చిన్న సమస్య కారణంగా బీఎండబ్ల్యూ 5-సీరీస్ ని ఉపసమ్హరించుకున్నారు
నవంబర్ 19, 2015 12:49 pm nabeel ద్వారా సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఉపసమ్హరణనల పరంపర కొనసాగుతోంది. ఈ వరుసలో ఇప్పుడు బీఎండబ్ల్యూ వారు 5-సీరీస్ సెడాన్ లకి ఉపసమ్హరణ పిలుపుని అందించారు. కారు సమర్ధత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ, ఈ లోపం చైల్డ్ సీటు యాంకర్ కి సంబంధించినది. ఇప్పటికి అయితే, ఉపసమ్హరణ కేవలం ఉత్తర అమెరికాలో 7,162 యూనిట్లకు గాను ఇచ్చారు. వీటిలో భాగంగా ఉన్న కార్లు, 528ఐ, 535డీ, 535ఐ, 550ఐ మరియూ ఎం5. భారతదేశంలో, కేవలం బీఎండబ్ల్యూ 530డీ ఇంకా ఎం5 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్ లో లోపం ఉన్నట్టుగా ఎటువంటి సమాచారం రాలేదు. ప్రభావం పొందినటువంటి మోడల్స్ లో వంగినటువంటి ఇన్‌బోర్డ్ దిగువ యాంకర్ ఒకటి ఎడమ రేర్ వైపున ఉండి, ఇది చైల్డ్ సీటుని పట్టుకుని ఉంటుంది. భీఎండబ్ల్యూ డీలర్స్ కి దీనిని డిసెంబర్ 24 నుండి ఉచితంగా సరిచేయమని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ వారం మొదట్లో, ఫోర్డ్ ఇండియా వారు 16,444 ఈకోస్పోర్ట్‌లను ఉపసమ్హరించుకున్నారు. ఇబ్బంది ఏమనగా, వాహనం యొక్క రేర్ ట్విస్ట్ బీం బోల్ట్ సరిగ్గా బిగించనటువంటి కారణంగా, పైవట్ బోల్ట్ విరిగి, డ్రైవరు పట్టు తప్పి కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ కారణంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించలేదు అని కంపెనీ వారు తెలిపారు.