• English
  • Login / Register

ఆస్టన్ మార్టిన్ వెల్లడి చేయబోతున్న రెహ్బర్గర్ వాన్టేజ్ జిటిఇ ఆర్ట్ కార్

ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ 2011-2019 కోసం అభిజీత్ ద్వారా జూన్ 09, 2015 03:10 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: ఆస్టన్ మార్టిన్ యొక్క రేసింగ్ కారును టోబియాస్ రెహ్బర్గర్ అనే కళాకారుడు డిజైన్ చేశాడు.  గల్ఫ్  97 లో, ఈ కళాకారుడిచే వాన్టేజ్ జిటిఈ అనే కారు డిజైన్ చేయబడింది. కళాకారుడు రెహ్బర్గర్ తన నైరూప్య కళ మరియు కంటి అవగాహన వక్రీకరించే ఆప్టికల్ ఎఫెక్ట్స్ లో ప్రఖ్యాతి చెందినవాడు అని చెప్పవచ్చు. ఈ సంస్థ వారు ఈ కళాకారుడికి ముందుగా చెప్పిన విషయం ఏమిటంటే, మునుపెన్నడూ చూడనటువంటి రేసింగ్ కారును నువ్వు డిజైన్ చెయ్యాలి అని కళాకారుడితో సంస్థ వారు చెప్పారు. వాన్టేజ్ జిటిఈ కారు యొక్క లైన్లు మరియు రంగులు ఎలా ఉన్నాయంటే, ఎటువంటి అతుకులు లేకుండా చూడటానికి ఒకే విధంగా, చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశాడు.

వెల్లడి చేయబోతున్న ఆస్టిన్ మార్టిన్ కారు గురించి జర్మన్ కళాకారుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. "ఆస్టన్ మార్టిన్ కారు యొక్క డిజైన్, నాకు డిజైన్ పై ఉండే ఆసక్తి పాతుకుపోయి ఉండటం వలన నేను ఈ కారు ను డిజైన్ చేయగలిగాను అని వ్యాఖ్యానించారు. నేను ఎలాంటివి డిజైన్ చేస్తాను అంటే, నమూనాలు కదులుతున్నట్టుగా, ఆప్టికల్ ఎఫెక్ట్స్, డిజైన్లలో ఏదో దాగి ఉన్నట్టుగా ఉండటం మరియు విజువల్ కంఫ్యూజన్ వంటి సంబంధిత దృగ్విషయాల్ని నేను ముందు పలు రచనల్లో చేశాను అని చెప్పసాగారు. ఈ కారు యొక్క డిజైన్ ను, ఒక రేఖాగణిత ఆప్టికల్ ప్రభావం నమూనా ఆధారంగా రూపొందించారు. ఈ నమూనా యొక్క ఒక పాయింట్ మీద, స్థిరంగా చూడటం అసాధ్యం అని చెప్పారు."ఈ ఆర్ట్ వర్క్ ను ఒక గొప్ప ఆర్ట్ వర్క్ కళాకారుడైన రెహ్బర్గర్ చిత్రీకరించారు, ఈయనకి చిరకాల అబిమాని అయిన ఆస్టన్ మార్టిన్ "రెహ్బర్గర్ వాన్టేజ్ జిటిఇ ఆర్ట్ కారు "యొక్క యజమాని దీనిని డిజైన్ చేయవలసిందిగా రెహ్బర్గర్ ని కోరారు. అతను ఆస్టన్ మార్టిన్ యొక్క వాన్టేజ్ రోడ్ కార్ ఆధారంగా అత్యంత శ్రద్దతో ఈ రేసు కారు రూపాన్ని రూపొందించాడు. మరియు ఇది చూడటానికి ఆసక్తి కలిగే విధంగా దీనిని తయారుచేశారు.  

97 వాన్టేజ్ జిటిఇ ఆర్ట్ కార్ ని ఈ వారాంతంలో లే మాన్స్ రేస్ లో పాల్గొనబోయే 24 గంటల ముందు దీనిని బహిర్గతం చేయాలని నిర్ణయించారు. దీని గురించి ఈ కారు యొక్క సారథి అయిన డారెన్ టర్నర్ మాట్లాడుతూ, "వ్యక్తిగతంగా, నా అభిప్రాయం ప్రకారం ఆర్ట్ కార్లు చాలా అద్భుతంగా ఉంటాయి "అని వ్యాఖ్యానించారు. "ఈ రూపకల్పన నిజంగా ముందు వచ్చిన కార్ల హద్దులను నెట్టివేసేలా ఉంది అని అన్నారు. మరియు ఈ రేస్ కారు లో వాడిన ప్రత్యేక రంగులు ఒక చాలెంజ్ కి కావలసిన రూపాన్ని ఇచ్చారని, అందుకే  నేను దీనిని ప్రేమిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

was this article helpful ?

Write your Comment on Aston Martin వాన్టేజ్ 2011-2019

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience