2025 Kia Carens Clavis ఇంధన సామర్థ్య గణాంకాలు వెల్లడి
కియా కారెన్స్ క్లావిస్ మూడు ఇంజిన్ ఎంపికతో అందించబడుతుంది మరియు డీజిల్ స్పష్టంగా అన్నింటికంటే అత్యంత ఇంధన-సమర్థవంతమైనది
కియా కారెన్స్ క్లావిస్ ఇటీవలే వెల్లడైంది, దాని ధరలు మే 23న ప్రకటించబడతాయి. కార్ల తయారీదారు ఇప్పటికే కొత్త MPV యొక్క వేరియంట్ వారీగా ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను వెల్లడించారు. నేడు, కియా 2025 కారెన్స్ క్లావిస్ ఇంధన సామర్థ్య గణాంకాలను కూడా విడుదల చేసింది. దాని గురించి చర్చించే ముందు, MPVతో అందించబడే పవర్‌ట్రెయిన్ ఎంపికలను త్వరగా పరిశీలిద్దాం.
పవర్‌ట్రెయిన్ ఎంపికలు
కియా కారెన్స్ క్లావిస్ మూడు ఇంజిన్ ఎంపికతో వస్తుంది, వీటి స్పెసిఫికేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఇంజిన్ |
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
శక్తి |
115 PS |
160 PS |
116 PS |
టార్క్ |
144 Nm |
253 Nm |
250 Nm |
ట్రాన్స్మిషన్* |
6-స్పీడ్ MT |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT* |
6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT^ |
*DCT = డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, iMT = క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, AT = టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
కియా కారెన్స్ క్లావిస్: ఇంధన సామర్థ్యం
ఇంజిన్ |
ట్రాన్స్మిషన్ |
ఇంధన సామర్థ్యం |
1.5-లీటర్ NA పెట్రోల్ |
6-స్పీడ్ MT |
15.34 kmpl |
1.5-లీటర్ టర్బో పెట్రోల్ |
6-స్పీడ్ MT |
15.95 kmpl |
6-స్పీడ్ iMT |
15.95 kmpl |
|
7-స్పీడ్ DCT |
16.66 kmpl |
|
1.5-లీటర్ డీజిల్ |
6-స్పీడ్ MT |
19.54 kmpl |
6-స్పీడ్ AT |
17.50 kmpl |
- కారెన్స్ క్లావిస్ డీజిల్ మాన్యువల్ కలయిక అత్యంత ఇంధన-సమర్థవంతమైనది, తరువాత డీజిల్ ఆటోమేటిక్.
- పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు రెండూ వాటి మాన్యువల్ గేర్‌బాక్స్‌లతో దాదాపు ఒకేలాంటి మైలేజీని అందిస్తాయి.
- డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌తో కూడిన క్లావిస్ టర్బో-పెట్రోల్ మూడవ అత్యంత పొదుపైన ఎంపికగా పేర్కొనబడింది. ఇది 16.66 కి.మీ.లీ. తిరిగి ఇస్తుందని పేర్కొంది.
- సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన కియా కారెన్స్ క్లావిస్ ఈ కార్లలో అతి తక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఫీచర్లు
కియా కారెన్స్ క్లావిస్ అప్‌మార్కెట్ లేత గోధుమరంగు మరియు నేవీ బ్లూ- థీమ్ క్యాబిన్‌ను కలిగి ఉంది. దీని డాష్‌బోర్డ్ లేఅవుట్ సిరోస్ సబ్‌కాంపాక్ట్ SUVని పోలి ఉంటుంది, అదే స్టీరింగ్ వీల్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలతో ఉంటుంది. అంతేకాకుండా, ఇది 4-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మధ్య వరుస ప్రయాణీకుల కోసం సన్‌షేడ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలతో వస్తుంది.
భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు (ప్రామాణికంగా), 360-డిగ్రీల కెమెరా, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు వీల్స్ పై డిస్క్ బ్రేక్, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు మరియు లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అంశాలతో భద్రత నిర్దారిన్చబడుతుంది.
అంచనా ధర ప్రత్యర్థులు
2025 కియా కారెన్స్ క్లావిస్ ధరలు మే 23, 2025న అధికారికంగా వెల్లడి చేయబడతాయి. దీని ధరలు దాదాపు రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని మేము ఆశిస్తున్నాము. ఇది మారుతి XL6, మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ మరియు టయోటా రూమియన్‌లతో పోటీ పడుతుండగా మారుతి ఇన్విక్టో, టయోటా ఇన్నోవా హైక్రాస్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టాలకు సరసమైన ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది.
ఆటోమోటివ్ ప్రపంచం నుండి తక్షణ నవీకరణలను పొందడానికి కార్దెకో వాట్సాప్ ఛానెల్‌ని అనుసరించండి.