2015 లో 3.14 % వృద్ది రేటు రికార్డును సాదించిన ఆడి అమ్మకాలు

జనవరి 13, 2016 04:49 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆడి సంస్థ భారతీయ మార్కెట్ లో 2015 వ సంవత్సరంలో 11,192 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. ఈ జర్మన్ ఆటో తయారీదారుడు యొక్క 2014 వ సంవత్సరం లో అమ్మకాలను చూసినట్లైతే, 10,201 యూనిట్లను విక్రయించింది దీనితో 2015 వ సంవత్సరంలో 3.14 % వృద్ది రేటును సాదించింది. అమ్మకాలు పరంగా ఈ వాహనం ప్రస్తుతం, జర్మన్ ఆటో తయారీదారులకు పోటీదారులు అయిన మెర్సిడెస్ బెంజ్ వాహనం తో పోటీ పడుతుంది. 2014 వ సంవత్సరం లో ఆడి సంస్థ లగ్జరీ కార్ల విభాగంలో అగ్ర స్థానాన్ని పొందింది. ప్రస్తుతం ఈ సమయంలో మెర్సిడెస్ ఈ స్థానాన్ని గెలిచి 32 % అద్బుతమైన అభివృద్దితో మంచి స్థానంలో నిలచింది. 

వాహన ఔత్సాహికులకు లగ్జరీ విభాగంలో ఆడి ప్రత్యేకమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ 2015 వ సంవత్సరం ఆడి సంస్థ కు ఒక వృద్ది సంవత్సరం గా మారింది మరియు మా వినియోగదారులకు ఉత్తమ లగ్జరీ కార్ల కొనుగోలు అనుభవాన్ని అందించడానికి వైపు మా లక్ష్యం కేంద్రీకరించాము అని ఆడి భారతదేశం యొక్క అధ్యక్షుడు అయిన జో కింగ్ అన్నారు.

2016 వ సంవత్సరంలో ఈ సంస్థ, పెరుగుదల గురించి ఆశావహంగా ఉంది మరియు అగ్ర స్థానాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తుంది. "మేము సాంకేతికంగా, ఆధునిక స్మార్ట్, చురుకైన మరియు సౌకర్యవంతమైన కొత్త ఉత్పత్తులను తీసుకురావడం వైపు అంకితభావంతో ఉన్నాము. అంతేకాకుండా, మేము 2016 వ సంవత్సరం లో మా పెరుగుదల మార్గం కొనసాగుతుందని చాలా నమ్మకంగా ఉన్నాము అని" మిస్టర్ కింగ్ అన్నారు. 
ఈ సంస్థ యొక్క కార్ల తయారీదారుడు, ఆర్8 ఎల్ ఎం ఎక్స్ మరియు టిటి కూపే  వాహనాలతో పాటు మొత్తం 10 ఉత్పత్తులను ప్రారంబించాడు. ఇవే కాక, ఆడి సంస్థ ఎస్5 స్పోర్ట్ బేక్ మరియు కొత్త క్యూ 7  వాహనాలను ప్రవేశపెట్టింది. ఆటో మొబైల్ ప్రియుల కోసం 2016 ఆటో ఎక్స్పో వద్ద   ఆడి సంస్థ, మూడు కార్ల క్రమంతో వస్తుందని భావిస్తున్నారు. వీటన్నింటితో పాటు సంస్థ, గతంలో 2015 జెనీవా మోటర్ షోలో ఆవిషకరించిన ఆడి ఆర్8 వాహనం గురించి ఎక్కువ మాట్లాడారు. 

ఇది కూడా చదవండి:
ఆడి 2016 ఆటో ఎక్స్పోలో మూడు కార్లను ప్రదర్శించబోతోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience