Q2 వాహనాన్ని మరళా బహిర్గతం చేసిన ఆడీ సంస్థ
ఆడి క్యూ2 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 16, 2016 10:53 am సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ వాహనం 2017 లో దేశంలో పరిచయం చేయబడవచ్చు మరియు A3 వాహనం తో సమానంగా ధరను కలిగి ఉండవచ్చు
ఆడీ రాబోయే Q2 కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని మరళా టీజ్ చేసింది. సాంకేతికంగా, జర్మన్ ఆటో సంస్థ మొదటిసారి క్రాస్ఓవర్ టీజర్ చిత్రాలు విడుదల చేసింది, మునుపటి టీజర్ అసలైన వాహనంతో సంబంధం లేకుండా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది క్యూ 3 క్రింద ఉంటుంది. ఇది రాబోయే 2016 జెనీవా మోటార్ షోలో పబ్లిక్ ప్రదర్శన చేస్తుంది మరియు ఆన్లైన్ ప్రదర్శనకి ముందు బహిర్గతమయ్యింది. ఆడి క్యు 2 యూరోపియన్ మార్కెట్లో ఈ సంవత్సరం తర్వాత అమ్మకానికి వెళ్తుంది మరియు అది భారత మార్కెట్లో 2017 లో ఎక్కడో ప్రారంభించబడుతుందని ఆశిస్తున్నారు.
ఈ వాహనం యొక్క మొత్తం డిజైన్ ఆడీ యొక్క ఎస్యువి లైనప్ తో సమానంగా ఉంటుంది. దీని యొక్క టీజర్ లో ఎటువంటి వివరాలు బహిర్గతం చేయబడలేదు. కానీ ఈ రాబోయే కాంపాక్ట్ క్రాసోవర్ యొక్క హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ గురించి మాత్రం హింట్స్ ఇవ్వబడ్డాయి. టీజర్ చిత్రం LED డే టైం రన్నింగ్ లైట్లను ప్రదర్శించింది, ఇది మాట్రిక్స్ LED లతో ఫేస్లిఫ్ట్ A6 ని పోలి ఉంటుంది. ఇదేవిధంగా టెయిల్ ల్యాంప్స్ కి కూడా ఉండబోతుంది. అంతేకాక, ఇది రెండవ తరం Q7 మరియు ఫేస్లిఫ్ట్ Q3 లో చూసిన ఆడి యొక్క కొత్త సింగిల్ ఫ్రేం గ్రిల్, కలిగి ఉంటుంది.
ఇంజిన్ ఎంపికలు గురించి మాట్లాడుకుంటే ఈ వాహనం TDI తో పాటుగా TFSI టర్బోచార్జెడ్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. భారతదేశానికి సంబంధించినంతవరకూ ఈ వాహనం యొక్క ఎంట్రీ స్థాయి సెడాన్ A3 తో దాని ఇంజన్ ఎంపికలు భాగస్వామ్యం చేసుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ 1.8 లీటర్ 40 TFSI ని కలిగి ఉంటుందు, అయితే డీజిల్ ఇంజిన్ 2.0 లీటర్ 35 టీడీఐ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు పరంగా, ఇది 6-స్పీడ్ మరియు 7-స్పీడ్ ఎస్-ట్రానిక్ ఆటోమేటిక్ మరియు Q3 లాగా, Q2 యొక్క బేస్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే ఈ వాహనం ఆల్ వీల్ డ్రైవ్ తో అందించబడుతుంది మరియు ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్ తో ప్రమాణంగా అందించబడుతుందని ఊహిస్తున్నాము.