ఆడీ ఆరెస్6 మరియూ ఆరెస్7 కి సామర్ధ్యపు ఎడిషన్స్ రానున్నాయి
ఆడి ఆర్ కోసం manish ద్వారా అక్టోబర్ 26, 2015 04:01 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఆడీ ఆరెస్6 అవాంత్ మరియూ ఆరెస్7 లకి ట్విన్-టర్బోచర్జడ్ 4.0-లీటర్ V8 ఇంజిను ఉంటుంది. ఇది 650bhp శక్తిని ఇంకా 750Nm టార్క్ ని అందిస్తుంది. ఇంజినుకి 8-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ జత చేసి ఉంటుంది. అన్ని మార్పులు పర్ఫార్మన్స్ ఎడిషన్ ప్యాకేజీ కి చేయబడ్డాయి మరియూ వీటి కారణంగా మునుపటి ఆరెస్6 ఇంకా ఆరెస్7 లతో పోలిస్తే 45bhp శక్తి 50Nm టార్క్ లు అధికంగా విడుదల చేస్తుంది. పునరుద్దరించిన ఆగ్జలరేషన్ 0 నుండి 100 కిలోమీటర్లు కేవల 3.7 సెకనుల్లో వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. ఇది మునుపటి వేరియంట్స్ కంటే 0.2 సెకన్లు అధిక వేగంగా చేరుకుంటుంది. కారు యొక్క గరిష్ట వేగం గంటకి 280 కిలోమీటర్లు ఆరెస్6 కి మరియూ గంటకి 305 కిలోమీటర్లు ఆరెస్7 కి కలదు.
కారుకి అందిన బాహ్యపు పునరుద్దరణ జాబితాలో కొత్త అల్లోయ్ వీల్స్ ఉండి అస్కారీ మెటాలిక్ బ్లూ బాహ్యపు పెయింట్ ని కలిగి ఉంటుంది. ఆరెస్6 కి 285/30 R21 టైర్లు ఉండగా ఆరెస్6 కి 275/30 R21 టైర్లు జత చేసి ఉంటాయి. రెండు కార్లకి డైనమిక్ రైడ్ కంట్రోల్ స్టీరింగ్ ఉండి, ఇది కొత్త స్పోర్ట్స్ సస్పెస్న్షన్ తో జత చేయబడ్డా స్టీరింగ్ నిష్పత్తి ని ప్రభావితం చేస్తుంది. లోపల వైపు మ్యాట్ టైటానియం పూత వచ్చి మరియూ ఆడీ వారి క్వాట్రో లోగో ఎయిర్ డక్స్ట్స్ వద్ద అమర్చబడి ఉంటాయి. ఆరెస్6 ని యూఎస్ $ 132,442 (రూ. 85,90,850) మరియూ ఆరెస్7 ని యూఎస్ $ 141,066 (రూ. 91,54,541) ధరలకు అందుబాటులో ఉంటాయి.