Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2020 హ్యుందాయ్ క్రెటా ఇండియా లాంచ్ మార్చి 17 న ధృవీకరించబడింది

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం dhruv attri ద్వారా ఫిబ్రవరి 14, 2020 12:10 pm ప్రచురించబడింది

ఇది పవర్‌ట్రెయిన్ ఎంపికలను కియా సెల్టోస్‌తో పంచుకుంటుంది

  • 2020 హ్యుందాయ్ క్రెటా కోసం ప్రీ-లాంచ్ బుకింగ్స్ కొన్ని వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నాము.
  • ఇది బ్లూలింక్ కనెక్ట్ కార్ టెక్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు LED ఇల్లూమినేషన్ వంటి లక్షణాలను పొందుతుంది.
  • ఇది BS6 పవర్ట్రెయిన్ ఎంపికల సమితిని కలిగి ఉంటుంది: 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్.
  • ధరలు రూ .10 లక్షల నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నాము; అలాగే ఇది కియా సెల్టోస్, MG హెక్టర్ మరియు టాటా హారియర్‌లకు ప్రత్యర్థి అవుతుంది.

ఆటో ఎక్స్‌పో 2020 లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆకర్షణలలో ఒకటి రెండవ తరం హ్యుందాయ్ క్రెటా. మీ గ్యారేజీలో ఇలాంటి కారు ఉండాలని కోరుకుంటే, మీ క్రెడిట్ చరిత్ర మరియు ఫినాన్షియల్ సెట్ చేసుకొని మార్చి 17 కి సిద్ధం కావచ్చు. రాబోయే వారాల్లో ప్రీ-లాంచ్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని మేము ఆశిస్తున్నాము.

2020 హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్ SUV యొక్క కొత్త తరం వెర్షన్, ఇది అర దశాబ్దానికి పైగా హృదయాలను సాశిస్తుంది. ఇది LED హెడ్‌ల్యాంప్స్‌తో చుట్టుముట్టబడిన క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌ తో బయట విలక్షణమైన మరియు బుచ్ డిజైన్‌ను పొందుతుంది. డ్యూయల్-టోన్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు స్క్వేర్డ్-అవుట్ వీల్ ఆర్చులతో మస్క్యులర్ షోల్డర్ లైన్ దాని బుచ్ వైఖరికి సహాయపడుతుంది. వెనుక భాగంలో ‘ప్రిడేటర్ ఫాంగ్ ఆకారంలో స్ప్లిట్ LED టైల్లైట్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ రెండవ-తరం క్రెటా యొక్క లోపలి భాగాన్ని ఇంకా వెల్లడించలేదు, కానీ ఆటో ఎక్స్‌పో 2020 లో ఒక ఓవర్‌వ్యూ తాజా లేఅవుట్‌ను వెళ్ళడించింది. చిత్రాలు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ (కియా సెల్టోస్ లాగా 10.25-ఇంచ్), ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు e-పార్కింగ్ బ్రేక్‌ను వెల్లడిస్తున్నాయి.

పనోరమిక్ సన్‌రూఫ్, బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఇతర లక్షణాలను కూడా ఆశిస్తున్నాము. ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, సెన్సార్‌లతో వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ద్వారా భద్రత పరంగా బాగుంటుంది.

2020 హ్యుందాయ్ క్రెటా ఇంజన్ విషయానికి వస్తే కియా సెల్టోస్ లో ఏవైతే ఉంటాయో అవే వీటిలో ఉంటాయి. కాబట్టి మీకు మూడు BS 6 కంప్లైంట్ పవర్‌ట్రైన్‌లు లభిస్తాయి: 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్‌ తో పాటు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ (తరువాతి దశలో లాంచ్) ఉన్నాయి. దిగువ స్పెసిఫికేషన్లను చూడండి:

ఇంజిన్

1.5-లీటర్ CRDI

1.5-లీటర్ VTVT

1.4-లీటర్ T-GDI

పవర్

115PS

115PS

140PS

టార్క్

250Nm

144Nm

242Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT/6-స్పీడ్ AT

6-స్పీడ్ MT/CVT

6-స్పీడ్ MT/7-స్పీడ్ DCT

కొత్త క్రెటా కోసం ప్రారంభ ధర సుమారు రూ .10 లక్షలు. ఇది MG హెక్టర్, నిస్సాన్ కిక్స్, టాటా హారియర్ మరియు కియా సెల్టోస్‌ లతో పోటీ పడుతుంది.

d
ద్వారా ప్రచురించబడినది

dhruv attri

  • 60 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర