• login / register

2020 హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ ఆటో ఎక్స్‌పో 2020 లో మా కంటపడింది

ప్రచురించబడుట పైన feb 08, 2020 11:06 am ద్వారా sonny for హ్యుందాయ్ క్రెటా

  • 31 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చైనా-స్పెక్ మోడల్‌తో పోలిస్తే ఇండియా-స్పెక్ సెకండ్-జెన్ క్రెటాకు ప్రత్యేకమైన క్యాబిన్ లేఅవుట్ లభిస్తుంది

  •  హ్యుందాయ్ ఎక్స్‌పోలో న్యూ-జెన్ క్రెటా యొక్క బాహ్య భాగాన్ని మాత్రమే ప్రదర్శించింది.
  •  క్యాబిన్ ని లాక్ చేసి ఉంచింది, మేము లోపలి భాగం యొక్క రీ-డిజైన్ చేసిన లేఅవుట్ ని రహస్యంగా చూశాము.  
  •  పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను పొందుతుంది (10.25-ఇంచ్ లాంటిది).
  •  కొత్త క్రెటా కొత్త BS 6 ఇంజన్లతో మార్చి 2020 లో ప్రారంభించబడనున్నది.  

2020 Hyundai Creta Interior Spied At Auto Expo 2020

నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ క్రెటా ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడింది. షోకేస్ లాక్ చేయబడిన డోర్స్ తో ఎక్స్‌టీరియర్ ని మాత్రమే చూపించగా, మేము 2020 క్రెటా యొక్క లోపలి భాగాన్ని చూడగలిగాము.

క్రొత్త క్రెటాలో సరికొత్త క్యాబిన్ లేఅవుట్ ఉంది, ఇది మేము చైనీస్ మరియు బ్రెజిలియన్ స్పెక్ ix-25, అలాగే కియా సెల్టోస్‌ లో చూసిన వాటికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది డాష్ మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది, బహుశా 10.25-ఇంచ్ యూనిట్ గా ఉండవచ్చు. సెంట్రల్ ఎయిర్ వెంట్స్ ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ఇరువైపులా కాకుండా దాని పైన ఉంచబడ్డాయి. కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ గ్లోబల్-స్పెక్ సోనాట ప్రీమియం సెడాన్ మాదిరిగానే ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. 

2020 Hyundai Creta Interior Spied At Auto Expo 2020

క్యాబిన్ డిజైన్ పరంగా, ఇది డోర్ ఇన్సర్ట్స్ మరియు డ్యూయల్-టోన్ సీట్ అప్హోల్స్టరీ పరంగా చైనా-స్పెక్ ix25 ను పోలి ఉంటుంది. డ్రైవర్-ఆధారిత సెంట్రల్ కన్సోల్ వాతావరణ కంట్రోల్స్ కోసం అప్‌డేట్ చేయబడిన లేఅవుట్ ని పొందుతుంది. మెయిన్ డిస్ప్లే లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం వరుస స్పర్శ బటన్లు ఉన్నాయి.  ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌ లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ సెలెక్టర్ కోసం కొత్త డిజైన్ కూడా ఉంది. 

2020 Hyundai Creta Interior Spied At Auto Expo 2020

కొత్త-తరం క్రెటా భారీగా రీ-డిజైన్ చేయబడింది, ముఖ్యంగా ముందు మరియు వెనుక. ఇది స్ప్లిట్ LED DRL లతో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు మరియు కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌ను పొందుతుంది. వెనుక భాగంలో బూట్ యొక్క వెడల్పు అంతటా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ తో స్ప్లిట్ టెయిల్ లాంప్స్ ఉన్నాయి.  హ్యుందాయ్ తన కాంపాక్ట్ SUV కి పనోరమిక్ సన్‌రూఫ్ మరియు బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీని కూడా జోడించింది.  

ఇది కియా సెల్టోస్ మాదిరిగానే ఇది BS 6 పవర్‌ట్రైన్ ఎంపికలతో పనిచేస్తుంది, అవి 1.5 లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. కొత్త హ్యుందాయ్ క్రెటా 2020 మార్చిలో కేవలం 10 లక్షల లోపు ప్రారంభ ధరతో లాంచ్ కానుంది, టాప్-స్పెక్ మోడల్ ధర రూ .17 లక్షలు. ఇది కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, టాటా హారియర్ మరియు MG హెక్టర్ వంటివాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.   

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా డీజిల్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

Read Full News
ఎక్కువ మొత్తంలో పొదుపు!!
% ! find best deals on used హ్యుందాయ్ cars వరకు సేవ్ చేయండి
వీక్షించండి ఉపయోగించిన <MODELNAME> లో {0}

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?