• English
  • Login / Register

# 2015LAAutoShow: 2016 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ చిన్నపాటి ఫేస్లిఫ్ట్ ని పొందింది

మిత్సుబిషి పజెరో కోసం bala subramaniam ద్వారా నవంబర్ 20, 2015 01:24 pm ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ని స్టైలింగ్ మరియు ఇతర నవీకరించబడిన లక్షణాలతో బహిర్గతం చేసింది. మిత్సుబిషి యొక్క ఉత్తమ అమ్మకాల CUV ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ఇప్పుడు బోల్డ్ బాహ్య భాగాలను పొందింది. దీనికి గానూ బ్రాండ్ యొక్క "డైనమిక్ షీల్డ్" ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిలో LED టర్న్ ఇండికేటర్స్ తో పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, వీల్ లిప్ మౌల్డింగ్స్, హోం లింక్ తో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్ డెజైన్ కూడా అందుబాటులో ఉంటాయి.

"ఔట్‌ల్యాండ్ స్పోర్ట్ మిత్సుబిషి మోటార్స్ యొక్క బ్రాండ్ లీడర్ మరియు మేము దృష్టిని ఎంతగానో ఆకర్షించే ఈ 2016 మోడల్ ఇయర్ ని బహిర్గతం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము." అని MMNA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వేరింజన్ తెలిపారు. "ఔట్‌ల్యాండర్ స్పోర్ట్ ఎల్లప్పుడూ విశ్వసనీయత మరియు విలువ అందించే ఒక ఆహ్లాదకరమైన వాహనం మరియు 2016 మోడల్ ఇయర్ వెర్షన్ మిత్సుబిషి CUV శ్రేణి లక్షణాలకు అనుగుణంగా ఉంటూ నవీకరణలతో రాబోతుంది ." అని తదుపరి జోడించారు.

అంతర్భాగాలలో కొత్త ఔట్‌ల్యాండ్ స్పోర్ట్ పునఃరూపకల్పన చేయబడిన స్టీరింగ్ వీల్, కొత్త 6.1 డిస్ప్లే ఆడియో, అధిక నాణ్యత గల సీటు ఫాబ్రిక్స్ మరియు కొత్త లైట్ గ్రే ఇంటీరియర్ ఆప్షన్ వంటి వాటిని కలిగి ఉంది. అలానే ఆధునిక సెవెన్ ఎయిర్ బ్యాగ్ SRS సిస్టం మరియు మిత్సుబిషి యొక్క పేటెంట్ రీన్ఫోర్స్డ్ ప్రభావ భద్రతా ఎవల్యూషన్ (RISE) సేఫ్టీ సెల్ బాడీ నిర్మాణం వంటి భద్రత అంశాలను కలిగి ఉంది. కూల్ సిల్వర్, డైమండ్ వైట్ పెర్ల్ మరియు క్వార్ట్జ్ బ్రౌన్ అను మూడు బాహ్య రంగులలో అందుబాటులో ఉంది.

ఇంజిన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే ఉన్న ఇంజిన్ లైనప్ ని ఉపయోగించవచ్చని అంచనా. అంటే 148hp శక్తిని అందించే 2.0 లీటర్ ఇంజన్ లేదా 168hp శక్తిని అందించే 2.4-లీటర్ ఇంజిన్ మధ్య ఎంపిక చేసుకోవచ్చు. అలానే ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక CVT ఎంపిక తో జత చేయబడి ఉండవచ్చు.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your Comment on Mitsubishi పజెరో

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience