బిఎండబ్ల్యూ 6 సిరీస్ అయిన గ్రాన్ కూపే ను రూ 1.15 కోట్ల వద్ద ప్రవేశపెట్టారు.
published on మే 30, 2015 04:08 pm by sourabh for బిఎండబ్ల్యూ 6 సిరీస్
- 14 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈ బిఎండబ్ల్యూ 6 సిరీస్ ను భారతదేశం లో ఉన్న ధనికుల కోసం ప్రవేశపెట్టారు. ఈ బిఎండబ్ల్యూ 6 సిరీస్ గురించి చెప్పాలంటే, బిఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్, రెండు వేరియంట్లను ప్రవేశపెట్టింది. అవి వరుసగా రూ 1.15 కోట్ల వద్ద 640డి ఎమినెన్స్ మోడల్ ను మరియు రూ 1.22 కోట్ల వద్ద 640డి డిజైన్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ వేరియంట్లను ప్రవేశపెట్టారు. ఈ ప్రీమియం కూపే కూడా, ముందు అమ్మిన కూపే ల వలే సిబియూ విధానం ద్వారా ప్రవేశపెట్టబడుతున్నాయి. ఈ గ్రాన్ కూపే డీజిల్ ఇంజెన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ కూపే పది రంగు ఎంపికల షేడ్స్ తో మనకు అందుబాటులో ఉంది.
ఈ నవీకరించబడిన మోడల్ అనేక చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులతో మన ముందుకు వచ్చింది. అవి ఎమిటంటే, LED మల్టీ బీమ్ హెడ్ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్, న్యూ కిడ్నీ గ్రిల్, డార్క్ క్రోమ్ లో ఎగ్సాస్ట్ పైపు, పునఃరూపకల్పన చేయబడిన బంపర్ మరియు 19-అంగుళాల ఒక జత అల్లాయ్ చక్రాలు. అంతర్గత భాగాల విషయానికి వస్తే, యాంబియంట్ లైటింగ్ ను కలిగి, కొత్త స్పోర్ట్ లుక్స్ తో లెదర్ స్టీరింగ్ వీల్, హెడ్-అప్ డిస్ప్లే, ప్రామాణిక డకోటా మరియు బ్లాక్ అండ్ ఐవరీ వైట్ కలిగిన ప్రత్యేకమైన నప్ప లెథర్ అపోలిస్ట్రీ వంటి కాస్మెటిక్ మార్పులతో ఈ మోడల్ మనకు అందుబాటులో ఉంది.
హుడ్ క్రింది బాగానికి వస్తే, ముందు కూపే వలే ఏ మార్పులు లేకుండా అదే 3.0 లీటర్ ఇంజెన్ కొనసాగుతూ వచ్చింది. ఈ స్ట్రైట్ సిక్స్ డీజిల్ ఇంజెన్ అత్యధికంగా 313bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా 630Nm అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ బిఎండబ్ల్యూ 6 సిరీస్ మోడల్ 8-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజెన్ 0 నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 5.4 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు 250 kmph అత్యధిక వేగాన్ని చేరుకోగలవు.
- Renew BMW 6 Series Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful