ఆల్టో 800 ఓనం లిమిటెడ్ ఎడిషన్ ని మారుతీ వారు విడుదల చేశారు
మారుతి ఆల్టో 800 2016-2019 కోసం nabeel ద్వారా ఆగష్టు 18, 2015 11:51 am ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫోక్స్వాగెన్ తరువాత, మారుతీ వారు కూడా పండగ కాలం కారణంగా ఆల్టో 800 తో ముందుకు వచ్చింది. విడుదల అయిన ఓనం లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో 800 వివిధ సెగ్మెంట్లలో 3,000 కార్లని ఒక్క రోజులో అమ్మింది. మారుతీ వారి అధికారిక ప్రకటణ ఆధారంగా, ఈ 3,000 కార్లలో, 1,000 కార్లు ఆల్టో 800 అమ్మకాలే ఉన్నాయి. ఈ కార్ల డెలివరీ మళయాలం వారి చిగం నెల మొదటి రోజు సందర్భంగా చేస్తారు.
మారుతీ సుజూకీ యొక్క దక్షిణ ప్రదేశానికి కమర్షియల్ మరియూ బిజినెస్ హెడ్ అయిన రాం సురేష్ ఆకెళ్ళ గారు మాట్లాడుతూ, " కేరళ మారుతీ కి ముఖ్యమైఅన మార్కెట్ మరియూ ఆల్టో 800 ఇక్కడ అత్యధికంగా అమ్ముడవుతుంది," అన్నారు.
" మేము 15 కొత్త పరికరాలను అఒనం సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధరకి అందిస్తున్నాము. ఈ ఓనం ఎడిషన్ ఆల్టో 800 మా కస్టమర్లను ఆనంద పరుస్తుంది అని నమ్మకంగా ఉన్నాము," అని ప్రసంగాన్ని కొనసాగించారు. అఒనం ఎడిషన్ ఆల్టో 800 కి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, స్పీకర్స్ తో మ్యూజిక్ సిస్టం, పవర్ కారు చార్జర్, అఒనం గ్రాఫిక్స్ మరియూ డీకాల్స్, ఎంబ్రాయిడర్డ్ కుషన్స్, డిజైనర్ సీట్ కవర్స్ మరియూ ఇతరత్రా 15 అధిక పరికరాలు అమర్చబడి వస్తోంది.
ఈ ప్యాకేజీ రూ.17,350 కి 26 శాతం తక్కువ ధరకి అందించడం జరుగుతోంది.
దేశం లో అధికంగా అమ్ముడుపోయే కారుల్లో మారుతీ ఆల్టో 800 ఒకటి. ఇన్ని లక్షణాలు ఇంత తక్కువ ధరకి ఈ పండుగ కాలం లో అందించడం వలన దీని అమ్మకాలు మరింతగా పెరిగుతాయి. క్రితం వారం ఫోక్స్వాగెన్ కూడా ఈ పండుగ కాలం స్కీము పోలొ మరియూ వెంటో ని మంచి ఆఫర్లతో అందించింది.