• English
  • Login / Register

చివరగా బహిర్గతం అయిన 2016 మిత్సుబిషి పజెరో స్పోర్ట్ / చాలెంజర్

మిత్సుబిషి పజెరో కోసం nabeel ద్వారా ఆగష్టు 01, 2015 02:35 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వినియోగదారులను చాలా కాలం ఎదురు చూసేలా చేసాక , మిత్సుబిషి చివరకు తదుపరి తరం పజెరో స్పోర్ట్ / ఛాలెంజర్ ను బహిర్గతం చేసింది. ఈ మిడ్ సైజెడ్ ఎస్యువి యొక్క ముందరిభాగం ఔట్ లాండర్ స్పోర్ట్ ని కలిగిఉన్న సంస్థ యొక్క కొత్త "డైనమిక్ షీల్డ్" ని అనుసరిస్తుంది. దీని ముందర భాగం సన్నని అంచు గల ఎల్ ఇడి లైట్లతో సన్నని హెడ్లైట్లు కలిగి ఉంటుంది. దీనిలో ఫాగ్ల్యాంప్స్ బంపర్ కింద అమర్చబడి ఉంటాయి. దీని ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్స్ ఉన్న కారణంగా మరిన్ త ఆకర్షణీయత చేకూరుతుంది. 

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, వాహనం యొక్క ముందు నుండి వెనుక భాగం చివరి వరకూ సాగదీసి ఉంటుంది. వెనుక వీల్ కు మరియు వీల్ ఆర్చ్ కు మధ్య క్యాప్ బిగించబడి ఉంటుంది. ఇది అంత ఆకర్షణీయంగా కనబడటం లేదు. ఈ పజీరో యొక్క హెడ్లైట్ క్లస్టర్ నుండి టైల్ లైట్ క్లస్టర్ వరకు మద్య ఉన్న బాడీ లైన్స్ ఉండటం వలన ఈ వాహనం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. వెనుక భాగం విషయానికి వస్తే, రేర్ లుక్స్ చాలా బాగుంటాయి. ఎందుచేతనంటే, వెనుక భాగం లో ఉన్న టైల్ లైట్ క్లస్టర్ నుండి బంపర్ వరకు ఉన్న ఆకర్షణీయమైన భాగం వలన వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. టైల్ లైట్స్ తో పాటు బంపర్ కూడా బాడీ లైన్స్ ను కలిగి ఉంటుంది. వీటి వలన ఈ వాహనం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.

ఈ వాహనం లోపలి భాగం విషయానికి వస్తే, ఈ పజెరో చక్కగా సౌకర్యవంతంగా కనిపిస్తోంది. ఈ వాహనం, లెధర్ సీట్లను, నిగనిగలాడే నలుపు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన సమాచార వ్యవస్థ కోసం ఒక పెద్ద సెంటర్ డిస్ప్లే ను కలిగి చెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, క్యాబిన్ ప్రీమియంగా కనిపిస్తుంది. పజెరో మొదటిసారి విద్యుత్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది. హుడ్ క్రింది భాగానికి వస్తే, ఈ వాహనం 2.4 లీటర్ ఎం ఐ వి ఈ సి టర్బో డీజిల్ ఇంజన్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

ఈ వాహనం థాయిలాండ్ లో ఈ సంవత్సరం అమ్మకానికి రాబోతుంది. త్వరలోనే ఆ తర్వాత ఈ ఎస్యువి, ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, మిడ్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు రష్యా ల లోనే కాకుండా 90 కంటే ఎక్కువ దేశాల్లో అమ్మకానికి రాబోతుంది. భారత మార్కెట్ విషయానికి వస్తే, ఈ నవీకరించబడిన పజీరో 2016 లో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

was this article helpful ?

Write your Comment on Mitsubishi పజెరో

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience