మొదటిసారిగా రహస్యంగా కనిపించిన ఆడీ క్యు1
ఆడి క్యూ1 కోసం akshit ద్వారా జూలై 22, 2015 03:50 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: టెస్ట్ పరుగులు చేస్తున్న సమయంలో యూరోప్ లో మొదటి సారి ఆడి క్యూ1 రహస్యంగా కనిపించింది.
విస్త్రుతమైన ప్రచ్ఛన్నత ధరించి ఉన్నప్పటికీ, పరీక్ష ద్వారా అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఏ1 వలే క్యు 1 అధిక స్వారీ వెర్షన్ కాదని చూపిస్తుంది. ఇది క్యు3 ధోరణి ని అనుసరిస్తుంది మరియు Q లైనప్ నుండి ప్రేరణ పొందుతుంది. దీని ముందరి భాగం ఒకే విధమైన బంపర్ డిజైన్ తో క్యు7 ని పోలి ఉంది. హెడ్లైట్లు అయితే ప్రస్తుతం ఏ నమూనాలలో లేనటువంటివిగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఈ ఎస్ యువి వోక్స్వ్యాగన్ గ్రూప్ యొక్క ఎం క్యూబి ప్లాట్ఫార్మ్ మీద రూపొందించబడినది. ఆడీ దాని క్యు-బ్యాడ్జి కల ఉత్పత్తి ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో వచ్చిందే ఈ క్యు1.
క్యు1 కోసం ఏర్పాటు చేయబడిన ఈ పవర్ ప్లాంట్లన్నీ ఏ1 నుండి తీసుకోబడినవి. దీని ప్రవేశ స్థాయి వేరియంట్లు 94బి హెచ్ పి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతున్నాయి. అయితే, అధికంగా 123బి హెచ్ పి 1.4 లీటర్ టి ఎఫ్ ఎస్ ఐ పెట్రోల్ పరిధి వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటూ 114 బి హెచ్ పి 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందించింది మరియు ఏ1 వంటి, వాల్యూమ్ తో ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికీ క్యు1 గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయిన ఈ మోడల్ ఇంగోల్స్టాడ్ లో రూపొంచబడి తదుపరి సంవత్సరం జెనీవా మోటార్ షో లో ప్రదర్శించబడనున్నదని అంచనా. ప్రవేశ స్థాయి మోడళ్లకి ఉన్న స్పందన బట్టి, ఆడీ కి దేశంలో ఉన్న అరుదైన పేరుని బట్టి రాబోయే క్యు1 పోటీ ప్రపంచంలో రాణిస్తుందని ఊహిస్తున్నాము.