ఆడి 2016 ఆటో ఎక్స్పోలో మూడు కార్లను ప్రదర్శించబోతోంది.

జనవరి 04, 2016 05:23 pm saad ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ;

భారతదేశం 2016 సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారం లో రాబోయే ఆటో ఎక్స్పో ని గ్రాండ్ ఈవెంట్ గా జరపడానికి సిద్దంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వాహన సంస్థలు అన్నీ తమ ఉత్పత్తులని అనగా SUV లు,బడ్జెట్ హాచ్బాక్ లు , లగ్జరీ వాహనాలని ఈ నాలుగురోజుల ఈవెంట్ లో ప్రదర్శించబోతున్నారు. ప్రముఖ వాహన తయారీదారులు అయినటువంటి జర్మన్ లు ఎప్పుడూకూడా వారి యొక్క ఆడంబరమైన ఉత్పత్తులు అనగా' ఆడి' ని ఈ ఈవెంట్ లో ఖచ్చితంగా ప్రదర్శిస్తారు. విజయవంతం అయిన 2015 తర్వాత ఆడిఇండియా రాబోయే రోజుల్లో దాని తదుపరి ఉత్పత్తుల కార్ల జాబితాని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భవిష్యత్తులో ప్రదర్శింపబోయే నమూనాలు సిద్దంగా ఉన్నాయి. 2016 లో ఆడి భారత ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబోయే నమూనాలు చూద్దాం పదండి.

కొత్త ఆడి R8 యొక్క వివరాలు;

జాబితా లో ఉన్నటువంటి నవీకరించబడిన మొదటి సూపర్ కారు ఆడి R8.రెండవ తరం R8 ఇప్పుడు స్పోర్టీయార్ గా,ఎజిలర్ గా ,రోడ్ల పైన భాద్యతాయుతంగా నడుస్తోంది. టాప్ ఎండ్ V10 మోడల్ స్ట్రాంగ్ డైనమిజం కి ఉదాహరణగా చెప్పుకుంటారు. ఇవి బలమయిన రేసు ట్రాక్ చక్రాలు తో నిర్మించబడతాయి. విఘ్నాలు లేని రోడ్ నిర్వహణా సామర్ద్యాన్ని క్వాట్రో AWD సెటప్ సహాయంతో సాధించవచ్చు. ఈ కారు తన సగం భాగాలని R8 LMS, రేసింగ్ స్పెక్ వెర్షన్ తో భాగస్వామ్యం చేసుకుంటుంది. దీని యొక్క వర్చువల్ కాక్పిట్,స్టీరింగ్ వీల్ కలిగినటువంటి LeMans. 20 మౌంట్ బటన్ల ని కలిగి ఉండబోతోంది.

ఇంజిన్: దీని ఇంజిన్ 5.2 లీటర్ V10 నమూనా ని కలిగి ఉంటుంది.

పనితీరు; దీని యొక్క ఇంజిన్ 517.6HP శక్తిని , 530Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఆడి ఏ 8 ఎల్ సెక్యూరిటీ;

కొత్త ఆడి ఏ 8 ఎల్ సెక్యూరిటీ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2015 లో ప్రదర్శించారు. మరియు భారతదేశం లో రాబోయే ఆటోఎక్స్పో లో తొలిసారిగా ప్రదర్శించబోతోంది. ఈ కారు A8 L సెడాన్ యొక్క ఆర్మార్డ్ వెర్షన్. ఇది మునుపటి VR7 స్థాయి నుండి VR9 స్థాయి కి నవీకరించబడింది. మరియు మరింత నిర్మాణ దారుడ్యాన్ని, భద్రతా సౌకర్యాలతో రాబోతోంది.

ఈ కారు యొక్క బరువు తేలికగా ఉంటుంది. ఎందుకంటే తయారీలో ప్రత్యేకమయిన అల్యూమినియం ని ఉపయోగించారు. మరియు ఈ కారు పేలుడు కి వ్యతిరేఖంగా జరిపిన పరీక్షలో విజయవంతం అయింది. కొత్త ఆడి ఏ 8 ఎల్ సెక్యూరిటీ కూడా తొలి సాయుధ లగ్జరీ సెడాన్ గా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మరియు అధిక భద్రతా ప్రమాణాలు తో రూపొందించబడి రాబోతోంది. దీని ప్రతి యూనిట్ యొక్క తయారీ Neckarsulm plant మరియు top-secret ఫ్యాక్టరీ యొక్క సహాయ సహకారాలతో ఆడీ యొక్క పూర్తి పర్యవేక్షణలో జరిగింది.

ఇంజిన్: ఇది 4.0 లీటరు V8 లేదా 6.3 లీటర్ FSI w12 పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది.

పనితీరు; దీని యొక్క 4.0 లీటరు పెట్రోల్ ఇంజిన్ 435HPశక్తిని , మరియు 600Nm టార్క్ ని మరియు 6.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 500HP శక్తిని, మరియు 625Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ప్రోలోగ్ కాన్సెప్ట్ ;

ఈ కాన్సెప్ట్ ని షాంఘై ఆటో షోలో ప్రదర్శించారు. ఈ ప్రోలోగ్ కాన్సెప్ట్ భవిష్యత్తు లో ఆడి ఎలా ఉండబోతోందో తెలియజేస్తుంది. దీని యొక్క డిజైన్, డైనమిక్స్ మరియు స్పోర్టీ స్ఫూర్తి తో హై-ఎండ్ టెక్నాలజి ని చేర్చడం జరిగింది. అయిదు డోర్ల నమూనా ని చేర్చటం ద్వారా ఆడి కుటుంభం లో ఇది ప్రత్యేకతను సాధించింది. ఈ వాహనం క్వాట్రో పర్మినెంట్ ఆల్ డ్రైవ్ సిస్టమ్ ని కలిగి, తేలికయిన దేజిను ని కలిగి ఉంది. ఈ వాహనం లో ఇంకొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే డ్రైవర్ మరియు ఇతర ప్రయాణీకులు మధ్య డిజిటల్ సమాచార వ్యవస్థ ఉంటుంది.

ఇంజిన్: దీని ఇంజిన్ ప్లగిన్-హైబ్రిడ్ రకానికి చెందినది.

పనితీరు; దీని ఇంజిన్ 734 HP శక్తిని, మరియు 900 Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇది కుడా చదవండి ;

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience