2016 మెర్సిడెస్ బెంజ్ ఇ - క్లాస్ టీజర్ వీడియో మరియు స్కెచ్ లని బహిర్గతం చేసింది .

ప్రచురించబడుట పైన Jan 05, 2016 11:27 AM ద్వారా Nabeel for మెర్సిడెస్-బెంజ్ బెంజ్

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mercedes-Benz E-Class

మెర్సిడెస్ బెంజ్ 2016 లో అద్భుతమయిన ప్రారంభం చేయాలనీ నిర్ణయించింది. ఇది దాని రాబోయే E- క్లాస్  సెడాన్ యొక్క స్కెచ్ ని జనవరి 11,2016 న ,ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా ప్రకటించబోతోంది. జర్మన్ వాహన తయారీదారులు ఈ స్కెచ్ తో పాటూ కారు యొక్క ముఖ్య భాగాలు అయినటువంటి 84 విడి విడి నియంత్రిత సామర్ద్యం కలిగిన ,అధిక పనితనం గల ఎల్ ఇ డి ని కలిగి ఉన్నటువంటి మల్టీ భీమ్ ఎల్ ఇ డి హెడ్ల్యాంప్స్, యొక్క టీజర్ వీడియో విడుదల చేసారు. ఈ వివరాలని ఇది జనవరి 1, 2016 న్యూ ఇయర్ లో వెల్లడించబోతోంది. 

Mercedes-Benz E-Class

దీనికి ముందు ఒక వీడియో, కారు లోని లోపలి భాగాలు మరియు డిజిటల్ డాష్బోర్డ్ ని , బహిర్గతం చేసింది. కానీ S-క్లాస్ 'విడిగా స్క్రీన్లను కాకుండా, E- క్లాస్ ఒకే యూనిట్ లోపల రెండు 12.3 " డిస్ప్లే లని కలిగి ఉంది.  ఈ కారు 2016 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షో (NAIAS) వద్ద డెట్రాయిట్ లో ఆవిష్కరించబడుతుంది . ఇప్పటిదాకా వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కారు కొత్త మెర్సిడెస్-బెంజ్ డిజైన్ ని అనుసరించినట్లు కనిపిస్తుంది. దీనిని S మరియు C-క్లాస్ సెడాన్ లో చూడవచ్చు. దీని యొక్క ముందు భాగం అగ్రేస్సివ్ లుక్ ని కలిగి ఉండి మూడు స్టార్లు కలిగిన 2 స్లాట్ గ్రిల్ ని కలిగి ఉంటుంది. ఈ కారు ఆడి A6 మరియు బి ఎం డబ్ల్ల్యు 5 - సీరీస్ కి వ్యతిరేకంగా పోటీ చేయబోతోంది. 

Mercedes-Benz E-Class

ఈ ప్రపంచ ప్రదర్శన మెర్సిడెస్ బెంజ్ GLE Coupe ని ప్రారంభించే ఒక రోజు ముందు జరుగుతాయి. GLE కూపే ధర BMW యొక్క X6 పోటీగా రూ. 85-90 లక్ష గా ఉండబోతోంది. ఇది 3.0-లీటర్ ద్వి టర్బో V6 పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉండి 357bhp శక్తిని మరియు 520 Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క టార్క్ గణాంకాలు దాని తోటి జర్మన్ ప్రత్యర్థి వాహనం కన్నా 110Nm తక్కువ ఉన్నప్పటికీ, 48 bhp కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని ఇంజిన్ ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందో తెలుసుకోవాలంటే  మనం దీని ప్రారంభం దాకా వేచి చూడాల్సిందే.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మెర్సిడెస్-బెంజ్ బెంజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?