• English
  • Login / Register

మిత్సుబిషి ఫైనల్ ఎడిషన్ 2015 వివరాలను చూడండి

అక్టోబర్ 06, 2015 05:51 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మిత్సుబిషి వారు వారి ప్రపంచ ప్రఖ్యాత చెందిన లాన్సర్ ఈవో ని భారతదేశం లో 2015 మిత్సుబిషి లాన్సర్ ఈవొల్యూషన్ ఫైనల్ ఎడిషన్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుత GSR మోడల్ ఆధారితంగా దీనిలోని లక్షణాలు ఉంటాయి. 

ఇందులో నలుపు రంగు అలుమినం పై కప్పు, మెరిసే నలుపు బంపర్ ఉండి ఈ కారు ర్యాలీ రెడ్, ఆక్టేన్ బ్లూ, పర్ల్ వైట్ మరియూ మెర్క్యూరీ గ్రే వంటి రంగులలో లభ్యం అవుతుంది. ఇంకా క్రోము పూత గల గ్రిల్లు ఇంకా బాహ్యపు వెంట్స్ పై కూడా నలుపు పూత కనపడుతుంది. ఈ కారు ఎంకేయ్ అల్లోయ్ వీల్స్ పై అమర్చగా ఒక మెరుపు గల సెంటర్ బంపర్ కలదు.

లోపల వైపు, నలుపు హెడ్ లైనర్, పిల్లర్లు ఇంకా సన్ వైజర్ ఉంటాయి. ఇది లిమిటెడ్ ఎడిషన్ అవడం వలన, క్యాబిన్ లోని సెంట్రల్ కన్సోల్ పైన ఈ కారు సంఖ్య గల ఒక నంబర్ ప్లేక్ ఉంటుంది. లోపల వైపున పై కప్పు కి నలుపు ఉండటమే కాకుండా సీట్లు కూడ నలుపులో అందంగా ఉంటాయి. ఆల్ బ్లాక్ గేర్ నాబ్, స్టీరింగ్ వీల్, ఫ్లోర్ మ్యాట్స్ ఇంకా కన్సోల్ లిడ్స్ పైన ఎర్రటి పూతలు చూడవచ్చును.

ఫైనల్ ఎడిషన్ ఈవో ప్రస్తుత 2.0 లీటర్ టర్బో ఫోర్ జిఎస్ఆర్ ఇంజిన్ ని కలిగియుండి 6,500ఆర్పిఎం వద్ద 303బిహెచ్పి శక్తిని మరియు 4000ఆర్పిఎం వద్ద  414ఎన్ఎం టార్క్ ని అందిస్తుంది. సాధారణ జిఎస్ఆర్ 291బిహెచ్పి  శక్తిని మరియు 407ఎన్ఎం టార్క్ ని మాత్రమే అందించగలదు, దీనితో పోలిస్తే ఇది ఒక గణనీయమైన నవీకరణ చెందినట్టుగా చెప్పవచ్చు.

ఈ పవర్ ప్లాంట్ ఒక 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు మిత్సుబిషి యొక్క ఎడబ్లుడి సిస్టం, అన్ని నాలుగు మూలల్లో బిల్స్టేయిన్ షాక్అబ్జార్బర్స్ మరియు ఐబాచ్ స్ప్రింగ్స్ తో అమర్చబడియున్న సూపర్ ఆల్ వీల్ కంట్రోల్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది. ముందరి భాగంలో కారు యొక్క హ్యాండిలింగ్ ని మెరుగుపరిచే టూ పీస్ బ్రెంబో బ్రేక్ రోటార్స్ ని కూడా కలిగి ఉంది.

ఫైనల్ ఎడిషన్ యుఎస్ లో $ 37,995 (రూ. 24,80,406) ధర కలిగి ఉండి కేవలం 1,600 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience