస్మో పొడవైన, నేరుగా ఉన్న విభాగాలు మరియు కారు యొక్క వేగం వంటి అంశాలలో మించిపొయేందుకు రూపొందించబడినది.
హ్యుందాయ్ ఎన్ 2025 విజన్ గ్రాన్ టురిస్మో:
కొరియన్ వాహనతయారీదారుడు 872 హార్సెస్ సమర్ధ్యంగల ప్రత్యేఖ భావనతో వస్తున్నాడు. శక్తి హైడ్రోజన్ ఇంధన సెల్ వ్యవస్థ తో 4 వీల్ మోటార్ జత చేయబడి శక్తి అందించబడుతుంది.
డిజైన్ లక్షణాల గురించి హ్యుండాయి సంస్థ మాట్లాడుతూ" ఇది ఏరోనాటిక్స్ మరియు 'మురోక్ డ్రై లేక్' అనే టెస్టింగ్ గ్రౌండ్ నుండి ప్రేరణ పొందింది." అని తెలిపింది.
హ్యుండాయి ఎన్ బ్రాండ్ ప్రారంభం గురించి ఊరిస్తుంది మరియు ఇది అధిక పనితీరు గలిగిన కార్ల వైపుగా ఉంటుంది. హ్యుండాయి వారు తమ 'ఎన్ బ్రాండ్' ని మెర్సిడీస్ ఎ ఎంజి మరియు బి ఎండబ్లు ఎం డివిజన్ వంటి వాటిలా అధిక పనితీరు కలిగిన విధంగా రూపొందిస్తుంది.
ఇటువంటి కార్లను కొనలేని వారు గ్రాన్ టురిస్మో 6 వీడియో గేం లో ఈ కారు యొక్క అనుభవాన్ని పొందవచ్చు.