Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హ్యుందాయ్ వెర్నా గురించి మీకు తెలియని 4 విషయాలు

హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం khan mohd. ద్వారా మే 20, 2019 12:40 pm ప్రచురించబడింది

కోరియన్ ఆటో తయారీ సంస్థ మన దేశంలో వెర్నా ని 2017 లో రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకి ప్రారంభించింది. హ్యుందాయ్ దాని కార్ల మీద మంచి అద్భుతమైన మరియు హుందాగా ఉండే లక్షణాలను అందించడంలో ప్రసిద్ధి చెందింది, అటువంటి లక్షణాలలో ఎక్కువ భాగం విభాగంలో మొదటి లక్షణాలుగా ఉండడం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విశేషం. అదే ధోరణిని కొనసాగిస్తూ, 2017 వెర్నా మనకి కావలసినన్ని లక్షణాలను కలిగి ఉంది, మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు. అయితే, కొత్త వెర్నా గురించి తక్కువ తెలిసిన కొన్ని వాస్తవాల గురించి మాట్లాడుకుందాము. ఈ కొరియన్ సెడాన్ గురించి మీకు తెలియని టాప్ 4 విషయాలు గురించి తెలుసుకుందాము.

అదే కారు విభిన్నమైన పేర్లు

రష్యా స్పెక్ హ్యుందాయ్ సోలారిస్

భారతదేశంలో మనకు తెలిసిన హ్యుందాయ్ వెర్నా ప్రపంచ మార్కెట్ లో వేర్వేరు పేర్లను కలిగి ఉంది. ఉదాహరణకు, రష్యాలో హ్యుందాయ్ సోలారిస్ మరియు USA, ఉత్తర అమెరికా మరియు చైనా మార్కెట్లలో ఆక్సెంట్ గా దీనిని పిలుస్తారు.

ప్లాట్‌ఫార్మ్ కజిన్స్

మేము అయితే ఈ విషయం ఖచ్చితంగా మీకు తెలియదని పందెం కడుతున్నాము. అది ఏమిటంటే కొత్త వెర్నా దాని యొక్క ప్లాట్‌ఫార్మ్ ని తన యొక్క బాగా ఖరీదైన బందువు హ్యుందాయి ఎలంట్రా తో పంచుకుంటుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క అతి బలంగా ఉండే మెటల్ ఏరోనాటిక్స్-గ్రేడ్ స్ట్రక్చరల్ ని 40 చోట్ల వాడుతుంది, దాని వలన కారు యొక్క బాడీ తేలికగా ఉన్నా గట్టిగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఒకప్పుడు ఇది విభాగాన్ని శాసించింది

మనందరికీ తెలుసు హోండా సిటీ మిడ్ సైజ్ సెడాన్ విభాగాన్ని 2000 లో మధ్య భాగం నుండి చివరి భాగం వరకూ శాసించిందని. హ్యుందాయ్ వెర్నా ఆవిష్కరణ ఈ వాస్తవాన్ని గొప్ప మార్జిన్ తో అయితే మార్చలేదు, కానీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలు బాగా పెరగడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఈ సమయంలో, ఆటో పరిశ్రమలో ఒక నమూనా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. చాలా మంది కారు కొనుగోలుదారులు డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపారు, ఎందుకంటే డీజిల్ ధరలు చాలా తక్కువ ఉండడం వలన. దీని వలన హోండా సిటీ అమ్మకాలు కొంచెం తగ్గుదలను చూసాయి, ఎందుకంటే ఆ సమయంలో ఒక పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే ఇది లభ్యమవ్వడం వలన.

హోండా యొక్క ఈ లోపం వలన హ్యుందాయ్ లాభం పొందింది వెర్నాలో శక్తివంతమైన ఇంజన్ ని అమర్చి మంచి ఫలితాన్ని అందించిందని చెప్పవచ్చు. త్వరలోనే, వెర్నా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన సెడాన్ గా అయింది. ఇది హోండా సిటీ కంటే కూడా ఆ నెలలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ విక్రయించబడింది. దీని యొక్క ఆధిపత్యం అనేది మారుతి సుజుకి సియాజ్ ను నేష‌నల్ ఇంజిన్ తో (ఫియట్-ఆధారిత 1.3-లీటరు DDiS ఇంజిన్) ప్రారంభించేంతవరకూ నడిచింది. ఆ రోజుల్లో, సియాజ్ మరియు సిటీ లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉండేవని చెప్పవచ్చు. కానీ ఈ 2017 వెర్నా పరిచయంతో మళ్ళీ ఆ లీడర్ బోర్డ్ ఫలితాలు మారేలా కనిపిస్తుంది.

సేల్స్ గణాంకాలు

నవంబర్ 2006 లో వెర్నా పేరును ప్రారంభించినప్పటినుండి, హ్యుందాయ్ వెర్నా ఎల్లప్పుడూ మంచిదిగా ప్రదర్శించబడింది. గత కొన్ని సంవత్సరాలుగా మినహాయిస్తే వెర్నా ఆ విభాగన్ని శాసించడమో లేదా రెండవ స్థానంలో నిలవడమో జరిగింది. మొత్తంమీద, హ్యుందాయ్ సంస్థ భారత్ లోనీ వెర్నా ని 3.18 లక్షల యూనిట్లు విక్రయించింది మరియు ప్రపంచవ్యాప్తంగా 8.8 మిలియన్ల యూనిట్లు విక్రయించింది.

2017 వెర్నాతో, హ్యుందాయ్ ఒక మెట్టుకి పైగా పోటీని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది.

Read More on : Verna Automatic

k
ద్వారా ప్రచురించబడినది

khan mohd.

  • 21 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర