2019 మారుతి సుజుకి ఆల్టో: పాతది VS కొత్తది
మారుతి ఆల్టో 800 కోసం dinesh ద్వారా మే 15, 2019 12:42 pm ప్రచురించబడింది
- 81 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇటీవలే నవీకరించబడిన హ్యాచ్బ్యాక్ కొంచెం తేలికగా అలంకరించబడిన సౌందర్య లక్షణాలు, కొత్త ప్రామాణిక భద్రతా లక్షణాల సెట్ మరియు ఒక BS 6 పెట్రోల్ ఇంజన్ ని పొందుతుంది
- 2019 మోడల్ ముందులా ఆరు వేరియంట్లలో కాకుండా, ఇప్పుడు 5 వేరియంట్లలో Std,Std(O), LXI, LXI(O) మరియు VXI లలో లభ్యమవుతుంది.
- దీని ధర రూ.2.94 లక్షల నుంచి మొదలయ్యి రూ.3.71 లక్షల వరకూ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరను కలిగి ఉంటుంది.
- మునుపటి మోడల్ మీద రూ. 27,000 వరకు ప్రీమియంని ఆకర్షిస్తుంది.
- డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్, EBD తో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లను ప్రమాణంగా ముందులా కాకుండా కలిగి ఉంది.
- ఇది BS 6 ఇంజను పొందుతున్న మొదటి ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్.
మారుతి సుజుకి 2019 ఆల్టోని రూ. 2.94 లక్షల(ఎక్స్-షోరూం,డిల్లీ) ధరకే ప్రారంభించింది. ఇది స్టైలింగ్ మరియు అదనపు లక్షణాలను నవీకరించింది మాత్రమే కాకుండా, విభాగంలో-మొదటి BS 6 పెట్రోల్ ఇంజిన్ వంటి లక్షణాలను కలిగి ఉంది. కానీ ఇది పాత దాని నుండి ఎంత భిన్నంగా ఉంటుంది? పదండి కనుక్కుందాము.
పేరులో ఏముంది?
నవీకరించిన మోడల్ విడుదలతో, మారుతి హ్యాచ్బ్యాక్ పేరు నుంచి '800' ప్రత్యర్థిని తొలగించింది. ఇది ఇప్పుడు ఆల్టో అని పిలువబడుతుంది. ఇది హాచ్బ్యాక్ కేవలం 'ఆల్టో' అని పిలువబడడడం మొదటిసారి ఏమీ కాదు. వాస్తవానికి, దాని జీవిత చక్రంలో చాలా ఎక్కువ సార్లు ఇది 'ఆల్టో' అని పిలువబడింది. ఇది ద్వితీయ తరం మోడల్ పరిచయంతో 2012 తరువాత, హ్యాచ్బ్యాక్ 1.0-లీటరు ఇంజిన్ ఆధారిత దాని పెద్ద తోబుట్టువుల నుండి వేరు చేయడానికి '800' ప్రత్యయంను అందుకుంది.
ఇప్పుడు సురక్షితం!
2019 ఆల్టోలో అత్యంత ముఖ్యమైన నవీకరణ దాని యొక్క పెద్ద భద్రతా లక్షణాల జాబితా. ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బాగ్ (కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ Std (O), LXI (O)మరియు టాప్ స్పెక్స్ VXI వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది), EBD తో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్స్, అధిక వేగ హెచ్చరిక వ్యవస్థ అలాగే డ్రైవర్ మరియు కో -పాసెంజర్ సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి వాటిని కలిగి ఉంది. మునుపటి మోడల్ డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ తో మాత్రమే అందించబడింది, ఇది కూడా ఆప్ష్నల్ వేరియంట్లలో ఉంటుంది.
ఒక BS 6 ఇంజిన్ పొందిన మొదటి ఎంట్రీ-లెవల్ కార్
ఇక్కడ ఇది 2019 ఆల్టో అతిపెద్ద నవీకరణలను సిద్ధం చేసింది, ఇది ముందు కంటే మరింత పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. దాని యొక్క 800CC పెట్రోల్ ఇంజిన్ ప్రస్తుతం BS 6 ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంది, ఇది 2020 ఏప్రిల్ సంవత్సరం తరువాత గేం లోనికి వస్తుంది మరియు బాలెనో తర్వాత BS 6 ఇంజిన్ ని కలిగి ఉన్న రెండవ మారుతి కారుగా మారింది. 796CC యూనిట్ 48Ps పవర్ మరియు 69Nm అధిక టార్క్ ని అందిస్తూ దాని BS 6 అవతార్ కి ఒకే విధంగా ఉంటుంది, అయితే దాని ఇంధన సామర్ధ్యం మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది. పాత ఆల్టో 800 24.7Kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉండగా, నవీకరించబడిన యూనిట్ 22.05Kmpl మైలేజ్ ని కలిగి ఉంది. దీని ట్రాన్స్మిషన్ మాత్రం మారకుండా ఈ హాచ్బ్యాక్ ఒక 5-స్పీడ్ MT తో కొనసాగుతుంది.
ఇది పెద్దదా?
మారుతి సుజుకి ఆల్టో 800 (పాతది) |
మారుతి సుజుకి ఆల్టో (కొత్తది) |
|
పొడవు |
3430mm |
3445mm (+15mm) |
వెడల్పు |
1515mm (సైడ్ మౌల్డింగ్) |
1515mm (సైడ్ మౌల్డింగ్) |
ఎత్తు |
1475mm |
1475mm |
వీల్బేస్ |
2360mm |
2360mm |
గ్రౌండ్ క్లియరెన్స్ |
180mm |
- పొడవు తప్ప, నూతన ఆల్టో యొక్క ఇతర కొలతలు మునుపటి మోడల్ కి సమానంగా ఉంటాయి.
- పొడవు 15mm పెరుగుదల కారణంగా ముందు బంపర్ కొద్దిగా సవరించబడింది.
కొద్దిగా విభిన్నంగా కనిపిస్తోంది!
ఈ నవీకరణతో చాలా మార్పులు అయితే ఏమీ జరగలేదు. అయితే ప్రాథమిక సిల్హౌట్ అనేది ఒకేలా ఉంటుంది,కనీ దీనికి కొద్ది కొద్దిగా మార్పులని పొందింది. ముందర భాగానికి గనుక వచ్చినట్లయితే దీనికి సరికొత్త బంపర్ ని పొందుతుంది. అయితే పాత ఆల్టో సెంట్రల్ ఎయిర్‌డ్యాం వద్ద హారిజాంటల్ స్లాట్స్ ని కలిగి ఉంటుంది, అయినప్పటికీ, నవీకరించబడిన ఆల్టో లో ఫాగ్ లాంప్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అలాగే నవీకరించబడిన ఆల్టో కొత్త హనీ కోంబ్ మెషిన్ ని కలిగి ఉంటుంది. పైభాగానికి వెళ్ళినప్పుడు కొత్త ఆల్టో నవీకరించబడిన గ్రిల్ తో వస్తుంది, అయితే హెడ్ల్యాంప్స్ మాత్రం అదే విధంగా ఉన్నాయి.
ప్రక్కభాగంలో విషయాలు ఏమీ మార్పులు చోటు చేసుకోలదు, దీనిలో అలాగే ఒక శుభ్రమైన ప్రొఫైల్ తో దాని సూదిగా ఉండే భుజం లైన్స్ కారు పొడవునా అదే విధంగా ఉన్నాయి. ఆల్టో K10 నుండి స్వీకరించబడిన కొత్త ORVM లను మాత్రమే దీనిలో కనిపించే నవీకరణలో ఉంది. మునుపటి మోడల్ మాదిరిగా, ఆల్టో 145 -80 R12 టైర్ లో చుట్టబడిన 12 అంగుళాల స్టీల్ వీల్స్ (వీల్ క్యాప్లతో) నడుస్తుంది.
ఈ కథ వెనుకవైపు కూడా అదే విధంగా ఉంటుంది. 2019 ఆల్టో దానిని మార్చిన నమూనాకు సమానంగా కనిపిస్తుంది. దీనిలో వెనుక పార్కింగ్ సెన్సార్లను చేర్చడం మాత్రమే గుర్తించదగిన మార్పుగా కనిపిస్తుంది. ఈ ఏడాది జూలై 1 న అమల్లోకి రాబోయే భద్రతా నియమావళికి అనుగుణంగా కారుని తయారు చేయడానికి ఇది జరిగింది.
మారుతి హ్యాచ్బ్యాక్ కోసం కొత్త ఎరుపు రంగును కూడా పరిచయం చేసింది. అప్టౌన్ రెడ్ అని పిలవబడే ఈ రంగు, ఇది ముందు ఉన్న రెడ్ బ్లేజింగ్ ను భర్తీ చేస్తుంది.
క్రొత్త క్యాబిన్!
లోపల భాగంలో, ఆల్టో కి సరికొత్త డాష్బోర్డ్ ఆల్టో K10 నుండి తీసుకొచ్చి అమర్చడం జరిగింది, అలాగే అలాగే ఆల్టో K10 లో ఉన్న విధంగానే దీనిలో డ్యుయల్ టోన్ ఫినిషింగ్ అనేది ఉంది. అయితే దీనిలో ఆల్టో K10 లో కనిపించే నలుపు రంగు లేత గోధుమరంగుకు బదులుగా నలుపు-తెలుపు కలయిక వస్తుంది. కొత్త నమూనాలో, A.C వెంట్స్ సెంట్రల్ కన్సోల్ యొక్క ఎగువన కూర్చుని కొనసాగుతుంది, A.C నియంత్రణలు,సంగీత వ్యవస్థ కుడి దిగువన ఉంచడంతో అవి ఇప్పుడు తో ఒకే గృహంలో ఉంటాయి. పాత మోడల్ లో, A.C నియంత్రణ యూనిట్ A.C వెంట్లలో క్రింద ఉండేది, మరియు దాని క్రింద సంగీత వ్యవస్థ అనేది ఉండేది.
బాగా అమర్చబడింది
కొత్త ఆల్టో శరీరం రంగు బంపర్స్ ORVMs (అంతర్గతంగా సర్దుబాటు చేయగల), మాన్యువల్ A.C, ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ మరియు రిమోట్ కీలేస్ ఎంట్రీతో సెంట్రల్ లాక్లను పొందడం కొనసాగించింది. ఇది మ్యూజిక్ సిస్టమ్ (టాప్-స్పెక్ VXi వేరియంట్ లో) ను పొందింది, కానీ కొత్త మారుతి స్మార్ట్ ప్లే డాక్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో భర్తీ చేయబడింది, ఇది మీ స్మార్ట్‌ఫోన్ ని కాల్స్, మ్యూజిక్, నావిగేషన్ మరియు మరిన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక టచ్ ఇంటర్ఫేస్ గా ఉపయోగించుకుంటుంది.
ఎంత ఖర్చు అవుతుంది?
నవీకరణతో, మారుతి సంస్థ ఆల్టో యొక్క వేరియంట్ శ్రేణిని కూడా మారుస్తుంది. ఇది ఇప్పుడు VXi (O) తో సహా ఆరు రకాల్లో అందుబాటులో ఉన్న పాత కారు వలె కాకుండా, ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది: అవి వరుసగా STD, STD (O), LXi, LXi (O) మరియు VXi.
ధరల విషయానికి వస్తే కొత్త ఆల్టో ముందు దాని కంటే రూ. 27,000 కంటే ఎక్కువ ఖరీదుగా ఉంది. ధరల విషయానికి వస్తే పాత ఆల్టో ధర రూ. 2.67 లక్షలు ప్రారంభ ధరని కలిగి ఉండగా, ఇది రూ.2.94 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది.
ఇక్కడ ఒక వివరణాత్మక ధర పోలిక ఉంది:
వేరియంట్స్ |
పాత ధర |
కొత్త ధర |
వ్యత్యాశం |
Std |
రూ. 2.67 లక్షలు |
రూ. 2.94 లక్షలు |
+రూ. 27,000 |
Std (O) |
రూ. 2.73 లక్షలు |
రూ. 2.97 లక్షలు |
+రూ. 24,000 |
LXi |
రూ. 3.25 లక్షలు |
రూ. 3.50 లక్షలు |
+రూ. 25,000 |
LXi (O) |
రూ. 3.31 లక్షలు |
రూ. 3.54 లక్షలు |
+రూ. 24,000 |
VXi |
రూ. 3.44 లక్షలు |
రూ. 3.71 లక్షలు |
+రూ. 27,000 |
VXi (O) |
రూ. 3.50 లక్షలు |
నిలిపివేయబడింది |
Also Read: Maruti Celerio, Celerio X Updated; Get ABS, Rear Parking Sensors & More Standard Features
Read More on : Alto 800 on road price