2016 VW పోలో మరియు వెంటో వరుసగా రూ.5.33 లక్షలు మరియు రూ. 7.70 లక్షలు వద్ద ప్రారంభించబడ్డాయి
వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం manish ద్వారా ఫిబ్రవరి 02, 2016 03:21 pm ప్రచురించబడ ింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జర్మన్ వాహనతయాసంస్థ పోలో హ్యాచ్బ్యాక్ మరియు వెంటో సెడాన్ 2016 నవీకరణని ప్రారంభించింది. ఈ కార్లలో పొలో కి రూ. 5.33 లక్షల కి మరియు వెంటో కి రూ. 7.70 లక్షల ధరకి ప్రారంభించబడింది. వోక్స్వ్యాగన్ 2016 యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు, కానీ ఒక డైనమిక్ టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, ఆటో డిమ్మింగ్ IRVMs, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫోన్ బుక్ / SMS వీక్షణ మరియు మిర్రర్ లింక్ కనెక్టివిటీ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఫీచర్ నవీకరణలలు పోలో మరియు వెంటో రెండిటిలోని సమానంగా ఉన్నాయి. దీనిలో ముఖ్యమైన నవీకరణలలో ఒకటి మిర్రర్ లింక్ కనెక్టివిటీ ఇది సమాచార వినోద వ్యవస్థలోనికి మీ స్మార్ట్ఫోన్ యొక్క స్క్రీన్ ప్రతిబింబించేలా చేస్తుంది. రెయిన్ సెన్సార్ ఆటో అస్పష్టత IRVM లోనికి పొందుపరచబడింది మరియు ఇది కంపెనీ యొక్క రాబోయే సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ ఏమియో లోనికి వచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా, మిస్టర్ మైఖేల్ మేయర్ ఈ విధంగా అన్నారు " వెంటో మరియు పోలో భారత మార్కెట్లో ప్రారంభించబడిన దగ్గర నుండి ఉత్తమంగా అమ్ముడుపోయే వాహనాలలో ఒకటిగా ఉంది మరియు ఈ అధనపు లక్షణాల పరిచయాన్ని ప్రకటించినందుకుగానూ ఆనందంగా ఉన్నాము. భద్రతను మరింత పెంచేందుకు దీనిలో రెయిన్ సెన్సార్ మరియు ఆటో డిమ్మింగ్ IRVM వినియోగదారులకు మరింత భద్రతను అందించి సౌకర్యాన్ని కలిపిస్తుంది. మేము మా బ్రాండ్ కొత్త సమర్పణలు ద్వారా అభివృద్ధి చెందేందుకు కొనసాగుతున్నాము మరియు మరింతగా భారతదేశంలో మ సంస్థ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము." అని తెలిపారు.
ఇంజిన్ పరంగా ఈ పొలో వాహనం ముందు నవీకరించబడిన వేరియంట్ లో చూసినట్లు నాలుగు ఇంజన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. ఈ పవర్ట్రెయిన్ ఎంపికలలో 1.2-లీటర్ MPI మరియు TSI (GT వేరియంట్స్) పెట్రోల్ యూనిట్లు మరియు 1.5 లీటర్ TDI డీజిల్ మిల్లు, ఉన్నాయి. ఇది వరుసగా 88.7bhp మరియు 103bhp శక్తిని అందిస్తుంది.
వెంటో సెడాన్ కి అంబంధించినంతవరకూ ఇది పొలో లో చూసినటువంటి GT ట్యూనెడ్ 1.5 లీటర్ డీజిల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ మిల్లు కలిగి ఉంది. కానీ ఈ ప్రత్యేక సెడాన్ లో 103.5bhp శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా 1.6 లీటర్ పెట్రోల్ వేరియంట్ కూడా ఇదే శక్తిని అందిస్తుంది.
ఈ ఫీచర్ అప్డేట్లు జర్మన్ వాహనతయారి సంస్థకి పోటీ నెగ్గడంలో సహాయపడుతుంది. పొలో వాహనానికి మారుతి స్విఫ్ట్ నుండి అబార్త్ పుంటో ఈవో వంటి వాహనాలతో పోటీ పడుతుంది. వెంటో సెడాన్ కి హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్ మరియు మార్కెట్ లో ఆధిపత్యంలో ఉన్న హోండా సిటీ వంటి వాహనాలతో పోటీ పడుతుంది.