2016 పోర్స్చే 911 కెరీరా బహిర్గతం!
పోర్స్చే 911 2016-2019 కోసం konark ద్వారా సెప్టెంబర్ 08, 2015 10:58 am సవరించబడింది
- 11 Views
- ఒక వ్ యాఖ్యను వ్రాయండి
ముంబై: ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో కెరీరా ను చూసేందుకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. పోర్స్చే ఎంతగానో ఎదురుచూస్తున్న 2016 911 కెరీరా ను వెల్లడించింది. దీనిలో మార్పులు మధ్య ప్రధాన హైలైట్ ఒక కొత్త ఫ్లాట్ ఆరు టర్బోచార్జెడ్ ఇంజిన్ యొక్క చేరిక.
911 అలంకార పరంగా కొత్త టెయిల్ లైట్స్ మరియు 4 పాయింట్ డే రన్నింగ్ లైట్స్ తో హెడ్ల్యాంప్స్, నవీకరించబడిన డోర్ హ్యాండిల్స్ తో కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయి వీల్స్ మరియు 4 పాయింట్ బ్రేక్ లైట్స్ తో సవరించిన టెయిల్ గేట్స్ ఇవన్నీ కలిసి కారెరా వెనుక భాగాన్ని ముందు దాని కంటే పదునుగా చేశాయి. 911 ఇప్పుడు ఆక్టివ్ ఎయిర్ డక్స్ అనే లక్షణాన్ని కలిగి ఉంది. ఈ లక్షణం ఎయిర్ ఫ్లో ని , నియంత్రించి టర్బోచార్జర్స్ మరియు ఇంటర్ కూలర్ ని చల్లబరిచేందుకు సహాయపడుతుంది.
అన్ని కెరీరా మోడల్స్ ఇప్పుడు పోర్స్చే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్మెంట్ (పిఎ ఎస్ ఎం) ని పొంది ఉంది. ప్రమాణంగా 10mm ద్వారా రైడ్ ఎత్తును తగ్గించి మంచి గ్రిప్ ని అందించేనందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, కొత్త తరం షాకర్స్ మరింత కచ్చితత్వం మరియు సమృద్ధ సౌకర్యం అందిస్తాయి.
కొత్త 911 కెరీరా కొత్త 3.0 లీటర్, ట్విన్-టర్బో ఫ్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 6500rpm వద్ద 365bhp శక్తిని మరియు 1700-5000rpm వద్ద 450Nm టార్క్ ని అందిస్తుంది. కెరీరా ఎస్ అదే 3 లీటరు ఫ్లాట్ సిక్స్ ఇంజిన్ తో అమర్చబడి 414bhp శక్తిని మరియు 500Nm టార్క్ ని అందిస్తుంది. పోర్స్చే సెవెన్ స్పీడ్ ఆటోమెటిక్ పిడికె డ్యుయల్ క్లచ్ తో సెవెన్ స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ని 911లో అందిస్తుంది.
కెరీరా గరిష్టంగా 295kmph అత్యధిక వేగం చేరుకోగలిగితే, కెరీరా ఎస్ 307kmph వేగం చేరుకుంటుంది. పెరిగిన శక్తి ఉత్పాదకతో పాటు, కొత్త కెరీరా మరింత సమర్థవంతమైన ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మునుపటి మోడల్ కంటే దీని ఇంజిన్ 12 శాతం ఎక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉందని పోర్స్చే తెలిపింది. 911 రైడ్ ఎత్తు కూడా హైడ్రాలిక్ లిఫ్టింగ్ ఫంక్షన్ తో 5 సెకన్లలో 40mm చేరుకోగలదు. 911కెరీరా ఇప్పుడు 911 టర్బో మరియు జిటి3 నుండి నాలుగు చక్రాల స్టీరింగ్ సిస్టమ్ ను స్వీకరించింది.
కొత్త 911 అంతర్భాగాలలో ముందరి భాగం 7-అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ తో పాటూ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ రెండిటినీ కలిగియున్న ప్రామాణిక నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉంది. కొత్త నవీకరణలు మరియు కొత్త ఫ్లాట్ సిక్స్ తో కెరీరా ఐచ్ఛిక స్పోర్ట్ క్రోనో ప్యాకేజీ తో 4.2 సెకన్లలో 0-100 కిలోమీటర్లు చేరుకుంటుంది.
0 out of 0 found this helpful