Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ప్రముఖ స్కోడా కంపెనీ నుండి 2024లో రానున్న కొడియాక్ కారు... వెల్లడైన ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు

స్కోడా కొడియాక్ 2024 కోసం rohit ద్వారా జూన్ 28, 2023 04:12 pm ప్రచురించబడింది

రెండవ తరం స్కోడా కొడియాక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

  • స్కోడా త్వరలో రెండవ తరం కొడియాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది.

  • పవర్‌ట్రెయిన్ ఎంపికలలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.

  • ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు AWD డ్రైవ్‌ట్రైన్‌లు రెండునూ అందించబడతాయి.

  • 100 కిలోమీటర్ల EV-ఓన్లీ రేంజ్‌తో తొలిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్ లభిస్తుంది.

  • 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకత కలిగి ఉంటాయి.

  • 2024లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది: ఇప్పటికే ఉన్న మోడల్ కంటే ఎక్కువ ప్రత్యేకతలను అందించనుంది.

స్కోడా కొడియాక్ త్వరలోనే దాని రెండవ తరం అవతార్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది మరియు కార్ల తయారీదారు ఇప్పటికే SUVకి సంబంధించిన కీలక వివరాలను విడుదల చేస్తున్నారు. తాజా అప్డేట్ కొత్త కొడియాక్ యొక్క పవర్‌ట్రెయిన్ వివరాలతో పాటు బోర్డులోని కొన్ని కీలక ఫీచర్లను వెల్లడిస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం.

పెట్రోల్, PHEV, డీజిల్ ఇంజన్ వేరియంట్లు

స్కోడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో గ్లోబల్-స్పెక్ కొడియాక్‌ను అందిస్తుంది, అలాగే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అందిస్తుంది. ఇందులోని కొన్ని స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి.

స్పెసిఫికేషన్లు

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్

2-లీటర్ టర్బో-పెట్రోల్

2-లీటర్ డీజిల్

2-లీటర్ డీజిల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్

పవర్

150PS

204PS

150PS

193PS

204PS

ట్రాన్స్‌మిషన్

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

6-స్పీడ్ DSG

డ్రైవర్‌ట్రెయిన్

FWD`

AWD

FWD

AWD

FWD

  • కొడియాక్‌ను తొలిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో అందించనున్నారు.

  • ఇది 25.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, ఇది ఎలక్ట్రిక్ పవర్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది మరియు 50 కిలోవాట్ల వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

  • స్కోడా ఇండియా డీజిల్ పవర్‌ట్రెయిన్‌లను తొలగించాలని నిర్ణయించినందున, అవి రెండవ తరం ఇండియా-స్పెక్ కొడియాక్‌లోకి వస్తాయని మాత్రం ఆశించవద్దు.

డిజైన్ యొక్క సంక్షిప్త అవలోకనం

రెండవ తరం స్కోడా కోడియాక్ యొక్క మరిన్ని చిత్రాలను పంచుకుంది, మనం చెప్పగలిగినదాన్ని బట్టి, కొత్త మోడల్ యొక్క రూపకల్పన పూర్తి మార్పు కంటే ఒక పరిణామం. ఈ SUVలో అదే సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రిల్ (కొంచెం పెద్దది అయినప్పటికీ), ఇంటిగ్రేటెడ్ LED DRL లతో కూడిన LED హెడ్ లైట్లు, మధ్యలో అమర్చిన ADAS రాడార్‌లో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి.

ప్రొఫైల్‌లో, పొడవైన వీల్‌బేస్ మరియు రిఫ్రెష్ చేసిన అల్లాయ్ వీల్స్ మినహా SUV ఇప్పటికే ఉన్న మోడల్‌ని పోలి ఉంటుంది. షార్ప్ LED టెయిల్ లైట్లు, రాక్డ్ విండ్‌షీల్డ్ మొదలగునవి వెనుక భాగంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణలు.

ఇది కూడా చదవండి: ప్రతి సంవత్సరం అధిక టోల్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి

దాని కొలతలను ఇక్కడ చూడండి:

కొలతలు

2024 స్కోడా కొడియాక్

పొడవు

4758మీమీ

వెడల్పు

1864మీమీ

ఎత్తు

1657మీమీ

వీల్‌బేస్

2791మీమీ

ఈ SUV ప్రస్తుత తరం మోడల్ కంటే 61 మిమీ పొడవు, మరియు 910 లీటర్ల లగేజీ సామర్థ్యం (ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి). ఇది 5, 7 సీటర్ లేఅవుట్‌లలో అందుబాటులోకి రానుంది.

ఇది ఏ సాంకేతిక ఫీచర్లను కలిగి ఉంటుంది?

స్కోడా కొత్త కొడియాక్ యొక్క మొత్తం ఫీచర్లను వెల్లడించనప్పటికీ, ఇది వెహికల్ బాడీ యొక్క ఫ్యాబ్రిక్ రూఫ్ లైనింగ్ లేదా సీలింగ్ యొక్క కొన్ని ఎక్విప్మెంట్ గురించి తెలియజేసింది. వీటిలో 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు రిమోట్ పార్కింగ్ అసిస్ట్ ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్లలో కూల్డ్, డ్యూయల్ ఫోన్ బాక్స్ రెండవ వరుసలో 15వాట్ వద్ద రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఒకేసారి ఛార్జ్ చేస్తుంది. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేల కోసం క్లీనర్‌ను కూడా కలిగి ఉంటుంది, గొడుగు మరియు ఐస్ స్క్రాపర్ ఇప్పుడు సుస్థిరమైన మెటీరియల్స్‌తో తయారు చేయబడతాయి.

ఇది కూడా చదవండి: 2023 ద్వితీయార్థంలో రానున్న 10 కార్లు ఇవే

భారతదేశంలో ప్రారంభం కానున్న వాహనాల వివరాలు

స్కోడా రెండవ తరం కొడియాక్‌ను ప్రస్తుత మోడల్ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.37.99 లక్షల నుండి రూ.41.39 లక్షల మధ్య) కంటే గణనీయమైన ధరలలో వచ్చే సంవత్సరం మనకు అందుబాటులోకి రావచ్చు. కొత్త స్కోడా కొడియాక్ MG గ్లోస్టర్, జీప్ మెరిడియన్ మరియు టయోటా ఫార్చ్యూనర్‌లతో పోటీ పడనుంది.

మరింత చదవండి : స్కోడా కొడియాక్ ఆటోమేటిక్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 161 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన స్కోడా కొడియాక్ 2024

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర